iDreamPost
android-app
ios-app

అరెస్ట్ భయంతో.. ఇండియా నుంచి పారిపోయిన పాక్ ప్రజెంటర్!

  • Author Soma Sekhar Published - 06:52 PM, Mon - 9 October 23
  • Author Soma Sekhar Published - 06:52 PM, Mon - 9 October 23
అరెస్ట్ భయంతో.. ఇండియా నుంచి పారిపోయిన పాక్ ప్రజెంటర్!

వన్డే ప్రపంచ కప్ కోసం వివిధ దేశాల నుంచి ఎంతో మంది స్పోర్ట్స్ ప్రజెంటర్లు ఇండియాకు వచ్చారు. వారిలో స్టార్ స్పోర్ట్స్ ప్రజెంటర్, పాకిస్థాన్ బ్యూటీ జైనాబ్ అబ్బాస్ కూడా ఒకరు. ఈ బ్యూటీకి వరల్డ్ వైడ్ గా అభిమానులు ఉన్నారు. తాజాగా వరల్డ్ కప్ కోసం పాక్ టీమ్ ఆడే మ్యాచ్ లకు ప్రజెంటర్ గా వ్యవహరించేందుకు ఇండియాకు వచ్చింది జైనాబ్ అబ్బాస్. అందులో భాగంగానే హైదరాబాద్ వేదికగా జరిగిన పాక్-నెదర్లాండ్స్ మ్యాచ్ కు హోస్ట్ గా కూడా చేసింది. హోస్ట్ గా తన అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ బ్యూటీ. అయితే ఇంతలోనే అరెస్ట్ చేస్తారనే భయంతో.. ఇండియా వదిలి పారిపోయిందని నేషనల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఆమె పారిపోవడానికి కారణాలు ఏంటి? ఎందుకు ఆమెను అరెస్ట్ చేస్తారు? పూర్తి వివరాల్లోకి వెళితే..

జైనాబ్ అబ్బాస్.. పాక్ స్పోర్ట్స్ ప్రజెంటర్ గా ఈ బ్యూటీకి వరల్డ్ వైడ్ గా అభిమానులు ఉన్నారు. తాజాగా జరుగుతున్న వరల్డ్ కప్ లో పాక్ ఆడే మ్యాచ్ లకు ప్రజెంటర్ గా వ్యవహరించేందుకు ఇండియా వచ్చింది ఈ అమ్మడు. పాక్-నెదర్లాండ్స్ మ్యాచ్ కు హోస్ట్ గా కూడా వ్యవహరించింది. కానీ ఇంతలోనే ఇండియా వదిలి పారిపోయిందని తెలుస్తోంది. ఆమెను అరెస్ట్ చేస్తారన్న భయంతోనే పారిపోయిందని సమాచారం. ఇంతకీ అసలు విషయం ఏంటంటే? గతంలో సోషల్ మీడియా వేదికగా జైనాబ్ హిందువులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసింది.

ఈ కామెంట్సే  జైనాబ్ ను చిక్కుల్లో పడేశాయి. ఆమె చేసిన ట్వీట్స్ కాస్త బయటపడటంతో.. ఇండియన్ నెటిజన్స్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఐసీసీ స్పోర్ట్స్ ప్రజెంటర్స్ లిస్ట్ నుంచి జైనాబ్ పేరును తొలగించాలని డిమాండ్ చేశారు. ఆమె హిందూ మతంపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వినీత్ జిందాల్ అనే సుప్రీం కోర్టు లాయర్ ఆమెపై ఢిల్లీలోని సైబర్ సెల్ విభాగంలో ఫిర్యాదు చేశాడు. జైనాబ్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో కోరాడు. ఈ నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేస్తారనే భయంతో.. ఇండియా వదిలి పారిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె దుబాయ్ లో ఉందని, అక్కడి నుంచి పాక్ వెళ్లనుందని ప్రచారం జరుగుతోంది.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabetjojobet