iDreamPost
android-app
ios-app

క్రికెట్​లో ఐసీసీ కొత్త రూల్స్.. ఇక కెప్టెన్లకు కష్టాలు తప్పవు!

  • Published Mar 15, 2024 | 6:23 PM Updated Updated Mar 15, 2024 | 6:23 PM

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అవసరాన్ని బట్టి క్రికెట్​లో మార్పులు చేస్తుంటుందనేది తెలిసిందే. తాజాగా గేమ్​లో కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది ఐసీసీ. ఇవి అమల్లోకి వస్తే కెప్టెన్లకు కష్టాలు తప్పవు.

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అవసరాన్ని బట్టి క్రికెట్​లో మార్పులు చేస్తుంటుందనేది తెలిసిందే. తాజాగా గేమ్​లో కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది ఐసీసీ. ఇవి అమల్లోకి వస్తే కెప్టెన్లకు కష్టాలు తప్పవు.

  • Published Mar 15, 2024 | 6:23 PMUpdated Mar 15, 2024 | 6:23 PM
క్రికెట్​లో ఐసీసీ కొత్త రూల్స్.. ఇక కెప్టెన్లకు కష్టాలు తప్పవు!

క్రికెట్​లో ప్రమాణాలను మరింత పెంచేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎప్పటికప్పుడు నయా రూల్స్​ను తీసుకొస్తూ ఉంటుంది. ఆటను మరింత మెరుగుపర్చడానికి, ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించేందుకు ఈ నిబంధనలు ఎంతో ఉపయోగపడతాయి. అయితే ఇలా కొన్నిసార్లు ఐసీసీ తీసుకొచ్చే రూల్స్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. కొన్నిసార్లు వీటి వల్ల ప్రయోజనం చేకూరడంతో అందరూ ఆహ్వానించినా.. పలుమార్లు మాత్రం వ్యతిరేకత తప్పదు. కొత్త రూల్స్ వల్ల ఆటగాళ్లు ఒత్తిడికి గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి తప్పిదాలను సరిచేసుకొని మళ్లీ మంచి నిబంధనను ఐసీసీ ప్రవేశపెట్టడం కూడా తెలిసిందే. తాజాగా క్రికెట్​లో కొన్ని కొత్త రూల్స్​ తీసుకొచ్చింది ఐసీసీ. జూన్​లో జరిగే టీ20 వరల్డ్ కప్-2024 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.

ఐసీసీ కొత్తగా తీసుకొచ్చిన ఆ రూల్ పేరు స్టాక్ క్లాక్. దీన్ని వైట్​బాల్ క్రికెట్​లో మాత్రమే అమలు చేయనున్నారు. ఈ రూల్ ప్రకారం బౌలింగ్​ జట్టుకు ఒక ఓవర్ పూర్తయ్యాక ఇంకో ఓవర్ మొదలుపెట్టేందుకు ఇక మీదట 60 సెకన్ల టైమ్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ నెక్స్ట్ ఓవర్ గనుక నిర్ణీత సమయంలోగా స్టార్ట్ చేయకపోతే అంపైర్లు 2 సార్లు వార్నింగ్ ఇస్తారు. మూడోసారి కూడా అదే రిపీటైతే కొత్త నిబంధన కింద 5 పరుగులు పెనాల్టీగా ఇస్తారు. ఈ రూల్ టీ20 ప్రపంచ కప్ నుంచి అమల్లోకి రానుందని ఐసీసీ వెల్లడించింది. ఈ నిబంధన వల్ల ఎక్కడా టైమ్ వేస్ట్ కాకుండా ఆడియెన్స్​కు ఎంటర్​టైన్​మెంట్ అందించడమే ధ్యేయంగా కనిపిస్తోంది. అయితే ఈ రూల్ కెప్టెన్స్​పై ఒత్తిడి పెంచుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. వన్డేలతో పాటు టీ20 ఫార్మాట్​లో అమలయ్యే ఈ రూల్ వల్ల కెప్టెన్స్ ఎక్స్​ట్రా ప్రెజర్​ను ఎదుర్కోవాల్సి రావొచ్చు.

ఐసీసీ కొత్త రూల్ ప్రకారం ఇక మీదట ఫీల్డింగ్ జట్టు ఒక ఓవర్ పూర్తైన తర్వాత 60 సెకన్ల టైమ్​లోనే తర్వాతి ఓవర్​ను మొదలుపెట్టాలి. ఒక ఓవర్ కంప్లీట్ అయిన వెంటనే స్టేడియంలోని స్క్రీన్ మీద 60 సెకన్ల కౌంట్​ డౌన్ డిస్​ప్లే అవుతూ ఉంటుంది. అది జీరోకు వచ్చేలోపు నెక్స్ట్ ఓవర్ స్టార్ట్ చేయాలి. ఈ రూల్​ను ఉల్లంఘిస్తే రెండుసార్లు వార్నింగ్, మూడోసారికి రన్స్ పెనాల్టీ విధిస్తారు. అయితే ఈ రూల్ వల్ల కెప్టెన్లకు చాలా ఇబ్బంది ఎదురవుతుందనే కామెంట్లు వస్తున్నాయి. ఓవర్​కు ఓవర్​కు మధ్య ఉండే టైమ్​లోనే కెప్టెన్ నెక్స్ట్ ఎవరితో బౌలింగ్ చేయించాలి? ఫీల్డ్ సెట్టింగ్ ఎలా ఉండాలి? అనేది డిసైడ్ అవుతాడు. ఇప్పుడు కొత్త రూల్ వల్ల ఆ సమయం కూడా లేకుండా పోతుందని అంటున్నారు. సమయం వృథా కాకుండా నివారించడం మంచిదే కానీ ఇలా కెప్టెన్లపై అదనపు ఒత్తిడి పెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదని ఎక్స్​పర్ట్స్ చెబుతున్నారు. మరి.. ఐసీసీ కొత్త రూల్​పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టీ20 వరల్డ్ కప్​లో కోహ్లీ వద్దా? ఈ రికార్డులు చూశాక ఆ మాట అనే దమ్ముందా?