iDreamPost
android-app
ios-app

Suryakumar Yadav: వరల్డ్ కప్ ఫైనల్ క్యాచ్ కాదు.. నా లైఫ్​లో ఇంపార్టెంట్ క్యాచ్ అదే: సూర్యకుమార్

  • Published Jul 09, 2024 | 3:06 PM Updated Updated Jul 09, 2024 | 3:06 PM

పొట్టి ప్రపంచ కప్ ఫైనల్​లో ఒక్క క్యాచ్​తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్. డేవిడ్ మిల్లర్ కొట్టిన బంతిని అద్భుతంగా ఒడిసిపట్టుకున్నాడు స్కై.

పొట్టి ప్రపంచ కప్ ఫైనల్​లో ఒక్క క్యాచ్​తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్. డేవిడ్ మిల్లర్ కొట్టిన బంతిని అద్భుతంగా ఒడిసిపట్టుకున్నాడు స్కై.

  • Published Jul 09, 2024 | 3:06 PMUpdated Jul 09, 2024 | 3:06 PM
Suryakumar Yadav: వరల్డ్ కప్ ఫైనల్ క్యాచ్ కాదు.. నా లైఫ్​లో ఇంపార్టెంట్ క్యాచ్ అదే: సూర్యకుమార్

పొట్టి ప్రపంచ కప్ ఫైనల్​లో ఒక్క క్యాచ్​తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్. సౌతాఫ్రికా పించ్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ కొట్టిన బంతిని అద్భుతంగా ఒడిసిపట్టుకున్నాడు స్కై. సిక్స్ వెళ్తున్న బాల్​ను గాల్లోకి ఎగిరి అందుకున్నాడు సూర్య. అయితే బాడీ బ్యాలెన్స్ తప్పడంతో బౌండరీ లైన్​ దాటాల్సి వచ్చింది. అయితే తెలివిగా ముందే బాల్​ను ముందే గాల్లోకి విసిరాడు. ఆ తర్వాత మళ్లీ లోపలకు వచ్చి దాన్ని అందుకున్నాడు. మ్యాచ్​కు టర్నింగ్ పాయింట్​గా నిలిచిన ఈ క్యాచ్​పై ఎన్నో వివాదాలు నడిచాయి. సూర్య క్యాచ్ సరికాదని, బౌండరీ రోప్​ను అతడు టచ్ అయ్యాడని కొందరు విమర్శిస్తే.. ఫోర్ లైన్​ను కావాలని జరిపారని, ఇది మోసమని మరికొందరు ఆరోపణలు గుప్పించారు.

అంపైర్లు మ్యాచ్ టైమ్​లో సూర్య క్యాచ్​ను నిశితంగా పరిశీలించాల్సిందని, ఎక్కువ సమయం తీసుకోకుండా వెంటనే నిర్ణయాన్ని వెల్లడించడం కరెక్ట్ కాదని ఇంకొందరు కామెంట్స్ చేశారు. అయితే ఆ క్యాచ్​ కరెక్టే అని చెప్పడానికి ఆ తర్వాత మరిన్ని వీడియోలు బయటకు వచ్చాయి. మాజీ క్రికెటర్స్, ఎక్స్​పర్ట్స్ అది క్లీన్ క్యాచ్ అని చెప్పడం, వీడియోల్లోనూ అదే తేలడంతో ఆ కాంట్రవర్సీ అక్కడితో సద్దుమణిగింది. ఇక, ఒక్క క్యాచ్​తో టీమిండియాకు హీరోగా మారిన సూర్యకుమార్​ను అందరూ మెచ్చుకుంటున్నారు. అతడు పట్టింది క్యాచ్ కాదు.. వరల్డ్ కప్ ట్రోఫీ అంటూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. భారత క్రికెట్ చరిత్రలో ఈ క్యాచ్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని అంటున్నారు. ఈ తరుణంలో ఫైనల్ క్యాచ్​పై సూర్య రియాక్ట్ అయ్యాడు. దీన్ని మించిన క్యాచ్ ఒకటి ఉందన్నాడు.

మిల్లర్ ఇచ్చిన క్యాచ్ తన లైఫ్​లో మరీ ముఖ్యమైనది కాదని సూర్య అన్నాడు. తన భార్య దేవిశా శెట్టిని మ్యారేజ్ చేసుకోవడం జీవితంలో ఎంతో కీలకమైన క్యాచ్ అని అతడు రివీల్ చేశాడు. వరల్డ్ కప్ ఫైనల్​లో మిల్లర్ ఇచ్చిన క్యాచ్ అందుకొని ఎనిమిది రోజులు అవుతోందని.. కానీ తన జీవితంలో ఎంతో ముఖ్యమైన క్యాచ్ పట్టి 8 సంవత్సరాలు అవుతోందంటూ నెట్టింట ఓ పోస్ట్ పెట్టాడు స్కై. భార్య దేవిశాతో దిగిన పలు ఫొటోలను అందరితో పంచుకున్నాడు. సూర్య-దేవిశా పెళ్లై ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పెద్ద కేక్​ను కట్ చేసిన ఈ కపుల్.. ఆ ఫొటోలను ఫ్యాన్స్​తో షేర్ చేశారు. దీన్ని చూసిన నెటిజన్స్.. ఈ అందమైన జంటకు మ్యారేజ్ డే విషెస్ చెబుతున్నారు. ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నారు. సూర్య భారత్​కు మరిన్ని కప్పులు అందించాలని కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Surya Kumar Yadav (SKY) (@surya_14kumar)