క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే క్రికెట్ మహా సంగ్రామం ప్రారంభానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉంది. అక్టోబర్ 5న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్ ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ గాడ్, దిగ్గజం సచిన్ టెండుల్కర్ కు ఐసీసీ నుంచి అరుదైన గౌరవం దక్కింది. మరి వరల్డ్ కప్ ముంగిట సచిన్ కు దక్కిన అరుదైన గౌరవం ఏంటి? మాస్టర్ బ్లాస్టర్ తో పాటు ఎవరెవరు ఈ జాబితాలో ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
భారతరత్న, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నీకి గ్లోబల్ అంబాసిడర్ గా సచిన్ నియమించబడ్డాడు. ఈ విషయాన్ని ఐసీసీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కాగా.. ప్రపంచ కప్ గ్లోబల్ అంబాసిడర్ హోదాలో సచిన్ వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్ కు ముందు ప్రపంచ కప్ ట్రోఫీతో మైదానంలోకి వస్తాడు. ఈ సందర్భంగా ప్రపంచ కప్ ప్రారంభాన్ని అధికారికంగా ప్రకటిస్తాడు. ఇక ఐసీసీ ప్రకటించిన వరల్డ్ కప్ అంబాసిడర్ల జాబితాలో విండీస్ దిగ్గజం రిచర్డ్స్, ఏబీ డివిలియర్స్, ఇయాన్ మోర్గాన్, ఆరోన్ ఫించ్, ముత్తయ్య మురళీ ధరన్, రాస్ టేలర్, సురేష్ రైనా, టీమిండియా మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, పాక్ ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్ ఉన్నారు. మరి సచిన్ కు దక్కిన ఈ అరుదైన గౌరవంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The ICC has announced Sachin Tendulkar as the Global Ambassador for the 2023 World Cup. pic.twitter.com/VfLUT6QIbA
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 3, 2023