iDreamPost
android-app
ios-app

Ashish Nehra: నేను గంభీర్ లా కాదు.. ఆ ఒక్క కారణంతో హెడ్ కోచ్ పదవికి అప్లై చేయలేదు: ఆశిష్ నెహ్రా

  • Published Jul 25, 2024 | 2:07 PM Updated Updated Jul 25, 2024 | 2:07 PM

టీమిండియా హెడ్ కోచ్ పదవికి భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అప్లై చేసుకోలేదు. దానికి గల కారణాలను తాజాగా వెళ్లడించాడు ఈ స్టార్ పేసర్. ఆ ఒక్క రీజన్ తోనే తాను హెడ్ కోచ్ పోస్ట్ కు దరఖాస్తు చేసుకోలేదని చెప్పుకొచ్చాడు.

టీమిండియా హెడ్ కోచ్ పదవికి భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అప్లై చేసుకోలేదు. దానికి గల కారణాలను తాజాగా వెళ్లడించాడు ఈ స్టార్ పేసర్. ఆ ఒక్క రీజన్ తోనే తాను హెడ్ కోచ్ పోస్ట్ కు దరఖాస్తు చేసుకోలేదని చెప్పుకొచ్చాడు.

Ashish Nehra: నేను గంభీర్ లా కాదు.. ఆ ఒక్క కారణంతో హెడ్ కోచ్ పదవికి అప్లై చేయలేదు: ఆశిష్ నెహ్రా

టీమిండియా హెడ్ కోచ్ పదవికి ఎంతో మంది దిగ్గజ క్రికెటర్ల పేర్లు లిస్ట్ లోకి వచ్చాయి. కానీ వారందరిని కాదని ముందు నుంచి అనుకుంటున్న గౌతమ్ గంభీర్  భారత జట్టుకు కొత్త హెడ్ కోచ్ గా వచ్చాడు. వచ్చీ రావడంతోనే తన మార్క్ ను చూపెట్టడం స్టార్ట్ చేశాడు. అయితే హెడ్ కోచ్ పదవి రేసులో టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా పేరు కూడా వచ్చింది. కానీ అతడు దరఖాస్తు చేసుకోలేదు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హెడ్ కోచ్ పదవికి ఎందుకు అప్లై చేసుకోలేదో కారణం చెప్పుకొచ్చాడు. తాను గంభీర్ లా కాదని ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

టీ20 ప్రపంచ కప్ 2024కు ముందే టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రాకు హెడ్ కోచ్ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ వ్యక్తం అయ్యింది. అప్పట్లోనే బీసీసీఐ ఈ విషయం గురించి అతడితో చర్చించినట్లు కూడా వార్తలు వచ్చాయి. తాజాగా తాను టీమిండియా హెడ్ కోచ్ పదవికి ఎందుకు అప్లై చేసుకోలేదో కారణం చెప్పుకొచ్చాడు ఈ మాజీ స్టార్ పేసర్. లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నెహ్రా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ప్రస్తుతం ఆ కామెంట్స్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

“ప్రస్తుతం నా బాధ్యతలతో నేను బిజీగా ఉన్నాను. ఏ రోజు కూడా టీమిండియా హెడ్ కోచ్ పదవి గురించి ఆలోచించలేదు. నా పిల్లలు చిన్నవారు. వాళ్లు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. అయితే గౌతమ్ గంభీర్ పిల్లలు కూడా చిన్నవారే. కానీ నేను గంభీర్ లా ఆలోచించలేను, అతడి ఆలోచనలు భిన్నం. కుటుంబానికి దూరంగా 9 నెలల పాటు జట్టుతో ప్రయాణించే ఓపిక నాకు లేదు. ఈ ఒక్క కారణంతోనే నేను హెడ్ కోచ్ పదవికి అప్లై చేసుకోలేదు” అంటూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు ఆశిష్ నెహ్రా. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ కు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న నెహ్రా ఆ పదవి నుంచి తప్పుకోనున్నాడన్న వార్తలు వైరల్ గా మారాయి.