iDreamPost
android-app
ios-app

వరల్డ్ కప్ హీరోస్​ను గౌరవించిన అంబానీ ఫ్యామిలీ.. రోహిత్, హార్దిక్ కంటే అతడికే ఇంపార్టెన్స్!

  • Published Jul 06, 2024 | 4:55 PM Updated Updated Jul 06, 2024 | 4:55 PM

Ambani's Honor World Cup Heroes: టీ20 వరల్డ్ కప్​ ట్రోఫీతో స్వదేశానికి తిరిగొచ్చిన భారత ఆటగాళ్లకు అడుగడుగునా ఘన స్వాగతం లభిస్తోంది. తాజాగా అంబానీ ఫ్యామిలీ కూడా ప్రపంచ కప్ హీరోలను గౌరవించింది.

Ambani's Honor World Cup Heroes: టీ20 వరల్డ్ కప్​ ట్రోఫీతో స్వదేశానికి తిరిగొచ్చిన భారత ఆటగాళ్లకు అడుగడుగునా ఘన స్వాగతం లభిస్తోంది. తాజాగా అంబానీ ఫ్యామిలీ కూడా ప్రపంచ కప్ హీరోలను గౌరవించింది.

  • Published Jul 06, 2024 | 4:55 PMUpdated Jul 06, 2024 | 4:55 PM
వరల్డ్ కప్ హీరోస్​ను గౌరవించిన అంబానీ ఫ్యామిలీ.. రోహిత్, హార్దిక్ కంటే అతడికే ఇంపార్టెన్స్!

టీ20 వరల్డ్ కప్​ ట్రోఫీతో స్వదేశానికి తిరిగొచ్చిన భారత జట్టుకు అడుగడుగునా ఘన స్వాగతం లభిస్తోంది. ఇండియాకు వచ్చాక తొలి రోజు ప్రధాని నరేంద్ర మోడీని కలిసింది మెన్ ఇన్ బ్లూ. ఆ తర్వాత ముంబైకి రాగా వాటర్ సెల్యూర్ రూపంలో గ్రాండ్​ వెల్​కమ్ దక్కింది. అనంతరం లక్షలాది మంది అభిమానుల కోలాహలంతో వాంఖడే స్టేడియానికి వెళ్లారు టీమిండియా ప్లేయర్లు. అక్కడ డ్యాన్సులు చేస్తూ, పాటలు పాడుతూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ తర్వాతి రోజు ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె, యశస్వి జైస్వాల్ నిన్న మహారాష్ట్ర అసెంబ్లీకి వెళ్లారు. అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ షిండే వాళ్లకు సన్మానం చేశారు. ఇవాళ కూడా హిట్​మ్యాన్​ బిజీగానే గడిపాడు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహ వేడుకకు హాజరయ్యాడు రోహిత్. అతడితో పాటు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా కూడా ఈ పెళ్లికి అటెండ్ అయ్యారు. ఈ ముగ్గురినీ సత్కరించింది అంబానీ ఫ్యామిలీ. రోహిత్ సతీమణి రితికా చేయిని పట్టుకొని లోపలికి తీసుకెళ్లారు నీతా అంబానీ. ఆ తర్వాత హిట్​మ్యాన్​ను పట్టుకొని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. కప్ గెలిచామన్న సంతోషంలో ఆమె ఏడ్చేశారు. వీళ్లు సాధించిన విజయాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువేనన్నారు. ఆ తర్వాత సూర్యకుమార్ క్యాచ్ గురించి ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. కోట్లాది మంది ఆశల్ని సజీవంగా ఉంచిన క్యాచ్ అది అని మెచ్చుకున్నారు.

బౌండరీ లైన్ దగ్గర సూర్యకుమార్ పట్టిన క్యాచ్ అద్భుతమంటూ ప్రశంసల్లో ముంచెత్తారు నీతా అంబానీ. సూర్య.. సూర్య అంటూ ఆమె స్లోగన్ ఇచ్చారు. దీంతో ఈవెంట్​లో పాల్గొన్న అతిథులందరూ అతడి నామస్మరణ చేశారు. చప్పట్లతో సూర్యకుమార్​ను అభినందించారు. వేదిక మీదకు వచ్చిన సూర్య.. నీతాను హగ్ చేసుకున్నాడు. హార్దిక్ పాండ్యాను కూడా అప్రిషియేట్ చేశారామె. కఠిన పరిస్థితులు మనుషుల్ని మరింత బలంగా మారుస్తాయని ఆమె తెలిపారు. రోహిత్​తో పాటు హార్దిక్, సూర్యను కౌగిలించుకున్న సమయంలో ఆమె ఎంతో భావోద్వేగంతో కనిపించారు. ఆ తర్వాత ముకేష్ అంబానీ కూడా ప్రసంగించారు. భారత్​కు వరల్డ్ కప్ తీసుకొచ్చినందుకు ఆటగాళ్లకు థ్యాంక్స్ చెప్పారు అంబానీ. వాళ్ల విషయంలో ఎంతో గర్వపడుతున్నానని పేర్కొన్నారు. అయితే నీతా అంబానీ రోహిత్, హార్దిక్ కంటే సూర్యకుమార్​ను ఎక్కువగా పొగడటం, అధికంగా ఇంపార్టెన్స్ ఇవ్వడం వీడియోలో చూడొచ్చు.