iDreamPost

వీడియో: సగర్వంగా ఇండియాకు వరల్డ్ కప్.. రోహిత్ సేనకు ఘన స్వాగతం!

వరల్డ్ కప్ తో సహా భారత్ కు రీచ్ అయ్యారు టీమిండియా ఆటగాళ్లు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో వారికి ఘన స్వాగతం లభించింది. అభిమానులతో ఎయిర్ పోర్ట్ కిక్కిరిపోయింది.

వరల్డ్ కప్ తో సహా భారత్ కు రీచ్ అయ్యారు టీమిండియా ఆటగాళ్లు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో వారికి ఘన స్వాగతం లభించింది. అభిమానులతో ఎయిర్ పోర్ట్ కిక్కిరిపోయింది.

వీడియో: సగర్వంగా ఇండియాకు వరల్డ్ కప్.. రోహిత్ సేనకు ఘన స్వాగతం!

వరల్డ్ కప్.. 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇండియాకు చేరుకుంది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి.. సగర్వంగా వరల్డ్ కప్ ను ముద్దాడింది భారత్. అయితే ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రోజే ఇండియాకు రావాల్సిన వరల్డ్ కప్.. బెరిల్ తుఫాన్ కారణంగా అక్కడి ఇన్నిరోజులు ఉండిపోయింది. తాజాగా గురువారం ఉదయమే వరల్డ్ కప్ తో సహా భారత్ కు రీచ్ అయ్యారు టీమిండియా ఆటగాళ్లు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో వారికి ఘన స్వాగతం లభించింది. అభిమానులతో ఎయిర్ పోర్ట్ కిక్కిరిపోయింది.

టీ20 వరల్డ్ కప్ రోహిత్ సేన సగర్వంగా ఇండియాకు చేరుకుంది. బెరిల్ హరికేన్ కారణంగా ఇన్నిరోజులు బార్బడోస్ లోనే చిక్కున్న భారత ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో గురువారం ఉదయమే ఢిల్లీకి చేరుకున్నారు. దాంతో 13 ఏళ్ల నిరీక్షణ తర్వాత వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ప్లేయర్లకు స్వాగతం పలికేందుకు వచ్చిన క్రికెట్ లవర్స్ తో ఎయిర్ పోర్ట్ సందడిగా మారిపోయింది. ఛాంపియన్స్.. ఛాంపియన్స్ అనే నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది.

ఇదిలా ఉండగా.. ఉదయం 11 గంటలకు ప్రధానితో రోహిత్ సేన సమావేశం కానుంది. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ముంబై చేరుకుంటుంది. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఓపెన్ టాప్ బస్ లో వరల్డ్ కప్ తో భారత ఆటగాళ్ల విజయోత్సవ ర్యాలీ ప్రారంభం అవుతుంది. ఈ ర్యాలీ ముగిసిన తర్వాత వాంఖడే స్టేడియంలో బీసీసీఐ ఆధ్వర్యంలో టీమిండియా ప్లేయర్లకు సన్మాన కార్యక్రమం జరగనుంది. టెలివిజన్​లో అయితే స్టార్ స్పోర్ట్స్ ఛానెల్​లో టీమిండియా విక్టరీ పరేడ్​ను చూడొచ్చు. అదే డిజిటల్ స్ట్రీమింగ్ చేయాలనుకుంటే మాత్రం డిస్నీప్లస్ హాట్​స్టార్ ఓటీటీలో దీన్ని లైవ్​గా చూడొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి