వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మను ఆస్ట్రేలియా అవమానించింది. దీంతో హిట్‌మ్యాన్ కంగారూ టీమ్‌పై కోపంతో రగిలిపోతున్నాడు.
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మను ఆస్ట్రేలియా అవమానించింది. దీంతో హిట్‌మ్యాన్ కంగారూ టీమ్‌పై కోపంతో రగిలిపోతున్నాడు.
వన్డే వరల్డ్ కప్-2023 లాస్ట్ స్టేజ్‌కు చేరుకుంది. మెగా టోర్నీలో ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. క్రికెట్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ప్రపంచ కప్ కోసం టీమిండియా, ఆస్ట్రేలియాలు పోటీపడనున్నాయి. ఫైనల్ ఫైట్‌లో ఈ రెండు టీమ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. 2003 వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమికి రివేంజ్ తీర్చుకోవాలని భారత్ అనుకుంటోంది. వరుస విజయాలతో ఫైనల్‌కు చేరుకున్న రోహిత్ సేన.. తుది సమరంలోనూ నెగ్గితే 13 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న వరల్డ్ కప్ డ్రీమ్ నెరవేరుతుంది. టీమిండియా గెలిస్తే చూడాలని కోట్లాది మంది భారతీయులు ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో మన జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను ఆస్ట్రేలియా అవమానించడం చర్చనీయాంశంగా మారింది.
ఈ వరల్డ్ కప్‌లో బ్యాటింగ్‌లో దుమ్మురేపుతున్న రోహిత్ శర్మ (550 రన్స్).. కెప్టెన్సీలోనూ తన మార్క్‌ను చాటుకుంటున్నాడు. బౌలర్లు, బ్యాటర్లకు అవసరమైన సలహాలు ఇస్తూ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. టీమ్ ప్రెజర్‌ను తాను తీసుకొని మిగతా ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడేలా చూసుకుంటున్నాడు హిట్‌మ్యాన్. అలాంటి రోహిత్‌ను అనుమానించింది ఆసీస్. క్రికెట్ ఆస్ట్రేలియా రీసెంట్గా వరల్డ్ కప్-2023 టీమ్‌ను ప్రకటించింది. మెగా టోర్నీలో సత్తా చాటిన ప్లేయర్లను సెలెక్ట్ చేసి.. 11 మందితో బెస్ట్ ఎలెవన్ లిస్ట్‌ను రిలీజ్ చేసింది. లీడింగ్ స్కోరర్‌గా ఉన్న విరాట్ కోహ్లీ, స్టార్ ఆల్‌రౌండర రవీంద్ర జడేజా, పేస్ ద్వయం జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీను టీమ్‌లోకి తీసుకుంది.
సెమీస్ నుంచి వైదొలిగిన సౌతాఫ్రికా టీమ్ నుంచి క్వింటన్ డికాక్, మార్క్రమ్, మార్కో యాన్సెన్‌కు టీమ్‌లో చోటు ఇచ్చింది క్రికెట్ ఆస్ట్రేలియా. కంగారూ జట్టు నుంచి మంచి ఫామ్‌లో ఉన్న డేవిడ్ వార్నర్, మాక్స్‌వెల్‌తో పాటు ఆడమ్ జంపాను ఎలెవన్‌లో చేర్చింది. వీరితో పాటు న్యూజిలాండ్ సంచలనం రచిన్ రవీంద్రను టాప్ ప్లేయర్‌గా చోటు కల్పించింది. అయితే భీకర ఫామ్‌లో ఉన్న భారత కెప్టెన్ రోహిత్ శర్మను మాత్రం తన ప్రపంచ కప్ టీమ్‌లోకి తీసుకోలేదు క్రికెట్ ఆస్ట్రేలియా. హిట్‌మ్యాన్ కంటే తక్కువ రన్స్ చేసిన వార్నర్‌ను తమ జట్టులోకి తీసుకుంది. కానీ టీమిండియా సారథిని మాత్రం కావాలనే పక్కన పెట్టింది.
బెస్ట్ ఎలెవన్‌లో రోహిత్ శర్మకు చోటు ఇవ్వకపోవడం ద్వారా అతడ్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలనేది కంగారూల ప్లాన్‌గా కనిపిస్తోంది. ఇది తెలిసిన ఇండియన్ ఫ్యాన్స్ ఆసీస్‌పై సీరియస్ అవుతున్నారు. రోహిత్ బ్యాటింగ్‌కు ప్రపంచమే ఫిదా అవుతోందని.. మీ కళ్లకు అతడి సత్తా కనిపించడం లేదా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా తనతో వ్యవహరించిన తీరుపై హిట్‌మ్యాన్ కూడా సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఫైనల్‌కు ముందు ఆ టీమ్‌పై కోపంతో రగిలిపోతున్నాడు రోహిత్. ఆసీస్ మీద పగ తీర్చుకునేందుకు ఇదే కరెక్ట్ టైమ్ అని అతడి ఫ్యాన్స్ అంటున్నారు. ఆల్రెడీ భీకర ఫామ్‌లో ఉన్న హిట్‌మ్యాన్‌కు ఆసీస్ చేసిన అవమానం మరింత రెచ్చిపోయి ఆడేందుకు అవకాశం ఇచ్చినట్లే కనిపిస్తోంది. మరి.. ఫైనల్ ఫైట్‌లో ఆస్ట్రేలియా మీద రోహిత్ పగ తీర్చుకుంటాడని మీరు భావిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వరల్డ్ కప్ ముగింపు వేడుకల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా దువా లిపా!
Cricket Australia’s cricket com au dropped their best XI of Cricket World Cup 2023.
Agree with this XI? pic.twitter.com/c9FeAcBywM
— CricTracker (@Cricketracker) November 13, 2023