iDreamPost
android-app
ios-app

వెస్టిండీస్ కు షాకిచ్చిన ICC! ఆ విషయంలో..

  • Author Soma Sekhar Published - 01:33 PM, Sat - 9 September 23
  • Author Soma Sekhar Published - 01:33 PM, Sat - 9 September 23
వెస్టిండీస్ కు షాకిచ్చిన ICC! ఆ విషయంలో..

వరల్డ్ క్రికెట్ ను పర్యవేక్షిస్తున్న ఐసీసీ.. అప్పుడప్పుడు జట్లపై కఠిన చర్యలు తీసుకుంటూ ఉంటోంది. టీమ్స్ నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించినప్పుడు ఐసీసీ కొరఢా ఝళిపిస్తూ ఉంటుంది. తాజాగా వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ కు షాకిచ్చింది. ఇటీవల ఇండియా-విండీస్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ లో భాగంగా జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. దీంతో విండ్సన్ పిచ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు షాకిచ్చింది.

అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై చర్యలు తీసుకుంది. ఇటీవల భారత్-విండీస్ టెస్ట్ కోసం విండ్సన్ పార్క్ లో తయారు చేసిన పిచ్ కు బిలో యావరేజ్ రేటింగ్ ఇచ్చింది. దీంతో విండీస్ ఖాతాలో ఒక డిమెరిట్ పాయింట్ చేరింది. కాగా.. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై విండీస్ బోర్డ్ అప్పీలుకు వెళ్లే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్.. భారత స్పిన్నర్ల ధాటికి 150 రన్స్ కే కుప్పకూలింది. టీమిండియా స్పిన్నర్లు అశ్విన్ 5, జడేజా 3 వికెట్లతో విండీస్ నడ్డి విరిచారు. అనంతరం టీమిండియా 5 వికెట్ల నష్టానికి 421 పరుగులకు డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్ ప్రాంరంభించిన విండీస్ 130 పరుగులకే కుప్పకూలింది.

దీంతో ఇన్నింగ్స్ 141 పరుగుల భారీ తేడాతో ఇండియా విజయం సాధించింది. మరోసారి స్పిన్నర్ అశ్విన్ 7 వికెట్లతో చెలరేగాడు. ఇక టర్నింగ్ పిచ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. మ్యాచ్ మూడు రోజుల్లో ముగియడంతో.. చెత్త పిచ్ అంటూ కామెంట్లు వినిపించాయి. ఈ క్రమంలోనే తాజాగా ఐసీసీ విండ్సర్ పిచ్ కు బిలో యావరేజ్ రేటింగ్ ఇచ్చి విండీస్ బోర్డ్ కు పనిష్ మెంట్ ఇచ్చింది. దీంతో విండీస్ ఖాతాలో ఒక డీ మెరిట్ పాయింట్ చేరింది. కాగా.. రెండో టెస్ట్ మ్యాచ్ కు వేదికైన జమైకాలోని క్వీన్స్ పార్క్ ఓవల్ కు యావరేజ్ రేటింగ్ ఇచ్చింది ఐసీసీ. అయితే ఐసీసీ తీసుకున్న నిర్ణయంపై అప్పీలు కు వెళ్లే అవకాశం విండీస్ బోర్డ్ కు ఉంది.