క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన వన్డే వరల్డ్ కప్ ఎట్టకేలకు స్టార్ట్ అయింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్-రన్నరప్ న్యూజిలాండ్ మధ్య జరిగిన ఓపెనింగ్ మ్యాచ్ అందర్నీ అలరించింది. అయితే ఈ మ్యాచ్ అనుకున్నంత రసవత్తరంగా జరగలేదు. కివీస్ టీమ్ ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్తో చెలరేగి ఆడింది. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ దుమ్మురేపడంతో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లీష్ టీమ్ చిత్తయింది. ఈ మ్యాచ్ ముగియడంతో ఇప్పుడు అందరి ఫోకస్ భారత్ ఆడే మ్యాచులపై పడింది. అక్టోబర్ 8వ తేదీన ఆస్ట్రేలియాతో ఆడే మ్యాచ్‌తో టీమిండియా ప్రపంచ కప్ వేటను మొదలుపెట్టనుంది. ఆ తర్వాతి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌తో ఆడనున్న భారత్.. మూడో మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌తో తాడోపేడో తేల్చుకోనుంది.
ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ చూసేందుకు వరల్డ్ వైడ్‌గా ఉన్న క్రికెట్ అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ 14వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. వరల్డ్ కప్‌లోనే ఫుల్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ అహ్మదాబాద్‌కు రానున్నారు. దీంతో అక్కడి హోటల్స్‌కు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఆ మ్యాచ్ రోజు వివిధ సిటీస్ నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లే ఫ్లైట్ టికెట్ రేట్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ తరుణంలో క్రికెట్ ఫ్యాన్స్‌కు ఇండియన్ రైల్వేస్ గుడ్ న్యూస్ చెప్పింది. భారత్-పాక్ మ్యాచ్ జరిగే రోజున రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి అహ్మదాబాద్‌కు స్పెషల్ వందే భారత్ ట్రైన్స్‌ను నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. త్వరలోనే ఈ ట్రైన్స్ షెడ్యూల్, టికెట్ రేట్స్ తదితర వివరాలు వెల్లడిస్తామని తెలిపింది.
భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్‌లోని హోటల్స్ రేట్స్, ఫ్లైట్ టికెట్ రేట్స్ భారీగా పెరిగిన నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్‌కు ఉపశమనం కలిగించేందుకు వందే భారత్ స్పెషల్ సర్వీసులను నడపాలని డిసైడ్ అయినట్లు రైల్వే శాఖ ఉన్నతాధికారి ఒకరు నేషనల్ మీడియాకు తెలిపారు. మ్యాచ్ స్టార్ట్ కావడానికి కొన్ని గంటల ముందు ఈ ట్రైన్స్ సబర్మతీ, అహ్మదాబాద్ స్టేషన్లకు చేరుకుంటాయన్నారు. ఈ రెండు స్టేషన్లు మ్యాచ్ జరిగే నరేంద్ర మోడీ స్టేడియానికి దగ్గరగా ఉండటంతో అభిమానులు ఈజీగా అక్కడికి చేరుకోవచ్చన్నారు. అలాగే మ్యాచ్ ముగిసిన కొన్ని గంటల తర్వాత ఈ ట్రైన్స్ అహ్మదాబాద్ నుంచి తిరిగి బయల్దేరతాయని పేర్కొన్నారు. దీని వల్ల క్రికెట్ అభిమానులు అదే రోజు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకోవచ్చని తెలిపారు.
ఇదీ చదవండి: ఆ నాలుగు టీమ్స్ సెమీస్‌కు చేరతాయి.. వరల్డ్ కప్‌పై సచిన్ ప్రెడిక్షన్!
#ICCWorldCup2023 | #IndianRailways to run Vande Bharat trains to Ahmedabad for cricket fans.https://t.co/iQDmHFej2A
— Mint (@livemint) October 6, 2023