ICC T20I Rankings Ruturaj Gaikwad In Top 10: రోహిత్, కోహ్లీ పరువు కాపాడిన రుతురాజ్.. ఇక టీమిండియా ఫ్యూచర్​కు ఢోకా లేదు!

రోహిత్, కోహ్లీ పరువు కాపాడిన రుతురాజ్.. ఇక టీమిండియా ఫ్యూచర్​కు ఢోకా లేదు!

టీమిండియా యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ అదరగొడుతున్నాడు. జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో సూపర్బ్ నాక్​తో ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లీ స్టైల్​లో యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతూ ఆఖర్లో విధ్వంసం సృష్టించాడు.

టీమిండియా యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ అదరగొడుతున్నాడు. జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో సూపర్బ్ నాక్​తో ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లీ స్టైల్​లో యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతూ ఆఖర్లో విధ్వంసం సృష్టించాడు.

టీమిండియా యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ అదరగొడుతున్నాడు. జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో సూపర్బ్ నాక్​తో ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లీ స్టైల్​లో యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతూ ఆఖర్లో విధ్వంసం సృష్టించాడు. మొదటి మ్యాచ్​లో ఫెయిలైన రుతురాజ్.. సెకండ్ టీ20లో మాత్రం తన అసలైన గేమ్​ను బయటకు తీశాడు. శుబ్​మన్ గిల్ త్వరగా ఔట్ అవడంతో క్రీజులోకి వచ్చిన గైక్వాడ్ అక్కడ పాతుకుపోయాడు. దంచుడు మొదలుపెట్టిన సెంచరీ హీరో అభిషేక్ శర్మకు అండగా నిలబడ్డాడు. ఒక్కసారి అభిషేక్ ఔట్ అయ్యాక రింకూ సింగ్​తో కలసి విధ్వంసం సృష్టించాడు. అప్పటివరకు మెళ్లగా ఆడుతూ వచ్చిన రుతురాజ్.. ఆ తర్వాత బౌండరీల వర్షం కురిపించాడు. ఓవరాల్​గా ఆ మ్యాచ్​లో 47 బంతుల్లో 77 పరుగులతో నాటౌగా నిలిచాడు. మూడో టీ20లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు గైక్వాడ్.

జింబాబ్వే సిరీస్​లో అదరగొడుతున్న రుతురాజ్.. లెజెండరీ బ్యాటర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పరువు నిలబెట్టాడు. ఐసీసీ ర్యాంకింగ్స్​లో గైక్వాడ్ మెరిశాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్​లో 7వ స్థానాన్ని దక్కించుకున్నాడతను. ఇంతకుముందు వరకు 20వ పొజిషన్​లో ఉన్న రుతురాజ్.. తాజాగా పదమూడు స్థానాలు ఎగబాకి ఏడో ప్లేస్​లో నిలిచాడు. టీ20ల్లో సెకండ్ హయ్యెస్ట్ ర్యాంక్​ సాధించిన భారత బ్యాటర్​గా అతడు అరుదైన ఘనతను అందుకున్నాడు. యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా ర్యాంకింగ్స్​లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతడు 75వ స్థానాన్ని దక్కించుకున్నాడు. టీ20 ర్యాంకింగ్స్​లో ఫస్ట్ ప్లేస్​లో ఆస్ట్రేలియా విధ్వంసకారుడు ట్రావిస్ హెడ్ నిలిచాడు. అతడి తర్వాత స్థానంలో మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు.

టీ20 ర్యాంకింగ్స్​లో మూడో స్థానంలో ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్, నాలుగో ప్లేస్​లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం నిలిచారు. ఐదో స్థానంలో మరో పాక్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్, సిక్త్ పొజిషన్​లో ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ ఉన్నారు. ఈ లిస్ట్​లో టాప్​-10లో సూర్యకుమార్​తో పాటు భారత్ నుంచి గైక్వాడ్ స్థానం దక్కించుకున్నాడు. మొన్నటి వరకు ఫస్ట్ ప్లేస్​లో ఉన్న సూర్య ఒక స్థానం దిగజారగా.. గైక్వాడ్ టాప్​-7లోకి వచ్చి అందర్నీ సర్​ప్రైజ్ చేశాడు. రోహిత్, కోహ్లీలు గత దశాబ్ద కాలంలో ఐసీసీ ర్యాంకింగ్స్​ను రూల్ చేశారు. ఈ మధ్య ఆ స్థాయిలో టీమిండియా నుంచి మళ్లీ ఎవరూ ఆధిపత్యం చూపించలేదు. రోకో జోడీ టీ20లకు గుడ్​బై చెప్పేశారు. ఈ నేపథ్యంలో రుతురాజ్ మంచి ర్యాంక్ సాధించి వాళ్ల పరువు నిలబెట్టడమే గాక.. భారత భవిష్యత్​కు ఢోకా లేదని భరోసా ఇవ్వడాన్ని మెచ్చుకోక తప్పదు.

Show comments