డేనియల్ జార్విస్.. ఈ పేరు మీకు పెద్దగా పరిచయం లేదనుకుంటా. కానీ.. జార్వో 69 అంటే క్రికెట్ ప్రేమికులు ఠక్కున గుర్తుపట్టేస్తారు. దానికి కారణం అతడు చేసే ఓవరాక్షనే. క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్నప్పుడు మ్యాచ్ మధ్యలో భద్రతా సిబ్బందిని తప్పించుకుని గ్రౌండ్ లోకి దూసుకురావడం ఇతడికి అలవాటు. తాజాగా చెన్నైలో టీమిండియా-ఆసీస్ మధ్య మ్యాచ్ లోనూ జార్వో ఇదే పనిచేశాడు. భారత జట్టు జెర్సీ ధరించి గ్రౌండ్ లోకి దూసుకొచ్చాడు. దీంతో కొద్దిసేపు ఆటకు అంతరాయం కలిగింది. అయితే అతడు ఇలా గ్రౌండ్ లోకి రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఎన్నో మ్యాచ్ ల్లో ఇలాగే చేశాడు. దీంతో అతడిపై కఠిన చర్యలు తీసుకుంది ఐసీసీ.
ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా గ్రౌండ్ లోకి దూసుకొచ్చాడు జార్వో 69. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతడిని బయటకు పంపేందుకు ప్రయత్నించగా.. అతడు నిరాకరించాడు. దీంతో కొద్దిసేపు ఆటకు అంతరాయం కలిగింది. అయితే అతడు ఇలా చేయడం ఇదే మెుదటిసారి కాదు. గతంలో చాలా మ్యాచ్ ల్లో ఇలాగే మధ్యలో వచ్చాడు. ఇతడి చర్యలు శృతిమించడమే కాకుండా ఐసీసీకి విసుగుతెప్పించాయి. జార్వో ఓవరాక్షన్ పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంది. అతడిని వన్డే వరల్డ్ కప్ 2023 మ్యాచ్ లను చూడకుండా అతడిపై నిషేధం విధించింది. “వరల్డ్ కప్ లో భాగమైన ప్రతీ ఒక్కరి భద్రత మాకు ముఖ్యమైన అంశం. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన మాపై ఉంది. కాబట్టే అతడిని వరల్డ్ కప్ మ్యాచ్ లు చూడకుండా నిషేధిస్తున్నాం” అని ఐసీసీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.
“The individual concerned has been banned from attending any further games at the event and the matter is in the hands of the Indian authorities,”
ICC spokesperson confirms ‘Jarvo 69’ has been banned from attending World Cup games.#CWC23 #INDvAUShttps://t.co/EiL1Fo1Jfl
— Circle of Cricket (@circleofcricket) October 8, 2023