iDreamPost
android-app
ios-app

జాన్ సీనా భావోద్వేగం.. ఈ క్షణం కోసం 20 ఏళ్లు ఎదురుచూశానంటూ..!

  • Author Soma Sekhar Published - 12:34 PM, Sat - 9 September 23
  • Author Soma Sekhar Published - 12:34 PM, Sat - 9 September 23
జాన్ సీనా భావోద్వేగం.. ఈ క్షణం కోసం 20 ఏళ్లు ఎదురుచూశానంటూ..!

ప్రస్తుతం హైదరాబాద్ మెుత్తం WWE ఫీవర్ తో ఊగిపోతోంది. భాగ్యనగరం వేదికగా WWE సూపర్ స్టార్ స్పెక్టాకిల్ టోర్నీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ టోర్నీలో పాల్గొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టార్ రెజ్లరు నగరంలోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో వారిని చూసేందుకు, వారితో సెల్పీలు దిగేందుకు అభిమానలు ఎగబడుతున్నారు. ఇక ఈ టోర్నీకి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు WWE సూపర్ స్టార్ జాన్ సీనా. ఇండియాలో అడుగుపెట్టిన జాన్ సీనాకు ఫ్యాన్స్ నుంచి అఖండమైన అభిమానం లభించింది. WWE చరిత్రలో జాన్ సీనాకు దక్కిన అతిపెద్ద క్రౌడ్ రియాక్షన్ లో ఇదొక్కటని చెప్పాలి. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం ఫ్యాన్స్ తో మాట్లాడుతూ భావోద్వేగానికి గురైయ్యాడు జాన్ సీనా. ఇండియాలో అడుగుపెట్టడానికి 20 సంవత్సరాలు ఎదురుచూశానంటూ చెప్పుకొచ్చాడు.

WWE సూపర్ స్టార్ స్పెక్టాకిల్ ఓ రేంజ్ లో జరుగుతోంది. ఈ టోర్నీకి ఫ్యాన్స్ నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తోంది. తాజాగా జరిగిన చివరి మ్యాచ్ లో సూపర్ స్టార్ జాన్ సీనా, సెత్ రోలిన్స్ జోడీ విజయం సాధించారు. విన్సి, కైజర్ జోడీపై జాన్ సీనా ద్వయం విజయం సాధించారు. ఈ పోరులో నలుగురు రెజ్లర్లు అద్భుతమైన పోరాటపటిమను చూపించారు. ఒకానొక దశలో జాన్ సీనా జోడిని ఓడించినంత పనిచేసింది విన్సి, కైజర్ ల జంట. కానీ పట్టుదలతో పోరాడిన జాన్ సీనా, సెత్ రోలిన్స్ చివరకు విజయం సాధించారు. మ్యాచ్ చివర్లో జాన్ సీనా తన ట్రేడ్ మార్క్ షాట్ (AA)తో మ్యాచ్ ను ముగించాడు.

కాగా.. మ్యాచ్ అనంతరం జాన్ సీనా ఫ్యాన్స్ ను ఉద్దేశించి మాట్లాడాడు. ఈ సందర్భంగా కొంత భావోద్వేగానికి లోనైనట్లు కనిపించాడు ఈ సూపర్ స్టార్. జాన్ సీనా మాట్లాడుతూ..” మీ అందరి ముందు ఇలా నిలబడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ క్షణం కోసం గత 20 ఏళ్లుగా ఊహించుకుంటూనే ఉన్నా. ఇక భారత్ లో తనకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు” అంటూ చెప్పుకొచ్చాడు ఈ సూపర్ స్టార్. అనంతర రోలిన్స్, సీనా ఇద్దరు కౌగిలించుకుని స్టేజ్ ను వీడారు. ప్రస్తుతం ఇండియన్ ఫ్యాన్స్ ను ఉద్దేశించి జాన్ సీనా ఇచ్చిన స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss