SNP
Gautam Gambhir, KKR: ఐపీఎల్ 2024 సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే గౌతమ్ గంభీర్ తన టీమ్ ప్లేయర్లకు ఒక వార్నింగ్ ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
Gautam Gambhir, KKR: ఐపీఎల్ 2024 సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే గౌతమ్ గంభీర్ తన టీమ్ ప్లేయర్లకు ఒక వార్నింగ్ ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ టోటల్‌గా క్రికెట్ మూడ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తున్నాడు. ఇటీవల రాజకీయాలకు దూరం అవుతున్నట్లు ప్రకటించిన గౌతీ.. ఇక తన ఫోకస్ మొత్తం ఐపీఎల్ 2024 సీజన్‌పైనే ఉందని పరోక్షంగా చెప్పాడు. తనకు ఐపీఎల్ అంటే చాలా సీరియస్ క్రికెట్ అని, ఐపీఎల్ ఏదో బాలీవుడ్ గ్లామర్ కాదని, ఒక సీరియస్ టోర్నీ అని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే కోల్‌కత్తా నైట్ రైడర్స్ ఆటగాళ్లు.. ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాబోయే ఐపీఎల్ సీజన్‌లో గంభీర్.. కోల్‌కత్తా జట్టుకు మెంటర్‌గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే. గత రెండు సీజన్లుగా లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌కు మెంటర్‌గా వ్యవహరించిన గంభీర్.. కొన్ని నెలల క్రితం కేకేఆర్‌లోకి మారాడు.
గతంలో కోల్‌కత్తాకు గంభీర్ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. తన హయాంలో కేకేఆర్‌ను రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిపాడు గంభీర్. గంభీర్ రాకకంటే ముందు.. కేకేఆర్ ఓ ఫెల్యూయిర్ టీమ్ ముద్ర వేసుకుంది. కనీసం ప్లే ఆఫ్స్‌కు కూడా చేరేది కాదు. కానీ, గంభీర కెప్టెన్‌గా వచ్చాకా.. కేకేఆర్‌పై భావనే మార్చిపడేశాడు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటాపోటీగా కప్పులు కొడుతున్న టైమ్‌లో ఆ రెండు టీమ్స్‌కు గట్టి పోటీ ఇచ్చి.. ఏకంగా రెండు కప్పులు కొట్టాడు. 2012, 2014లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ ఛాంపియన్‌గా నిలిచింది. గంభీర్ వెళ్లిపోయాక మళ్లీ కేకేఆర్ డీలా పడింది. తాను ఉన్నంత కాలం గేమ్‌ను ఎంతో సీరియస్‌గా తీసుకున్న గంభీర్.. కేకేఆర్‌ను ఒక స్ట్రాంగ్ టీమ్‌గా మార్చాడు.
మళ్లీ ఇప్పుడు మెంటర్‌గా కేకేఆర్‌కు పూర్వవైభవం తేవాలనే కసితో గంభీర్ బరిలోకి దిగుతున్నాడు. ఐపీఎల్ 2024 ప్రారంభానికి మరి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో కేకేఆర్ టీమ్‌లోని ఆటగాళ్లకు తాను ఎలాంటి మైండ్ సెట్‌తో ఉంటానో, క్రికెట్‌ను ఎంత సీరియస్‌గా తీసుకుంటానో ఇప్పటి నుంచే స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. సీజన్ ప్రారంభం అయ్యాక కొన్ని గేమ్స్ పూర్తి అయ్యాయా.. టోర్నీలో సీరియస్‌నెస్ వస్తుంది. కానీ, గంభీర్ తొలి గేమ్ నుంచే ఆ సీరియస్ నెస్ చూపిస్తాడు. చాలా మంది యువ క్రికెటర్లు ఐపీఎల్‌ను ఓ ఫ్రాంచేజ్ గేమ్‌గానే సరదాగా తీసుకుంటూ ఉంటారు. తన మెంటర్‌షిప్‌లో అలా క్యాజువల్‌గా తీసుకుంటే కుదరదని వారికి ఓ వార్నింగ్‌ను పాస్ చేశాడు గంభీర్. మరి ఐపీఎల్ అంటే తనకు సీరియస్ క్రికెట్ అని గంభీర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Kolkata Knight Riders mentor Gautam Gambhir had a clear message for his team ahead of IPL 2024. pic.twitter.com/sIu7h8N4Dh
— CricTracker (@Cricketracker) March 4, 2024