బాబర్​కు తలనొప్పిగా మారిన గిల్.. ఇండియన్స్​తో పెట్టుకుంటే ఇలాగే ఉంటది!

  • Author singhj Updated - 07:40 PM, Thu - 26 October 23

వరుస ఓటములతో డీలాపడిన పాకిస్థాన్​ కెప్టెన్​ బాబర్ ఆజంకు ఇప్పుడు కొత్త తలనొప్పి మొదలైంది. భారత యంగ్ బ్యాటర్ శుబ్​మన్ గిల్​ పాక్ సారథిని భయపెడుతున్నాడు.

వరుస ఓటములతో డీలాపడిన పాకిస్థాన్​ కెప్టెన్​ బాబర్ ఆజంకు ఇప్పుడు కొత్త తలనొప్పి మొదలైంది. భారత యంగ్ బ్యాటర్ శుబ్​మన్ గిల్​ పాక్ సారథిని భయపెడుతున్నాడు.

  • Author singhj Updated - 07:40 PM, Thu - 26 October 23

బాబర్ ఆజం.. క్రికెట్ ఫ్యాన్స్​కు బాగా తెలిసిన పేరిది. బ్యాట్స్​మన్​గా, పాకిస్థాన్ టీమ్ కెప్టెన్​గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బాబర్. ముఖ్యంగా వైట్​బాల్ క్రికెట్​లో చెలరేగి ఆడుతూ పాక్ ఫ్యాన్స్​ మనసులను దోచుకున్నాడు. కన్​సిస్టెంట్​గా రన్స్ చేస్తున్న బాబర్ అదే ఊపును కొనసాగిస్తే గ్రేటెస్ట్ బ్యాటర్లలో ఒకడిగా నిలుస్తాడని పాక్ మాజీలు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. బ్యాటింగ్​లో నిలకడగా రన్స్ చేయడం, కూల్​గా తన పని తాను చేసుకొనిపోయే యాటిట్యూడ్ నచ్చి బాబర్​కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. అయితే సారథ్య బాధ్యతలు తీసుకున్నాక బాబర్​ బ్యాటింగ్​లో ఒకప్పటిలా రాణించలేకపోతున్నాడు.

చిన్న టీమ్స్​పై బాగానే రన్స్ చేస్తున్న బాబర్.. పెద్ద జట్లపై బైలాటరల్ సిరీస్​ల్లోనూ రాణిస్తున్నాడు. కానీ ఆసియా కప్, వరల్డ్ కప్ లాంటి బిగ్ టోర్నమెంట్స్​లో మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. అటు కెప్టెన్​గా టీమ్​ను సరిగ్గా నడిపించలేక, ఇటు బ్యాటింగ్​లో రన్స్ చేయడంలో ఫెయిలై విమర్శల పాలవుతున్నాడు. ప్రస్తుత వన్డే వరల్డ్ కప్​లోనూ ఇదే పరిస్థితి. వరుసగా టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతుల్లో ఓటమిపాలైన దాయాది టీమ్ సెమీస్​కు వెళ్లడం అసాధ్యంలా కనిపిస్తోంది. నెక్స్ట్ ఆడే అన్ని మ్యాచుల్లోనూ నెగ్గడమే గాక భారీ విజయాలతో నెట్​రన్​ రేట్​ను మెరుగుపర్చుకోవాలి. అప్పుడు కూడా సెమీస్ బెర్త్ పక్కా అని చెప్పలేని పరిస్థితి. మిగతా టీమ్స్ గెలుపోటములపై డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది.

కెప్టెన్సీ నాక్స్​తో టీమ్​ను ముందుండి లీడ్ చేయాల్సిన బాబర్ ఆజం బ్యాటింగ్​లో అంతగా రాణించడం లేదు. ఒకవేళ రన్స్ చేసినా అతడి బ్యాటింగ్​లో దూకుడు కనిపించడం లేదు. ఇది పాక్​కు మైనస్​గా మారింది. వరుస ఓటములతో పాక్ డీలాపడటంతో బాబర్​ను అందరూ టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. కెప్టెన్సీ నుంచి దిగిపొమ్మని నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ టైమ్​లో బాబర్​కు మరో తలనొప్పి మొదలైంది. టీమిండియా యంగ్ సెన్సేషన్ శుబ్​మన్​ గిల్ బాబర్​కు భయం పుట్టిస్తున్నాడు. బాబర్ పేరు చెబితే చాలు.. ఇన్నాళ్లూ నంబర్ వన్ బ్యాటర్ అంటూ పాక్ ఫ్యాన్స్, సీనియర్స్ గొప్పలు చెప్పేవారు.

ఇప్పుడు బాబర్ ఆజం ప్లేస్​కు గురిపెట్టాడు శుబ్​మన్ గిల్. ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్​లో 823 పాయింట్లతో గిల్ సెకండ్ ప్లేస్​లో నిలిచాడు. ప్రస్తుతం ఫస్ట్ ప్లేస్​లో ఉన్న బాబర్ ఆజం (829)కు గిల్​కు మధ్య తేడా ఆరు పాయింట్లు మాత్రమే. వరల్డ్ కప్​లో కంటిన్యూగా పెర్ఫార్మ్ చేస్తే త్వరలో అతడు నంబర్ వన్​ ర్యాంకు సాధించడం ఖాయమే. దీంతో నెటిజన్స్ బాబర్​ను ఇంకా ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. ఇండియన్స్​తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని.. గిల్ వచ్చేస్తున్నాడు, నీ ర్యాంకు గోవిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ర్యాంకింగ్స్​లో గిల్ రెండో పొజిషన్​కు చేరుకోవడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: అదే నన్ను ఈ స్థాయిలో ఉంచింది.. నేను పాటించే నినాదమదే: విరాట్ కోహ్లీ

Show comments