iDreamPost

టీ20 వరల్డ్ కప్​లో కోహ్లీ వద్దా? ఈ రికార్డులు చూశాక ఆ మాట అనే దమ్ముందా?

  • Published Mar 15, 2024 | 5:09 PMUpdated Mar 15, 2024 | 5:09 PM

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కొన్నాళ్లుగా క్రికెట్​కు దూరంగా ఉంటున్నాడు. అయినా కింగ్ మీద అతడి కెరీర్​పై ఏవేవో ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే కోహ్లీ ఆట, అతడి రికార్డుల గురించి తెలిస్తే మాత్రం ఒక్క మాట అనాలన్నా పదిసార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది.

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కొన్నాళ్లుగా క్రికెట్​కు దూరంగా ఉంటున్నాడు. అయినా కింగ్ మీద అతడి కెరీర్​పై ఏవేవో ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే కోహ్లీ ఆట, అతడి రికార్డుల గురించి తెలిస్తే మాత్రం ఒక్క మాట అనాలన్నా పదిసార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది.

  • Published Mar 15, 2024 | 5:09 PMUpdated Mar 15, 2024 | 5:09 PM
టీ20 వరల్డ్ కప్​లో కోహ్లీ వద్దా? ఈ రికార్డులు చూశాక ఆ మాట అనే దమ్ముందా?

టీమిండియా సీనియర్ బ్యాట్స్​మన్ విరాట్ కోహ్లీ కొన్నాళ్లుగా క్రికెట్​కు దూరంగా ఉంటున్నాడు. పర్సనల్ రీజన్స్​ వల్ల ఇంగ్లండ్​తో టెస్ట్ సిరీస్​లో అతడు ఆడలేదు. అయితే సతీమణి అనుష్క శర్మ డెలివరీ కోసం ఆస్పత్రిలో ఉండటం, ఆ తర్వాత పండంటి మగబిడ్డ పుట్టడంతో అతడు ఈ సిరీస్​కు దూరంగా ఉన్నట్లు తర్వాత తెలిసింది. ఇంగ్లండ్ సిరీస్ ముగిసిపోవడంతో భారత క్రికెటర్లు అందరూ ఐపీఎల్​లో తాము ప్రాతినిధ్యం వహించే ఫ్రాంచైజీలతో కలసిపోయారు. ప్రాక్టీస్ చేస్తూ క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్​కు సిద్ధమవుతున్నారు. అయితే విరాట్ కోహ్లీ మాత్రం ఇంకా ఆర్సీబీ క్యాంప్​లో జాయిన్ అవలేదు. ఈ తరుణంలో కింగ్ గురించి ఓ వార్త రావడంతో అతడి ఫ్యాన్స్ ఉలిక్కిపడ్డారు. ఈ ఏడాది జూన్​లో జరగబోయే ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్-2024లో కోహ్లీ ఆడడని.. అతడికి టీమ్​లో చోటు లేదనేది ఆ వార్త సారాంశం.

టీ20 ప్రపంచ కప్​కు ఆతిథ్యం ఇస్తున్న అమెరికా-వెస్టిండీస్ పిచ్​లు చాలా స్లోగా ఉంటాయి, అవి కోహ్లీ ఆటతీరుకు అస్సలు నప్పవని న్యూస్ వచ్చింది. స్లో పిచ్​లపై విరాట్​కు పేలవమైన రికార్డులు ఉన్నాయని.. కాబట్టి అతడి ప్లేసులో ఇంకో యంగ్​స్టర్​ను తీసుకోవాలని టీమ్ మేనేజ్​మెంట్, బీసీసీఐ భావిస్తున్నాయని వినికిడి. ఈ మేరకు జట్టుకు దూరంగా ఉండేలా కోహ్లీని ఒప్పించేందుకు స్వయంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్​ రంగంలోకి దిగారని రూమర్స్ వచ్చాయి. పలు స్పోర్ట్స్ మేగజీన్స్​తో పాటు సోషల్ మీడియాలోనూ ఇది బాగా సర్క్యులేట్ అయింది. దీంతో విరాట్ పొట్టి కప్పు బరిలోకి దిగుతాడా? లేదా? అని అతడి అభిమానులతో పాటు టీమిండియా ఫ్యాన్స్ కూడా టెన్షన్ పడుతున్నారు. కోహ్లీపై వస్తున్న విమర్శలు, అతడి స్ట్రైక్ రేట్ గురించి చెబుతున్న లెక్కలు అన్నింటికీ రియల్ ఫ్యాక్ట్స్ తెలుసుకుంటే సమాధానం దొరికేస్తుంది. కింగ్ రికార్డులు ఏంటో తెలిశాక టీ20 వరల్డ్ కప్​లో అతడ్ని ఎందుకు ఆడించాలనే నోళ్లన్నీ మూసుకోక తప్పదు.

Virat Kohli

వెస్టిండీస్ పిచ్​లపై కోహ్లీ స్టైల్ సూట్ కాదు, స్లో పిచ్​ల మీద అతడి స్ట్రయిక్ రేట్ సరిగ్గా లేదనే విమర్శలు వస్తున్నాయి. అయితే విండీస్​ గడ్డ మీద టెస్టులు, వన్డేల్లో విరాట్​ బాగా పరుగులు చేశాడు. 2016లో అక్కడ జరిగిన టెస్టు సిరీస్​లో కోహ్లీ 62.75 స్ట్రైక్ రేట్​తో 251 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీ ఉంది. 2019 పర్యటనలో 136 పరుగులే చేసినా రెండు హాఫ్ సెంచరీలు బాదాడు. ఇక, కరీబియన్ పిచ్​లపై వన్డేల్లో కోహ్లీ రికార్డులు ఇంకా బెటర్​గా ఉన్నాయి. ఆ దీవుల్లో విరాట్ ఆడిన టీ20 మ్యాచులు చాలా తక్కువ. అది కూడా ఒకే ఏడాదిలో కాదు.. దశాబ్ద కాలంలో మూడ్నాలుగు ఏళ్ల గ్యాప్​లో ఆడాడు. విండీస్​ పిచ్​లపై పొట్టి క్రికెట్​లో 7 ఇన్నింగ్స్​ల్లో బ్యాటింగ్​కు దిగిన కోహ్లీ.. 229 పరుగులు చేశాడు. అమెరికాలో 3 మ్యాచుల్లో 63 పరుగులు చేశాడు. అక్కడి మైదానాల్లో అతడి ఓవరాల్ స్ట్రైక్ రేట్ 140కి పైగానే ఉంది.

టీ20ల్లో అందులోనూ స్లో పిచ్​లపై 140 స్ట్రైక్ రేట్ చాలా బెటర్ అనే చెప్పాలి. 140 స్ట్రైక్ రేట్ అంటే ఓవర్​కు 8.4 రన్స్ అని అర్థం. ఆ లెక్కన ఆఖరి వరకు ఆడితే 168 పరుగులు చేయొచ్చు. ఇక, విండీస్ స్టేడియాల్లో 30 ఫోర్లు, 4 సిక్సర్లు కోహ్లీ బ్యాట్ నుంచి వచ్చాయి. మొత్తంగా అక్కడి మైదానాల్లో జరిగిన టీ20 మ్యాచుల్లో అతడు చేసిన పరుగుల్లో 49 శాతం బౌండరీలు, సిక్సుల ద్వారానే వచ్చాయి. అసలు ఇవన్నీ కాదు.. వికెట్ స్లో అవుతోంది అంటే కావాల్సింది ఎక్స్​పీరియెన్స్ ఉన్న బ్యాటరే. యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతూ మ్యాచ్​లను ఫినిష్ చేసే సత్తా ఉన్న కోహ్లీని మించినోడు ఇంకొకరు టీమ్​లో లేడు. అలాంటప్పుడు అర్థం పర్థం లేకుండా సరైన డేటా లేకుండా కోహ్లీని టీమ్​లో తీసుకోరు అనడం ఎంత వరకు కరెక్ట్?

Virat Kohli

ఒకవేళ టీ20 ప్రపంచ కప్​లో కోహ్లీని ఆడించొద్దని బీసీసీఐ భావిస్తే ఆఫ్ఘానిస్థాన్ సిరీస్​కు ముందే చెప్పేది. కానీ ఆ సిరీస్​లో విరాట్​ను సెలక్ట్ చేసింది. అతడు రెండు మ్యాచుల్లో ఆడాడు. అదే సిరీస్​తో రోహిత్ శర్మనే కెప్టెన్ అనే క్లారిటీ ఇచ్చేసింది. రికార్డులు ఇంత స్పష్టంగా కోహ్లీకి విండీస్​లో తిరుగులేదని చెబుతున్నాయి. అటు భారత క్రికెట్ బోర్డు కూడా కోహ్లీ లేకుండా టీమ్​ వెళ్లదని ఆఫ్ఘాన్ సిరీస్​తో ఇండికేషన్స్ ఇచ్చేశాక అనవసర రాద్ధాంతం సృష్టించి జట్టుతో పాటు కింగ్ అభిమానులను కూడా గందరగోళానికి గురి చేయడం కరెక్ట్ కాదు. ఇవన్నీ చూశాకైనా కోహ్లీ గురించి మాట్లాడేవాళ్లు ఒకసారి పునరాలోచించుకోవాలి. స్లో పిచ్​లపై అతడు ఎంత కీలకమో, వరల్డ్ కప్​లో జట్టుకు కోహ్లీ అవసరం ఎంతగా ఉందో అర్థం చేసుకోవాలి.

ఇదీ చదవండి: ఐపీఎల్​కు ముందు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. ఇకపై కేవలం..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి