ప్రపంచ కప్ సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. ఈ నిర్ణయంతో క్రికెట్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచ కప్ సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. ఈ నిర్ణయంతో క్రికెట్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచ కప్ 2023 ముగింపు దశకు చేరుకుంది. నవంబర్ 15, 16 తేదీల్లో సెమీఫైనల్ మ్యాచ్ లు జరగనున్నాయి. తొలిపోరులో టీమిండియా-కివీస్ తో ఢీకొంటూ ఉండగా.. రెండో మ్యాచ్ లో ఆసీస్-సౌతాఫ్రికాతో తలపడబోతోంది. ఇక సూపర్ ఫామ్ లో ఉన్న భారత్, కివీస్ ను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించాలని భావిస్తోంది. దీంతో 2019 వరల్డ్ కప్ సెమీస్ లో ఓటమికి రివేంజ్ తీసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలోనే క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ లకు సంబంధించి కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కొన్ని రోజులుగా ఈ డెసిషన్ పై క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి ఐసీసీ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటో ఓసారి లుక్కేద్దాం.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ప్రపంచ కప్ లో జరగబోయే ఈ పోరు కోసం క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మెగాటోర్నీలో తిరుగులేని విజయాలతో దూసుకెళ్తున్న భారత్ జట్టు సెమీస్ లో కివీస్ ను ఓడించి ఫైనల్ వెళ్లడమే కాకుండా.. 2019 సెమీస్ లో పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. నవంబర్ 15న బుధవారం జరగబోయే ఈ కీలక మ్యాచ్ కు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా నిలవనుంది. ఇదిలా ఉండగా.. క్రికెట్ అభిమానులుకు శుభవార్త చెప్పింది ఐసీసీ. ప్రపంచ కప్ సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. సెమీఫైనల్స్ కు, ఫైనల్ కు రిజర్వ్ డేలను ప్రకటించింది.
ఈ మ్యాచ్ లు వర్షం పడి రద్దు అయితే.. నెక్ట్స్ డేన వాటిని నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించింది. దీంతో మూవీ లవర్స్ తెగ సంతోష పడిపోతున్నారు. ఇందుకు సంబంధించి ఐసీసీ స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది. కాగా.. ఒకవేళ రిజర్వ్ డే రోజున కూడా ఆగకుండా వర్షం పడితే.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. వర్షం వచ్చి మ్యాచ్ రద్దు అయితే.. టీమిండియా నేరుగా ఫైనల్ కు వెళ్తుంది. మరోవైపు సౌతాఫ్రికా-ఆసీస్ మ్యాచ్ కూడా ఇలాగే రద్దు అయితే.. పాయింట్ల పట్టికలో ముందున్న సఫారీ జట్టు ఫైనల్ కు దూసుకెళ్తుంది. మరి ఐసీసీ రిజర్వ్ డేలను ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ICC CONFIRMS THE RESERVE DAYS FOR SEMIS AND FINAL…!!!! pic.twitter.com/B2uxjV5qcf
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 14, 2023