iDreamPost
android-app
ios-app

Suryakumar Yadav: సూర్య వివాదాస్పద క్యాచ్ కు అరుదైన గౌరవం! ఏకంగా ఆ జాబితాలో..

  • Published Jul 04, 2024 | 8:07 AM Updated Updated Jul 04, 2024 | 8:07 AM

టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఓ మైండ్ బ్లోయింగ్ క్యాచ్ అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ క్యాచ్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆ వివరాల్లోకి వెళితే..

టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఓ మైండ్ బ్లోయింగ్ క్యాచ్ అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ క్యాచ్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆ వివరాల్లోకి వెళితే..

Suryakumar Yadav: సూర్య వివాదాస్పద క్యాచ్ కు అరుదైన గౌరవం! ఏకంగా ఆ జాబితాలో..

టీ20 ప్రపంచ కప్ ముగిసి రోజులు గడుస్తున్నా గానీ.. ఆ టోర్నీకి సంబంధించిన ఓ సంఘటన మాత్రం ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. అదే.. సూర్యకుమార్ యాదవ్ పట్టిన స్టన్నింగ్ క్యాచ్. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో డేవిడ్ మిల్లర్ కొట్టిన భారీ షాట్ ను సూర్యకుమార్ బౌండరీలైన్ దగ్గర అందుకున్న తీరు అమోఘం, అద్భుతం, అనిర్వచనీయం అనే చెప్పాలి. ఈ క్యాచే మ్యాచ్ ను టర్న్ చేసింది. ఇక ఈ క్యాచ్ కు అరుదైన గౌరవం దక్కింది. ఏకంగా ఆ జాబితాలో చోటు దక్కించుకుంది.

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో సూర్యకుమార్ పట్టిన క్యాచ్ గురించి చర్చ ఇంకా జరుగుతూనే ఉంది. కొందరు ఈ క్యాచ్ ను ప్రశంసిస్తే.. మరికొందరు అది తప్పుడు క్యాచ్ అని విమర్శించారు. ఆ విమర్శలను టీమిండియా దిగ్గజాలతో పాటుగా మరికొందరు తిప్పికొట్టారు. ఇదిలా ఉండగా.. ఈ క్యాచ్ కు అరుదైన గౌరవాన్ని ఇచ్చింది ఐసీసీ. సూర్యకుమార్ పట్టిన ఈ మైండ్ బ్లోయింగ్ క్యాచ్ ను ప్రశంసిస్తూ ఈ టోర్నీలో అత్యుత్తమ క్యాచ్ గా పేర్కొంది.

టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో అద్భుతమైన క్యాచ్ ల జాబితాలో సూర్య క్యాచ్ ను చేర్చింది. ఈ మేరకు టోర్నీలో అద్బుతమైన క్యాచ్ లకు సంబంధించిన వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది ఐసీసీ. దీనితో పాటుగా ఆస్ట్రేలియాపై ట్రావిస్ హెడ్ కొట్టిన షాట్ ను కళ్లు చెదిరేరీతిలో డైవ్ చేస్తూ పట్టాడు అక్షర్ పటేల్. అలాగే అమెరికాపై మహ్మద్ సిరాజ్ పట్టిన క్యాచ్ కూడా ఈ టోర్నీలో అద్బుతమైన క్యాచ్ లుగా పేర్కొంది ఐసీసీ.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)