iDreamPost
android-app
ios-app

పాండ్యా లేటెస్ట్ హెల్త్ అప్డేట్.. కివీస్ తో మ్యాచ్ కు..

  • Author Soma Sekhar Published - 02:47 PM, Fri - 20 October 23

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా అతడి హెల్త్ పై కీలక అప్డేడ్ వచ్చింది. మరి న్యూజిలాండ్ తో మ్యాచ్ కు అతడు అందుబాటులో ఉంటాడా? ఉండడా? అన్న అనుమానం అందరిలో మెుదలైంది.

వరల్డ్ కప్ లో జెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది టీమిండియా. నాలుగు వరుస విజయాలతో సెమీఫైనల్ రేజులో ముందంజలో ఉంది భారత జట్టు. ఫుల్ జోష్ లో ఉన్న టీమిండియాకు బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ లో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దీంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించింది మేనేజ్ మెంట్. తాజాగా అతడి హెల్త్ పై కీలక అప్డేడ్ వచ్చింది. మరి న్యూజిలాండ్ తో మ్యాచ్ కు అతడు అందుబాటులో ఉంటాడా? ఉండడా? అన్న అనుమానం అందరిలో మెుదలైంది.

ప్రపంచ కప్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బతగిలింది. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో గాయపడిన విషయం తెలిసిందే. ఇక అతడిని స్కాన్ కోసం ఆస్పత్రికి తరలించగా.. అక్కడ వైద్యులు కొన్ని పరీక్షలు చేశారు. గాయం పెద్దది కాకపోయినప్పటికీ.. అతడు అక్టోబర్ 22న ధర్మశాల వేదికగా న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ కు అందుబాటులోకి రాడని సమాచారం. ప్రస్తుతం పాండ్యాను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి తరలించినట్లు తెలుస్తోంది. అక్కడే అతడికి వైద్యం అందించనున్నారు.

కాగా.. పాండ్యా తిరిగి ఇంగ్లాండ్ తో అక్టోబర్ 29న లక్నో వేదికగా జరిగే మ్యాచ్ కు అందుబాటులోకి వస్తాడని మేనేజ్ మెంట్ కు సంబంధించిన సభ్యులు తెలిపారు. పాండ్యా జట్టుకు దూరం అయితే టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులను తీసిపారేయలేం. ఇక బంగ్లాదేశ్ తో మ్యాచ్ సందర్భంగా లిటన్ దాస్ కొట్టిన స్ట్రెయిట్ డ్రైవ్ ను ఆపబోయిన పాండ్యాకు బాల్ బలంగా వచ్చి కాలికి తగలడంతో.. నొప్పితో విలవిలలాడాడు. దీంతో ఓవర్ మధ్యలోనే గ్రౌండ్ ను వీడాడు పాండ్యా.