iDreamPost
android-app
ios-app

విండీస్ తో విజయం తర్వాత హార్దిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు!

  • Author Soma Sekhar Published - 11:42 AM, Wed - 2 August 23
  • Author Soma Sekhar Published - 11:42 AM, Wed - 2 August 23
విండీస్ తో విజయం తర్వాత హార్దిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు!

వెస్టిండీస్ తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 200 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంది. ఇక ఈ సిరీస్ ను గెలవడం ద్వారా ఒకే జట్టుపై అత్యధిక (13) ద్వైపాక్షిక సిరీస్ లు గెలిచిన ఏకైక జట్టుగా నిలిచింది భారత్. కాగా.. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు విశ్రాంతిని ఇచ్చారు. దాంతో జట్టులోకి శాంసన్, గైక్వాడ్ లు వచ్చారు. ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధించిన తర్వాత కీలక వ్యాఖ్యలు చేశాడు తాత్కాలిక సారథి హార్దిక్ పాండ్యా. అతడి సూచనలు పాటించడం వల్లే గెలిచాం అంటూ చెప్పుకొచ్చాడు.

వెస్టిండీస్ తో మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా యువ బ్యాటర్లు చెలరేగారు. భారత తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ ద్వారా టచ్ లోకి వచ్చాడు. తొలుత నెమ్మదిగా ఆడిన పాండ్యా.. ఆ తర్వాత గేర్ మార్చాడు. చివర్లో వీరబాదుడు బాదాడు. ఈ మ్యాచ్ లో పాండ్యా 70 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడిన పాండ్యా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పాండ్యా మాట్లాడుతూ..”గత వన్డేలో ఓటమి తర్వాత మాపై చాలా విమర్శలు వచ్చాయి. ఈ విజయం మాకు ఎంతో ప్రత్యేకమైంది. కీలక మ్యాచ్ లో కుర్రాళ్లు అదరగొట్టారు. ఒక కెప్టెన్ గా ఇలాంటి మ్యాచ్ ను నడిపించడం సంతోషంగా ఉంది. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకపోయినప్పటికీ యంగ్ ప్లేయర్లు ఒత్తిడిని తట్టుకుని గొప్పగా రాణించారు. అయితే కీలకమైన టోర్నీల ముంగిట సీనియర్లుకు విశ్రాంతి ఇవ్వాల్సి వచ్చింది. ఇక ఈ మ్యాచ్ కు ముందు విరాట్ కోహ్లీతో జరిపిన సంభాషణ ఎంతో ఉపయోగపడింది. క్రీజ్ లో ఎక్కువ సమయం గడపమని విరాట్ సూచించాడు. ఆ సూచనలే పాటించా. విరాట్ కు నా ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చాడు పాండ్యా.

ఇక ఇలాంటి పిచ్ లపై భారీ స్కోర్లు చేయడం సాధారణ విషయం కాదని పాండ్యా పేర్కొన్నాడు. శుభ్ మన్ గిల్ అద్భుతమైన క్యాచ్ లు అందుకున్నాడు. గ్రౌండ్ లో సదుపాయాలు ఇంకాస్త మెరుగ్గా ఉంటే బాగుండేదని పాండ్యా తెలిపాడు. మరోసారి మేం విండీస్ పర్యటనకు వచ్చేటప్పటికీ ఈ సమస్యలు ఉండవని భావిస్తున్నాం అంటూ పాండ్యా చెప్పుకొచ్చాడు. ఇక కెప్టెన్సీని తాను చేపట్టినా.. ట్రోఫీ మాత్రం రోహిత్ కే చెందుతుందని సరదాగా వ్యాఖ్యానించాడు హార్దిక్ పాండ్యా.

ఇదికూడా చదవండి: 10 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. 27 సంవత్సరాల రికార్డు బ్రేక్ చేసిన ఉనద్కత్