iDreamPost
android-app
ios-app

వరల్డ్ కప్ తో ఫ్లైట్ లో టీమిండియా ఆటగాళ్ల రచ్చ రచ్చ! చూసి తీరాల్సిందే..

  • Published Jul 04, 2024 | 11:30 AM Updated Updated Jul 04, 2024 | 11:30 AM

టీమిండియా టీ20 వరల్డ్ కప్ తో సగర్వంగా భారతదేశానికి చేరుకుంది. అయితే విమానంలో వచ్చేటప్పుడు భారత ఆటగాళ్లు వరల్డ్ కప్ ట్రోఫీతో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

టీమిండియా టీ20 వరల్డ్ కప్ తో సగర్వంగా భారతదేశానికి చేరుకుంది. అయితే విమానంలో వచ్చేటప్పుడు భారత ఆటగాళ్లు వరల్డ్ కప్ ట్రోఫీతో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

వరల్డ్ కప్ తో ఫ్లైట్ లో టీమిండియా ఆటగాళ్ల రచ్చ రచ్చ! చూసి తీరాల్సిందే..

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న చిరకాల స్వప్నం నెరవేరిన వేళ.. ఆ సంతోషాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఆ స్వప్నం కోసం పడ్డ కష్టాలన్నీ ఒక్క విజయంతో మర్చిపోతారు. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు ఇదే అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇప్పటి వరకు మళ్లీ టీమిండియా ప్రపంచ కప్ ను గెలుచుకోలేకపోయింది. 13 ఏళ్లుగా మెగా టైటిల్ కోసం నిరీక్షిస్తూనే ఉంది. తాజాగా ఆ ఎదురుచూపులకు తెరదించుతూ.. టీ20 వరల్డ్ కప్ 2024ను సగర్వంగా ముద్దాడింది భారత జట్టు. మరి ఇంతటి ఆనందాన్ని ఎవరైనా ఓ రేంజ్ లో సెలబ్రేషన్ చేసుకుంటారు. టీమిండియా ప్లేయర్లు కూడా అదే చేశారు. వరల్డ్ కప్ ట్రోఫీతో ఫ్లైట్ లో భారత ప్లేయర్లు చేసిన రచ్చ అంతా.. ఇంతా కాదు. ఆ వీడియోను మీరూ చూసేయండి.

టీమిండియా టీ20 వరల్డ్ కప్ తో సగర్వంగా భారతదేశానికి చేరుకుంది. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో అడుగుపెట్టిన భారత ఆటగాళ్లకు ఘన స్వాగతం పలికారు అధికారులు, అభిమానులు. కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ కప్ ట్రోఫీని అభిమానులకు పైకెత్తి చూపిస్తూ.. అభివాదం చేశాడు. అక్కడి నుంచి ప్రేక్షకుల నీరాజనాల మధ్య హోటల్ రూమ్ కు చేరుకున్నారు. ఇక హోటల్ దగ్గర సూర్యకుమార్ యాదవ్ చేసిన మాస్ డ్యాన్స్ నెట్టింట వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా.. బెరిల్ హరికేన్ ప్రభావం తగ్గిన తర్వాత స్పెషల్ ఫ్లైట్ లో టీమిండియా ఇండియాకు బయలుదేరింది.

కాగా.. ప్రత్యేక విమానంలో భారత్ కు బయలుదేరిన టీమిండియా ఆటగాళ్లు.. వరల్డ్ కప్ ట్రోఫీతో విమానంలో రచ్చ రచ్చ చేశారు. 13 ఏళ్ల తర్వాత ప్రపంచ కప్ ను ముద్దాడటంతో.. తమ స్వప్నం నెరవేరడంతో.. ఎమోషనల్ అయ్యారు. విమానంలో వరల్డ్ కప్ ట్రోఫీతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. రోహిత్ శర్మ గట్టిగా అరుస్తూ.. నవ్వుతూ.. ఫోజులు ఇచ్చాడు. కోహ్లీ ఎమోషనల్ గా కప్ ను అందుకుని కిస్ చేశాడు. మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేం అంటూ చెప్పుకొచ్చారు. అర్షదీప్ సింగ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రపంచ కప్ తో ఫొటోలు తీసుకున్నాడు. బుమ్రా తన కొడుకుకు వరల్డ్ కప్ ను చూపిస్తూ.. ముచ్చటించాడు. మిగతా ప్లేయర్లు కూడా ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. విమానంలో ప్రపంచ కప్ తో ప్లేయర్లు చేసిన రచ్చకు సంబంధించిన వీడియో ను బీసీసీఐ ట్విట్టర్ లో పంచుకుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోను మీరూ చూసేయండి.

jojobet girişmarsbahisJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetmarsbahis giriştaraftarium24madridbet güncel girişmadridbet güncel girişmadridbetJojobet Giriş