Somesekhar
వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గుజరాత్ లోని సోమనాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గుజరాత్ లోని సోమనాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Somesekhar
హార్దిక్ పాండ్యా.. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ గా జట్టులోకి వచ్చిన అనతికాలంలోనే సుస్థిరమైన ప్లేస్ ను దక్కించుకున్నాడు. వైస్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించే స్థాయికి రావడంతో పాటుగా టీ20 కెప్టెన్ గా ప్రమోషన్ కూడా పొందాడు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా.. ఐపీఎల్ 2024 సీజన్ కి వచ్చేసరికి పాండ్యా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గుజరాత్ నుంచి వచ్చి ముంబై టీమ్ కెప్టెన్ పగ్గాలను చేపట్టాడు పాండ్యా. అప్పటి నుంచి అతడిని దరిద్రం పట్టుకుంది. ఒకవైపు రోహిత్ నుంచి నాయకత్వం తీసుకున్నాడన్న అపవాదు.. మరోవైపు వరుసగా మూడు ఓటములు. ఇన్ని సమస్యల మధ్య తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు పాండ్యా. ఈ నేపథ్యంలో దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశాడు హార్దిక్.
ఐపీఎల్ 2024 సీజన్ లో ముంబై ఇండియన్స్ దారుణమైన ఫర్పామెన్స్ ఇస్తోంది. హ్యాట్రిక్ ఓటములతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది ముంబై టీమ్. ఇక తమని ఓటముల నుంచి గట్టెక్కించాలని శివుడికి ప్రత్యేక పూజలు చేశాడు హార్దిక్ పాండ్యా. గుజరాత్ లోని సోమనాథ్ దేవాలయాన్ని తాజాగా సందర్శించాడు పాండ్యా. ఈ సందర్భంగా శివుడికి పాలాభిషేకం చేసి మెుక్కులు చెల్లించుకున్నాడు. వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అతడికి తీర్థప్రసాదాలు ఇచ్చారు. ప్రస్తుతం పాండ్యా పూజలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గత మ్యాచ్ తర్వాత కాస్త సమయం దొరకడంతో పాండ్యా ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక అటునుంచి అటే సోమనాథ్ దేవాలయాన్ని సందర్శించినట్లున్నాడు. వరుస ఓటములతో తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నాడు పాండ్యా. దీంతో తనకు పట్టిన దరిద్రం పోవాలని ప్రత్యేక పూజలు చేశాడు. ఇక తన నెక్ట్స్ మ్యాచ్ లో ఏప్రిల్ 7న ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది ముంబై. కాగా.. పాండ్యా పూజలు ఫలించి ఈ మ్యాచ్ లోనైనా నెగ్గి పుంజుకుంటుందా? లేదా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి హార్దిక్ ప్రత్యేక పూజలు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#WATCH | Gujarat: Indian Cricket Team all-rounder Hardik Pandya offers prayers at Somnath Temple.
Source: Somnath Temple Trust pic.twitter.com/F8n05Q1LSA
— ANI (@ANI) April 5, 2024