iDreamPost
android-app
ios-app

రోహిత్ సపోర్ట్ లేకుండా కప్ కష్టమని పాండ్యాకి అర్థమైందా? దిగొచ్చాడు!

  • Published Mar 18, 2024 | 4:31 PM Updated Updated Mar 18, 2024 | 5:05 PM

Hardik Pandya, Rohit Sharma: ముంబై ఇండియన్స్‌లో రోహిత్‌ శర్మ ఎంత కీలకమైన ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెప్టెన్‌గా పక్కనపెట్టినా.. బ్యాటర్‌గా రోహిత్‌ బిగ్‌ అసెట్‌. ఆ విషయంతో పాండ్యాకు కూడా తెలిసొచ్చినట్లు ఉంది. అందుకే దిగొచ్చాడు.

Hardik Pandya, Rohit Sharma: ముంబై ఇండియన్స్‌లో రోహిత్‌ శర్మ ఎంత కీలకమైన ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెప్టెన్‌గా పక్కనపెట్టినా.. బ్యాటర్‌గా రోహిత్‌ బిగ్‌ అసెట్‌. ఆ విషయంతో పాండ్యాకు కూడా తెలిసొచ్చినట్లు ఉంది. అందుకే దిగొచ్చాడు.

  • Published Mar 18, 2024 | 4:31 PMUpdated Mar 18, 2024 | 5:05 PM
రోహిత్ సపోర్ట్ లేకుండా కప్ కష్టమని పాండ్యాకి అర్థమైందా? దిగొచ్చాడు!

మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్‌ 17వ సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ నెల 22న చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ మెగా సీజన్‌కు తెరలేవనుంది. అయితే.. ఈ సీజన్‌ ఆరంభానికి ముందు హాట్‌ టాపిక్‌గా నిలిచిన విషయం ఏంటో అందరికి తెలిసిందే. అదే.. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మను తప్పించి.. అతని స్థానంలో గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి ముంబైలోకి తిరిగొచ్చిన హార్ధిక్‌ పాండ్యాకు అప్పగించడం. విషయంపై ముంబై ఇండియన్స్‌ ఫ్యాన్స్‌తో పాటు రోహిత్ శర్మ ఫ్యాన్స్‌ కూడా ఫుల్‌ ఫైర్‌ అయ్యారు. హార్ధిక్‌ పాండ్యాపై అలాగే ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌పై దుమ్మెత్తిపోశారు. అయితే.. సీజన్‌ ఆరంభం కాబోయే ముందు.. ఇప్పుడు పాండ్యా, రోహిత్‌ శర్మ గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

రోహిత్‌ శర్మ ముంబై ఇండియన్స్‌ కోసం ఎంతో చేశాడని, అలాగే ప్రస్తుతం అతను టీమిండియాకు కెప్టెన్‌గా ఉన్నాడని ఇదంతా తనకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నాడు. రోహిత్‌ శర్మ ఏదైతే సాధించాడో దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని అన్నాడు. అయితే.. రోహత్‌ శర్మ తనకు మద్దతుగా ఉంటాడని, అతని చేయి తన భుజంపై ఉంటుందని అనుకుంటున్నట్లు పాండ్యా వెల్లడించాడు. కోచ్‌ మార్క్‌ బౌచర్‌తో కలిసి పాల్గొన్న ఒక ప్రెస్‌ మీట్‌లో పాండ్యా ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే.. పాండ్యా చేసిన కామెంట్స్‌పై నెటిజన్లు భిన్నంగా రియాక్ట్‌ అవుతున్నారు.

రోహిత్‌ శర్మ సపోర్ట్‌ లేకుండా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ను నడిపించడం గెలిపించడం కష్టమని పాండ్యాకు తెలిసొచ్చిందని, అందుకే తన అహాన్ని పక్కనపెట్టి మరీ.. ఇప్పుడు రోహిత్‌ జపం చేస్తున్నాడంటూ క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. అయితే.. ఇటీవల తాను ఐపీఎల్‌ 2024 సీజన్‌ ఆడటం లేదని, సుదీర్ఘంగా క్రికెట్‌ ఆడటం, జూన్‌లో టీ20 వరల్డ్‌ కప్‌ ఉండటంతో తాను ఐపీఎల్‌కు దూరంగా ఉంటున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన రోహిత్‌ శర్మ.. వెంటనే దాన్ని తొలగించిన విషయం తెలిసిందే. నేడో రేపో ముంబై జట్టుతో రోహిత్‌ చేరుతున్నాడని వార్తలు కూడా వస్తున్నాయి. అయితే.. రోహిత్‌ కోపం తగ్గించేందుకు అలాగే.. రోహిత్‌ నుంచి మంచి ప్రదర్శన రాబట్టేందుకే పాండ్యా మెట్టు దిగొచ్చి.. రోహిత్‌ను పొగుడుతున్నాడనే టాక్‌ వినిపిస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.