iDreamPost

World Cup 2023: ఆసీస్‌తో మ్యాచ్‌కు ఇప్పటికే గిల్‌ దూరం! తాజాగా మరో ప్లేయర్‌..

  • Author Soma Sekhar Updated - 12:59 PM, Sat - 7 October 23
  • Author Soma Sekhar Updated - 12:59 PM, Sat - 7 October 23
World Cup 2023: ఆసీస్‌తో మ్యాచ్‌కు ఇప్పటికే గిల్‌ దూరం! తాజాగా మరో ప్లేయర్‌..

వరల్డ్ కప్ 2023లో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.. కానీ జట్టుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ప్రపంచ కప్ లో భాగంగా.. అక్టోబర్ 8 ఆదివారం నాడు ఆస్ట్రేలియాతో తలపడబోతుంది టీమిండియా. ఇందుకోసం భారత ఆటగాళ్లు నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియాకు మరో బిగ్ షాక్ తగిలింది. ప్రాక్టీస్ లో స్టార్ ప్లేయర్ కు గాయం అయినట్లు సమాచారం. ఇప్పటికే భారత స్టార్ ఆటగాడు శుబ్ మన్ గిల్ డెంగ్యూ బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఆటగాడికి గాయం కావడంతో జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది.

వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆసీస్ తో తలపడేందుకు టీమిండియా సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు మరో బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు గాయం అయినట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్ రిపోర్ట్ ప్రకారం.. ఆసీస్ తో మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా.. పాండ్యా కుడి చేతి వేలికి గాయమైనట్లు సమాచారం. గాయం కారణంగా అతడు నొప్పితో బాధపడుతూ.. తర్వాత ప్రాక్టీస్ కూడా చేయలేదని తెలుస్తోంది. అయితే శనివారం పాండ్యా ప్రాక్టీస్ కు వచ్చాడు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. పాండ్యా  ప్రాక్టీస్ కు వచ్చినప్పటికీ.. రేపే(ఆదివారం) మ్యాచ్ ఉండటంతో ఈ సమయానికి పాండ్యా కోలుకోకపోతే టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బనే చెప్పాలి. ఇప్పటికే డెంగ్యూ బారిన పడ్డ స్టార్ ఓపెనర్ గిల్.. ఆసీస్ తో మ్యాచ్ కు అందుబాటులో ఉండటం అనుమానంగానే ఉంది. ఇలాంటి టైమ్ లో పాండ్యా గాయపడటం టీమిండియా ఫ్యాన్స్ లో ఆందోళన కలిగిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి