Nidhan
Team India: టీమిండియా నయా కోచ్‌గా గౌతం గంభీర్ పేరును ప్రకటించడం దాదాపు ఖాయంగా మారింది. ఇంకొన్ని రోజుల్లో దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని తెలిసింది. ఈ తరుణంలో భారత క్రికెట్‌కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ గాసిప్ వైరల్ అవుతోంది.
Team India: టీమిండియా నయా కోచ్‌గా గౌతం గంభీర్ పేరును ప్రకటించడం దాదాపు ఖాయంగా మారింది. ఇంకొన్ని రోజుల్లో దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని తెలిసింది. ఈ తరుణంలో భారత క్రికెట్‌కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ గాసిప్ వైరల్ అవుతోంది.
Nidhan
టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. టీ20 వరల్డ్ కప్ ఫైనలే కోచ్‌గా ఆయనకు ఆఖరి మ్యాచ్. దీంతో కొత్త కోచ్‌ను త్వరలో నియమించనుంది భారత క్రికెట్ బోర్డు. ఇప్పటికే ఈ పోస్ట్ కోసం ఇంటర్వూలు కూడా నిర్వహించింది బోర్డు. లెజెండరీ ప్లేయర్ గౌతం గంభీర్‌ను త్వరలోనే కోచ్‌గా నియమిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రాసెస్ మొత్తం పూర్తయిందని తెలుస్తోంది. ఈ నెలాఖరులో శ్రీలంక టూర్‌కు వెళ్లనుంది టీమిండియా. లంకతో మూడు టీ20లు ఆడనుంది. ఆలోపు కొత్త కోచ్‌కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని సమాచారం. లంక సిరీస్ కోచ్‌గా గౌతీకి మొదటిది కానుందని అంటున్నారు. ఈ తరుణంలో భారత క్రికెట్‌కు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తోంది.
టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లోకి ఓ ఐపీఎల్ లెజెండ్ రానున్నాడని టాక్ నడుస్తోంది. గంభీర్‌కు చేయూతగా ఉంటూ అతడు జట్టు కోచింగ్ బృందంలో కీలకంగా వ్యవహరిస్తాడని అంటున్నారు. ఆ దిగ్గజం మరెవరో కాదు.. అభిషేక్ నాయర్ అని వినికిడి. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న నాయర్‌కు మెంటార్‌గా వ్యవహరించిన గంభీర్‌తో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అభిషేక్ పనితీరు, క్రమశిక్షణ, పనిపై నిబద్ధత గౌతీని ఆకట్టుకున్నాయట. అందుకే అతడ్ని టీమిండియా కోచింగ్ సపోర్ట్ స్టాఫ్‌లో భాగం చేయాలని భావిస్తున్నాడట. ఈ దిశగా ఇప్పటికే బీసీసీఐతో చర్చలు కూడా జరిపాడని.. నాయర్ నియామకానికి బోర్డు పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని క్రికెట్ వర్గాల సమాచారం.
బ్యాటర్‌గా కాదు గానీ కేకేఆర్ అసిస్టెంట్ కోచ్‌గా సక్సెస్ అయ్యాడు అభిషేక్ నాయర్. డొమెస్టిక్ బ్యాటర్స్‌ను వెతికి పట్టుకొని టీమ్‌లోకి తీసుకొచ్చాడు. వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి జట్టుకు అడిషనల్ వెపన్స్‌గా తయారు చేశాడు. రింకూ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ లాంటి వాళ్లు అతడి శిష్యులే. ఇలా ఆటగాడిగా కంటే.. కోచ్‌గా అతడు ఐపీఎల్లో లెజెండ్ అయిపోయాడు. ఐపీఎల్ లేని టైమ్‌లో ఇతర డొమెస్టిక్ క్రికెటర్స్‌కు బ్యాటింగ్‌లో మెళకువలు నేర్పిస్తూ, వాళ్ల టెక్నిక్‌ను సరిదిద్దుతూ బిజీగా ఉంటున్నాడు నాయర్. అలాంటోడు జట్టులోకి వస్తే బ్యాటింగ్‌తో పాటు ఆటగాళ్ల ఫిట్నెస్ను కూడా చూసుకుంటాడనే ఉద్దేశంతోనే టీమిండియాలోకి తీసుకొచ్చేందుకు గంభీర్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కోచింగ్ స్టాఫ్‌ను ఎంచుకునే స్వేచ్ఛను బోర్డు ఇవ్వడంతో నాయర్‌తో పాటు తనతో కలసి పని చేసిన ఇతరులను కూడా భారత జట్టులోకి తీసుకురావాలని గంభీర్ అనుకుంటున్నాడట. మరి.. టీమిండియాలోకి అభిషేక్ నాయర్ ఎంట్రీపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
🚨Gautam Gambhir wants Abhishek Nayar to join his Coaching support staff for the Team India coaching setup.🚨 pic.twitter.com/8IJMn6ZG9w
— Sujeet Suman (@sujeetsuman1991) July 9, 2024