వన్డేల్లో 350 స్కోరు కొట్టడం అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. అయితే ఫస్ట్ బ్యాటింగ్ టైమ్‌లో మూడొందల పైచిలుకు స్కోరు కొట్టడం మామూలే అయినా ఛేజింగ్ చేయడం మాత్రం అంత ఈజీ కాదు. పిచ్ ఎంత బ్యాటింగ్‌కు అనుకూలించినా అంత స్కోరును రీచ్ అవ్వడం చాలా కష్టం. అందులోనూ ఆరంభంలోనే వికెట్లు పడితే ఒత్తిడి పెరుగుతుంది. ఒకవైపు వికెట్లు కాపాడుకుంటూ మరోవైపు స్కోరు బోర్డును పరిగెత్తించాల్సి ఉంటుంది. అయితే ఈ ఛాలెంజ్‌లో దాయాది పాకిస్థాన్ సక్సెస్ అయింది. ఉప్పల్ వేదికగా శ్రీలంకతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పాక్ 345 రన్స్ టార్గెట్‌ను 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మరో 10 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది.
భారీ టార్గెట్‌ను పాకిస్థాన్ ఛేజ్ చేయడంలో సీనియర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ (131 నాటౌట్) కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ బాబర్ ఆజం (10)తో పాటు ఇమాముల్ హక్ (12) త్వరగానే ఔటవ్వడంతో రిజ్వాన్ బాధ్యత తీసుకున్నాడు. వీళ్లిద్దరూ ఎంతో పట్టుదలతో బ్యాటింగ్ చేసి స్కోరు బోర్డుపై ఒక్కో రన్ చేర్చారు. ఒక్కసారి క్రీజులో సెట్ అయ్యాక బిగ్ షాట్స్ ఆడటం మొదలుపెట్టారు. అటు వికెట్లు పడక.. ఇటు రన్స్ కూడా ఆపలేక లంక బౌలర్లు ఆడియెన్స్‌లా మారిపోయారు. ఆ టీమ్ ఫీల్డింగ్ ఫెయిల్యూర్ కూడా పాక్‌కు కలిసొచ్చింది. చివర్లో షఫీక్ ఔటైనా సాద్ షకీల్ (31), ఇఫ్తికార్ అహ్మద్ (22 నాటౌట్)తో కలసి మ్యాచ్‌ను రిజ్వాన్ ఫినిష్ చేశాడు.
సెంచరీతో పాక్‌ను గెలిపించడం వరకు బాగానే ఉన్నా లంకతో మ్యాచ్‌లో మహ్మద్ రిజ్వాన్ ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అతడు చేసిన అతితో దాయాది జట్టు పరువు పోయింది. ఈ మ్యాచ్ జరిగిన హైదరాబాద్‌లో తీవ్ర ఉక్కపోత ఉండటంతో ఆటగాళ్లు త్వరగా అలసిపోయారు. ఎక్కువ సేపు బ్యాటింగ్ చేసిన రిజ్వాన్ కూడా ఉక్కపోతను తట్టుకోలేకపోయాడు. అతడు 80 రన్స్ వద్ద ఉన్నప్పుడు కండరాలు కూడా పట్టేశాయి. దీంతో బాధతో విలవిల్లాడిన రిజ్వాన్.. పెయిన్ కిల్లర్స్ సాయంతో తిరిగి బ్యాటింగ్ కంటిన్యూ చేశాడు.
ట్రీట్మెంట్ తీసుకున్నాక కూడా పలుమార్లు గాయంతో బాధపడుతున్నట్లు, కుంటుతున్నట్లు కనిపించాడు రిజ్వాన్. దీంతో అతడికి ఏమైందని.. నెక్స్ట్ మ్యాచ్ ఆడతాడా లేదా అని పాకిస్థాన్ ఫ్యాన్స్ భయపడ్డారు. ఆ టైమ్‌లో కామెంట్రీ చేస్తున్న సైమన్ డౌల్ మాట్లాడుతూ ‘రిజ్వాన్‌ను సినిమాల్లోకి తీసుకోవాలి’ అని చెప్పడం వినిపించింది. ఇదంతా చూసిన అభిమానులు అసలేం జరుగుతుందో తెలియక కన్ఫ్యూజ్ అయ్యారు. అయితే ఇదంతా నిజం కాదని స్వయంగా అతడే చెప్పాడు. మ్యాచ్ అనంతరం రిజ్వాన్ మాట్లాడుతూ.. కొన్నిసార్లు నొప్పితో బాధపడిన మాట వాస్తమేనని.. కానీ ఇంకొన్ని సార్లు నటించానని నవ్వుతూ చెప్పాడు. దీంతో రిజ్వాన్‌పై ట్రోలింగ్ జరుగుతోంది. క్రికెట్ కాదు.. వెళ్లి సినిమాలు చేసుకోమంటూ అతడిపై నెటిజన్స్ విమర్శలకు దిగుతున్నారు. రిజ్వాన్ అతి వల్ల పాక్ మరోమారు పరువు పోగొట్టుకుందని ఆ దేశ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. మరి.. రిజ్వాన్ ఓవరాక్షన్‌పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఇండియన్ గ్రౌండ్స్‌పై బాబర్ సెటైర్స్! కట్ చేస్తే అట్టర్ ఫ్లాప్!
“Get Rizwan in the movies”
– Simon Doull (on air) #PAKvsSL | #Rizwan | #CWC23 | pic.twitter.com/SLFTzq7xCA
— Samin Haque 🇧🇩 (@imSamin) October 10, 2023
“Sometimes it cramps, sometimes it’s acting”
Rizzy scheme out kartay huwy 😂 #PAKvSL #rizwan pic.twitter.com/8bntCXRqZN— Haseeb A. (@_HASEEB20) October 10, 2023