iDreamPost

Virat Kohli: వరల్డ్ కప్ గెలిచినా.. విరాట్ కోహ్లీకి అవమానం! ICCపై ఫ్యాన్స్ ఆగ్రహం..

వరల్డ్ కప్ గెలవగానే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి.. అందరికి షాకిచ్చాడు విరాట్. ఇదిలా ఉండగా.. కోహ్లీని దారుణంగా అవమానించింది ఐసీసీ. దాంతో ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

వరల్డ్ కప్ గెలవగానే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి.. అందరికి షాకిచ్చాడు విరాట్. ఇదిలా ఉండగా.. కోహ్లీని దారుణంగా అవమానించింది ఐసీసీ. దాంతో ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

Virat Kohli: వరల్డ్ కప్ గెలిచినా.. విరాట్ కోహ్లీకి అవమానం! ICCపై ఫ్యాన్స్ ఆగ్రహం..

టీ20 వరల్డ్ కప్ 2024 టైటిల్ ను కైవసం చేసుకున్న టీమిండియా ప్రతీ ఒక్క భారతీయుడిని ఆనందంలో ముంచెత్తింది. ఇక ఈ టోర్నీలో దారుణంగా విఫలం అయిన టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ.. కీలమైన ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అక్షర్ పటేల్ తో కలిసి పటిష్టమైన భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఈ మ్యాచ్ లో 76 పరుగులతో విన్నింగ్ నాక్ ఆడాడు రన్ మెషిన్. ఇక వరల్డ్ కప్ గెలవగానే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి.. అందరికి షాకిచ్చాడు విరాట్. ఇదిలా ఉండగా.. విరాట్ కోహ్లీని దారుణంగా అవమానించింది ఐసీసీ. దాంతో ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు.

టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో విన్నింగ్ ఇన్నింగ్స్ తో తన ఫామ్ పై వస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చాడు విరాట్ కోహ్లీ. ఇక టీమిండియా ప్రపంచ కప్ గెలిచిన తర్వాత పొట్టి ఫార్మాట్ కు కోహ్లీ గుడ్ బై చెప్పాడు. యంగ్ క్రికెటర్లకు అవకాశం కల్పించే ఉద్దేశంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఇదిలా ఉండగా.. విరాట్ కోహ్లీని దారుణంగా అవమానించింది ఐసీసీ. అసలు విషయం ఏంటంటే? ఐసీసీ తన టీ20 వరల్డ్ కప్ 2024 జట్టును తాజాగా ప్రకటించింది. అందులో విరాట్ కోహ్లీకి స్థానం దక్కలేదు. దాంతో ఐసీసీపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఫైనల్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీని ఎందుకు సెలెక్ట్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు. అయితే టోర్నీ మెుత్తం రాణించిన ఆటగాళ్లకే తమ జట్టులో స్థానం ఇచ్చింది ఐసీసీ.

కాగా.. ఐసీసీ ప్రకటించిన జట్టులో టీమిండియా ఆటగాళ్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ఏకంగా ఆరుగులు ఆటగాళ్లు ఈ జట్టులో స్థానం దక్కించుకున్నారు. అందులో వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ లు చోటు దక్కించుకున్నారు. నలుగు ప్లేయర్లు ముంబై ఇండియన్స్ టీమ్ వాళ్లే కావడం గమనార్హం. అయితే ఇందులో విరాట్ కోహ్లీకి స్థానం దక్కకపోవడంతో.. ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనౌతున్నారు. టీమిండియా ప్లేయర్ల తర్వాత ఆఫ్గానిస్తాన్ ఆటగాళ్లు

ఐసీసీ ప్రకటించిన టీ20 వరల్డ్ కప్ 2024 జట్టు ఇదే:

రోహిత్ శర్మ, రహ్మనుల్లా గుర్బాజ్, నికోలస్ పూరన్, సూర్యకుమార్ యాదవ్, స్టోయినిస్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రషీద్ ఖాన్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, ఫజల్ హక్ ఫారూఖీ, అన్రిచ్ నోర్ట్జే(12వ ఆటగాడు).

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి