Nidhan
వరల్డ్ కప్ హీరో హార్దిక్ పాండ్యా తగ్గేదేలే అని అంటున్నాడు. ట్రోఫీతో స్వదేశానికి తిరిగొచ్చాక ఫుల్ బిజీ అయిపోయాడీ ఆల్‌రౌండర్. తాజాగా అంబానీల ఈవెంట్లోనూ రచ్చ చేశాడు.
వరల్డ్ కప్ హీరో హార్దిక్ పాండ్యా తగ్గేదేలే అని అంటున్నాడు. ట్రోఫీతో స్వదేశానికి తిరిగొచ్చాక ఫుల్ బిజీ అయిపోయాడీ ఆల్‌రౌండర్. తాజాగా అంబానీల ఈవెంట్లోనూ రచ్చ చేశాడు.
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్‌తో హార్దిక్ పాండ్యా ఒక్కసారిగా హీరో అయిపోయాడు. అలాగని ఇంతకుముందు అతడికి స్టార్ స్టేటస్ లేదని కాదు. టీమిండియా తరఫున గత కొన్నేళ్లుగా అద్భుతంగా ఆడుతూ కోట్లాది మంది మనసుల్ని దోచుకున్నాడతను. అయితే ఐపీఎల్-2024 టైమ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ కాంట్రవర్సీ కారణంగా అతడిపై భారీగా ట్రోలింగ్ నడిచింది. గుజరాత్‌ను డబ్బుల కోసం వీడాడని కొందరు విమర్శించారు. సారథ్యం కోసం ముంబైకి వచ్చాడని, రోహిత్‌కు అన్యాయం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. తీరా ఐపీఎల్లో పాండ్యా బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ముంబై కెప్టెన్‌గా ఫెయిల్ అవడంతో అతడ్ని వరల్డ్ కప్‌కు సెలెక్ట్ చేయొద్దనే డిమాండ్లు పెరిగాయి. అయినా అతడ్ని ఎంపిక చేశారు సెలెక్టర్లు. వాళ్ల నమ్మకాన్ని అతడు నిలబెట్టాడు.
ప్రపంచ కప్ ముందు విమర్శలపాలై ఒక్కసారిగా విలన్‌గా మారిన హార్దిక్.. కొన్ని వారాలు గడిచేసరికి హీరో అయిపోయాడు. మెగాటోర్నీలో టీమిండియా విజేతగా నిలవడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ అదరగొట్టాడు. ఫైనల్ మ్యాచ్‌లో క్లాసెన్‌తో పాటు మిల్లర్ వికెట్లు తీసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. దీంతో హార్దిక్‌కు సారీ చెప్పారు ఫ్యాన్స్. అనవసరంగా ట్రోల్ చేశాం.. నువ్వు హీరోవి అంటూ మెచ్చుకుంటున్నారు. ఇక, వరల్డ్ కప్ ట్రోఫీతో స్వదేశానికి తిరిగొచ్చాక ఫుల్ బిజీ అయిపోయాడు పాండ్యా. ప్రధాని మోడీని కలిశాక విక్టరీ పరేడ్‌లో పాల్గొన్న అతడు.. ఇవాళ అంబానీల వేడుకలో మెరిశాడు. ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ మ్యారేజ్ ఈవెంట్‌కు అతడు అటెండ్ అయ్యాడు.
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలో మాస్ డ్యాన్స్‌తో రచ్చ చేశాడు హార్దిక్. బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్, రణ్వీర్ సింగ్‌తో కలసి ఢోల్ సౌండ్‌కు అనుగుణంగా స్టెప్స్ వేశాడు పాండ్యా. ఈవెంట్లో ఫుల్ ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. అంతకుముందు అతడితో పాటు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌ను అతిథి మర్యాదలతో సత్కరించారు నీతా అంబానీ. ఈ వరల్డ్ కప్ హీరోస్‌ను స్వయంగా ఆమెనే దగ్గర ఉండి మరీ వేదిక మీదకు తీసుకొచ్చారు. రోహిత్‌ను హగ్ చేసుకొని ఏడ్చేశారు నీతా అంబానీ. ప్రపంచ కప్ కలను నెరవేర్చినందుకు థ్యాంక్స్ చెప్పారు. సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ సూపర్బ్ అని ప్రశంసించారు. రోహిత్, సూర్య, హార్దిక్‌ను ముకేశ్ అంబానీ కూడా మెచ్చుకున్నారు. మరి.. హార్దిక్ డ్యాన్స్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
Dhoni, Salman Khan, Ranveer, Hardik dancing together in Anant Ambani Sangeet Ceremony. 🔥 pic.twitter.com/lvFjDUUlhy
— Johns. (@CricCrazyJohns) July 6, 2024