iDreamPost
android-app
ios-app

Hardik Pandya: బిగ్ బ్రేకింగ్: IPL 2024కు హార్దిక్ పాండ్యా దూరం! కర్మ ఫలితమేనా?

  • Published Dec 23, 2023 | 2:59 PM Updated Updated Dec 23, 2023 | 2:59 PM

ముంబై ఇండియన్స్ కు బిగ్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. రోహిత్ ను కాదని హార్దిక్ పాండ్యాకు ముంబై టీమ్ పగ్గాలను అప్పగించిన విషయం తెలిసిందే. కాగా.. వచ్చే ఐపీఎల్ సీజన్ కు పాండ్యా దూరం కానున్నట్లు సమాచారం.

ముంబై ఇండియన్స్ కు బిగ్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. రోహిత్ ను కాదని హార్దిక్ పాండ్యాకు ముంబై టీమ్ పగ్గాలను అప్పగించిన విషయం తెలిసిందే. కాగా.. వచ్చే ఐపీఎల్ సీజన్ కు పాండ్యా దూరం కానున్నట్లు సమాచారం.

Hardik Pandya: బిగ్ బ్రేకింగ్: IPL 2024కు హార్దిక్ పాండ్యా దూరం! కర్మ ఫలితమేనా?

హార్దిక్ పాండ్యా.. గత కొన్ని రోజులుగా క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారిన పేరు. రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా తొలగించి, క్యాష్ ఆన్ ట్రేడ్ ద్వారా గుజరాత్ నుంచి జట్టులోకి వచ్చిన హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన ఐపీఎల్ లో పెను సంచలనం సృష్టించింది. రోహిత్ శర్మను తప్పించడంతో రోహిత్ ఫ్యాన్స్ ముంబై యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ముంబై యాజమాన్యంను అన్ ఫాలో చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా.. హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఓ బిగ్ న్యూస్ సోషల్ మీడియలో వైరల్ గా మారింది. వచ్చే ఐపీఎల్ సీజన్ కు పాండ్యా దూరం కానున్నాడట.

ముంబై ఇండియన్స్ కు బిగ్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. రోహిత్ ను కాదని హార్దిక్ పాండ్యాకు ముంబై టీమ్ పగ్గాలను అప్పగించిన విషయం తెలిసిందే. కాగా.. వచ్చే ఐపీఎల్ సీజన్ కు పాండ్యా దూరం కానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఈ సీజన్ కు హార్దిక్ దూరం అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. గాయం నుంచి పాండ్యా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. దీంతో ఆఫ్గానిస్తాన్ తో జరిగే టీ20 సిరీస్ కు కూడా దురమైయ్యాడు పాండ్యా. ఈ విషయం ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు అధికారులు. దీంతో ఐపీఎల్ సీజన్ కు సైతం పాండ్యా అందుబాటులో ఉండడని తెలుస్తోంది. అదీకాక వచ్చే ఐపీఎల్ సీజన్ కు పాండ్యా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు అనధికారిక సమాచారం. దీంతో కర్మ అంటే ఇదే అంటూ రోహిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.