iDreamPost
android-app
ios-app

గంభీర్ వచ్చాడు.. ఇక కోహ్లీ, రోహిత్‌కి కష్ట కాలమే! అస్సలు సహించడు!

  • Published Jul 10, 2024 | 2:48 PMUpdated Jul 10, 2024 | 2:48 PM

Gautam Gambhir, Head Coach, Virat Kohli, Rohit Sharma: టీమిండియా హెడ్‌ కోచ్‌గా గంభీర్‌ వచ్చిన తర్వాత.. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మకు ఇబ్బంది ఎదురయ్యేలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Gautam Gambhir, Head Coach, Virat Kohli, Rohit Sharma: టీమిండియా హెడ్‌ కోచ్‌గా గంభీర్‌ వచ్చిన తర్వాత.. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మకు ఇబ్బంది ఎదురయ్యేలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Jul 10, 2024 | 2:48 PMUpdated Jul 10, 2024 | 2:48 PM
గంభీర్ వచ్చాడు.. ఇక కోహ్లీ, రోహిత్‌కి కష్ట కాలమే! అస్సలు సహించడు!

అందరూ ఊహించినట్టుగానే టీమిండియా హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ను నియమించింది బీసీసీఐ. రాహుల్‌ ద్రవిడ్‌ వారుసుడిగా గంభీర్‌ భారత జట్టు హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపడతాడంటూ చాలా కాలంగానే వార్తలు వస్తున్నాయి. టీ20 వరల్డ్‌ కప్‌ 2024తో హెడ్‌ కోచ్‌గా ద్రవిడ్‌ పదవీ కాలం ముగియడంతో.. బీసీసీఐ కొత్త కోచ్‌గా గంభీర్‌ పేరును మంగళవారం అధికారికంగా ప్రకటించింది. టీమిండియా మాజీ క్రికెటర్‌ అయిన గంభీర్‌ ఇప్పుడు హెడ్‌ కోచ్‌ హోదాలో మరోసారి టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. భారత్‌ను అంతర్జాతీయ క్రికెట్‌లో మరో స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో బరిలోకి దిగుతున్న గంభీర్‌.. తన టార్గెట్‌లో భాగంగా కొత్త మంది స్టార్‌ క్రికెటర్లను తొక్కేస్తాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

గంభీర్‌ హెడ్‌ కోచ్‌గా రావడంతో టీమిండియాకు రెండు కళ్లలాంటి విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మకు కష్టకాలం వచ్చినట్లే అని కొంతమంది క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. ధోని రిటైర్మెంట్‌ తర్వాత.. టీమిండియా అంటే కోహ్లీ, రోహిత్‌ శర్మ అనే రేంజ్‌లో వారి స్టార్‌డమ్‌ పెరిగిపోయింది. కానీ, గంభీర్‌కు ఈ స్టార్‌డమ్‌ అనే పదమే అస్సలు నచ్చదు. టీమ్‌లో ఉండే ప్రతి ప్లేయర్‌ సమానమే, ఆడితే జట్టు కోసమే ఆడాలి, వ్యక్తిగత రికార్డులు అంటూ ఏం ఉండవు.. సీనియర్‌, జూనియర్‌ అనే తేడా అస్సలు ఉండకూడదనే మైండ్‌ సెట్‌ గంభీర్‌ది. ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ మెంటర్‌గా పనిచేసిన సమయంలో కూడా గంభీర్‌ ఇదే మాటను ఆటగాళ్లతో స్వయంగా చెప్పాడు. ఆ వీడియో కూడా బాగా వైరల్‌ అయింది.

ఇప్పుడు టీమిండియాలో కూడా అలాంటి అగ్రెసివ్‌ నేచర్‌నే గంభీర్‌ కొనసాగిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే వరకు టీమిండియా అంటే కోహ్లీ, రోహిత్‌గా సాగిపోయింది.. కానీ, ఇప్పటి నుంచి టీమిండియా అంటే గంభీర్‌ అనేలా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. పైగా బీసీసీఐ నుంచి కూడా గంభీర్‌కు ఫుల్‌ సపోర్ట్‌ ఉంది. అయితే.. కోహ్లీ, రోహిత్‌ శర్మ కూడా దేశానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ.. ఇంతకాలం క్రికెట్‌ ఆడారు. ఇప్పుడు కూడా అదే పంథా కొనసాగిస్తారని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. అయితే.. టీమ్‌ అంటే వీళ్లిద్దరే అనే ధోరణిని మాత్రం గంభీర్‌ కచ్చితంగా తొక్కేస్తాడని మాత్రం చాలా మంది క్రికెట్‌ అభిమానులు బలంగా నమ్ముతున్నారు. గంభీర్‌ హెడ్‌ కోచ్‌గా ఉన్నంత కాలం టీమిండియా అంటే టీమిండియానే అని అంతా అనుకుంటారని సోషల్‌ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి