iDreamPost

ప్రపంచ క్రికెట్ లో ఇలాంటి మ్యాచ్ చూసుండరు! ఒక బాల్, ఒక రన్, ఒక్క వికెట్.. చివరికి?

తాజాగా జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్ లో విజయానికి ఒక రన్ కావాలి, చేతిలో ఒక్క వికెట్, ఒక్క బంతి మాత్రమే మిగిలి ఉంది. ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? నరాలుతెగే ఈ ఉత్కంఠ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

తాజాగా జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్ లో విజయానికి ఒక రన్ కావాలి, చేతిలో ఒక్క వికెట్, ఒక్క బంతి మాత్రమే మిగిలి ఉంది. ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? నరాలుతెగే ఈ ఉత్కంఠ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

ప్రపంచ క్రికెట్ లో ఇలాంటి మ్యాచ్ చూసుండరు! ఒక బాల్, ఒక రన్, ఒక్క వికెట్.. చివరికి?

ప్రపంచ క్రికెట్ లో ఎన్నో ఉత్కంఠమైన మ్యాచ్ లు మీరు చూసుంటారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే మ్యాచ్ బహుశా మీరు ఇంతవరకు చూసుండరు. మ్యాచ్ లో అది చివరి బాల్, పైగా చివరి వికెట్ కూడా.. ఇక విజయానికి కావాల్సింది ఒకే ఒక్క పరుగు. ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? నరాలుతెగే ఈ ఉత్కంఠ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

కౌంటీ ఛాంపియన్ షిప్ డివిజన్ 2లో భాగంగా గ్లామోర్గన్ వర్సెస్ గ్లోసెస్టర్ షైర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కౌంటీ చరిత్రలోనే కాక.. ప్రపంచ క్రికెట్ లో కూడా చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఈ కౌంటీ మ్యాచ్ లో గ్లామోర్గన్ టీమ్ గెలుపునకు చివరి బంతికి ఒకే ఒక్క పరుగు అవసరం అయ్యింది. చేతిలో ఒకే ఒక్క వికెట్ ఉంది. ఇలాంటి సమయంలో వికెట్ కీపర్ ఓ అద్భుతమే చేశాడు. ఇంతకీ ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచారు?

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లోసెస్టర్ షైర్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 179, రెండో ఇన్నింగ్స్ లో 610 పరుగుల భారీ స్కోర్ చేసింది. గ్లామోర్గన్ టీమ్ తొలి ఇన్నింగ్స్ లో 197 రన్స్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో 593 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గ్లామోర్గన్ టీమ్.. విజయం కోసం చివరి వరకూ పోరాడింది. కానీ చివరి బంతికి బోల్తా పడి.. మ్యాచ్ ను టైగా చేసుకుంది. లాస్ట్ బాల్ వరకు విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. గ్లామోర్గన్ విజయానికి చివరి బంతికి ఒక పరుగు కావాలి. చేతిలో ఒక వికెట్ మాత్రమే ఉంది. ఈ బంతి భారీ షాట్ కొట్టబోయాడు జేమీ మెకిల్ రాయ్. కానీ బంతి ఎడ్జ్ తీసుకుని కీపర్ చేతుల్లోకి వెళ్లింది. కీపర్ జేమ్స్  బ్రేసీ పట్టిన అద్భుతమైన క్యాచ్ తో మ్యాచ్ టైగా ముగిసింది. గ్లామోర్గన్ టీమ్ ఈ టార్గెన్ ను ఛేదించి ఉంటే.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో ఇదే అత్యుత్తమైన ఛేదనగా రికార్డుల్లోకి ఎక్కేది. కానీ అలా జరగలేదు. జట్టులో మార్నస్ లబూషేన్(119), సామ్ నార్త్ ఈస్ట్(187) పరుగులతో అద్భుతమైన పోరాటపటిమను ప్రదర్శించారు. మరి ఈ ఉత్కంఠ మ్యాచ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి