ICC ప్రతిష్టాత్మక అవార్డు రేసులో ప్రపంచ కప్ హీరోలు.. టీమిండియా నుంచి ఒక్కడే!

  • Author Soma Sekhar Published - 06:37 PM, Tue - 7 November 23

ఐసీసీ ప్రతి నెలా ప్రకటించే ప్రతిష్టాత్మక ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో టీమిండియా నుంచి ఒకే ఒక్క ఆటగాడు నిలిచాడు. ఈ లిస్ట్ లో విరాట్ కోహ్లీ లేకపోవడం ఆశ్చర్యకరం. మరి ఈ వార్డు రేసులో ఉన్న వరల్డ్ కప్ హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐసీసీ ప్రతి నెలా ప్రకటించే ప్రతిష్టాత్మక ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో టీమిండియా నుంచి ఒకే ఒక్క ఆటగాడు నిలిచాడు. ఈ లిస్ట్ లో విరాట్ కోహ్లీ లేకపోవడం ఆశ్చర్యకరం. మరి ఈ వార్డు రేసులో ఉన్న వరల్డ్ కప్ హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Published - 06:37 PM, Tue - 7 November 23

ఐసీసీ ప్రతి నెలా ప్రతిష్టాత్మకమైన ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ప్రకటించడం మనకు తెలిసిన విషయమే. ఓ నెలలో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించిన ఆటగాళ్లను నామినేట్ చేయడం, వారిని ఓటింగ్ ద్వారా ఎన్నుకోవడం జరుగుతూ వస్తోంది. తాజాగా అక్టోబర్ నెలకు సంబంధించి నామినీస్ గా ముగ్గురు ప్లేయర్లను ఐసీసీ ఎంపిక చేసింది. అందులో టీమిండియా నుంచి ఒకే ఒక్క ప్లేయర్ కు అవకాశం దక్కడం గమనార్హం. అయితే ఇందులో భారత్ స్టార్ బ్యాటర్, వరల్డ్ కప్ లో దుమ్మురేపుతున్న విరాట్ కోహ్లీ నామినేట్ కాకపోవడం అందర్ని ఆశ్చర్య పరిచింది. ఇక ఈ అవార్డు రేసులో టీమిండియా ప్లేయర్ తో పాటుగా సౌతాఫ్రికా,న్యూజిలాండ్ ఆటగాడు నిలిచారు. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో వీరు ముగ్గరు అత్యద్భుతమైన ఆటతీరును కనబరుస్తున్నారు. మరి ఆ ముగ్గురు ప్లేయర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

ఐసీసీ ప్రతి నెల ప్రకటించే ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో ముగ్గురు ఆటగాళ్లు ఉన్నారు. వారిలో సౌతాఫ్రికా ఓపెనర్ బ్యాటర్ క్వింటన్ డికాక్, న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్రతో పాటుగా టీమిండియా స్పీడ్ గన్ బుమ్రాలు ఈ అవార్డుకు అక్టోబర్ నెలకుగాను నామినీస్ గా ఎన్నుకోబడ్డారు. ఓటింగ్ తర్వాత వీరిలో ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఎవరో తెలుస్తోంది. కాగా.. వీరు ముగ్గురు వరల్డ్ కప్ లో దుమ్మురేపుతున్నారు. డికాక్ ఈ ప్రపంచ కప్ లో 8 మ్యాచ్ ల్లో 4 శతకాల సాయంతో 550 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇక కివీస్ నయా సంచలనం రచిన్ రవీంద్ర అందరిని ఆశ్చర్యపరుస్తూ.. అద్భుత ఆటతీరుతో దూసుకెళ్తున్నాడు. అతడు 8 మ్యాచ్ ల్లో 3 రికార్డు శతకాలతో 523 రన్స్ చేసి.. లీడింగ్ స్కోరర్స్ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.

టీమిండియా స్పీడ్ గన్ బుమ్రా తన పేస్ తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. ఈ అవార్డు రేసులో నిలిచాడు. అతడు ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్ ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రపంచ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు బుమ్రా. మరి వీరిలో ఈ అవార్డును ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి. కాగా.. మెన్స్ నామినీస్ తో పాటుగా వుమెన్స్ పేర్లను కూడా ఐసీసీ ప్రకటించింది. ఈ జాబితాలో వెస్టిండీస్ నుంచి హేలీ మాథ్యూస్, బంగ్లాదేశ్ నుంచి నహిద అక్తర్, కివీస్ అమేలయా కెర్ ఈ అవార్డు రేసులో ఉన్నారు. మరి ఈ అవార్డు ఎవరికి దక్కుతుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments