Nidhan
టీమిండియా యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ అదరగొడుతున్నాడు. జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో సూపర్బ్ నాక్‌తో ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లీ స్టైల్లో యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతూ ఆఖర్లో విధ్వంసం సృష్టించాడు.
టీమిండియా యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ అదరగొడుతున్నాడు. జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో సూపర్బ్ నాక్‌తో ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లీ స్టైల్లో యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతూ ఆఖర్లో విధ్వంసం సృష్టించాడు.
Nidhan
టీమిండియా యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ అదరగొడుతున్నాడు. జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో సూపర్బ్ నాక్‌తో ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లీ స్టైల్లో యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతూ ఆఖర్లో విధ్వంసం సృష్టించాడు. మొదటి మ్యాచ్‌లో ఫెయిలైన రుతురాజ్.. సెకండ్ టీ20లో మాత్రం తన అసలైన గేమ్‌ను బయటకు తీశాడు. శుబ్‌మన్ గిల్ త్వరగా ఔట్ అవడంతో క్రీజులోకి వచ్చిన గైక్వాడ్ అక్కడ పాతుకుపోయాడు. దంచుడు మొదలుపెట్టిన సెంచరీ హీరో అభిషేక్ శర్మకు అండగా నిలబడ్డాడు. ఒక్కసారి అభిషేక్ ఔట్ అయ్యాక రింకూ సింగ్‌తో కలసి విధ్వంసం సృష్టించాడు. అప్పటివరకు మెళ్లగా ఆడుతూ వచ్చిన రుతురాజ్.. ఆ తర్వాత బౌండరీల వర్షం కురిపించాడు. ఓవరాల్‌గా ఆ మ్యాచ్‌లో 47 బంతుల్లో 77 పరుగులతో నాటౌగా నిలిచాడు. మూడో టీ20లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు గైక్వాడ్.
జింబాబ్వే సిరీస్‌లో అదరగొడుతున్న రుతురాజ్.. లెజెండరీ బ్యాటర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పరువు నిలబెట్టాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో గైక్వాడ్ మెరిశాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో 7వ స్థానాన్ని దక్కించుకున్నాడతను. ఇంతకుముందు వరకు 20వ పొజిషన్లో ఉన్న రుతురాజ్.. తాజాగా పదమూడు స్థానాలు ఎగబాకి ఏడో ప్లేస్‌లో నిలిచాడు. టీ20ల్లో సెకండ్ హయ్యెస్ట్ ర్యాంక్ సాధించిన భారత బ్యాటర్‌గా అతడు అరుదైన ఘనతను అందుకున్నాడు. యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా ర్యాంకింగ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతడు 75వ స్థానాన్ని దక్కించుకున్నాడు. టీ20 ర్యాంకింగ్స్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఆస్ట్రేలియా విధ్వంసకారుడు ట్రావిస్ హెడ్ నిలిచాడు. అతడి తర్వాత స్థానంలో మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు.
టీ20 ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్, నాలుగో ప్లేస్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం నిలిచారు. ఐదో స్థానంలో మరో పాక్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్, సిక్త్ పొజిషన్లో ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ ఉన్నారు. ఈ లిస్ట్‌లో టాప్-10లో సూర్యకుమార్‌తో పాటు భారత్ నుంచి గైక్వాడ్ స్థానం దక్కించుకున్నాడు. మొన్నటి వరకు ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న సూర్య ఒక స్థానం దిగజారగా.. గైక్వాడ్ టాప్-7లోకి వచ్చి అందర్నీ సర్ప్రైజ్ చేశాడు. రోహిత్, కోహ్లీలు గత దశాబ్ద కాలంలో ఐసీసీ ర్యాంకింగ్స్‌ను రూల్ చేశారు. ఈ మధ్య ఆ స్థాయిలో టీమిండియా నుంచి మళ్లీ ఎవరూ ఆధిపత్యం చూపించలేదు. రోకో జోడీ టీ20లకు గుడ్‌బై చెప్పేశారు. ఈ నేపథ్యంలో రుతురాజ్ మంచి ర్యాంక్ సాధించి వాళ్ల పరువు నిలబెట్టడమే గాక.. భారత భవిష్యత్‌కు ఢోకా లేదని భరోసా ఇవ్వడాన్ని మెచ్చుకోక తప్పదు.
RUTURAJ GAIKWAD IN TOP 10 ICC T20I BATTERS RANKING 🔥
– Ruturaj becomes the second highest ranked Indian batter in T20I. 🇮🇳 pic.twitter.com/lMSxffJGYc
— Johns. (@CricCrazyJohns) July 10, 2024