iDreamPost

సూర్యకుమార్ విషయంలో ఘోర తప్పిదం చేశా.. ఇప్పటికీ పశ్చాత్తాప పడుతున్నా: గంభీర్

టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ విషయంలో నేను పెద్ద తప్పు చేశానని షాకింగ్ విషయాలు వెల్లడించాడు భారత మాజీ ప్లేయర్, కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్. మరి సూర్య విషయంలో గంభీర్ చేసిన మిస్టేక్ ఏంటి?

టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ విషయంలో నేను పెద్ద తప్పు చేశానని షాకింగ్ విషయాలు వెల్లడించాడు భారత మాజీ ప్లేయర్, కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్. మరి సూర్య విషయంలో గంభీర్ చేసిన మిస్టేక్ ఏంటి?

సూర్యకుమార్ విషయంలో ఘోర తప్పిదం చేశా.. ఇప్పటికీ పశ్చాత్తాప పడుతున్నా: గంభీర్

ప్రతి వ్యక్తి తమ జీవితంలో కొన్ని కొన్ని తప్పులు చేస్తుంటాడు. అయితే అందులో తెలిసి చేసినవి కొన్నుంటే, తెలియక చేసినవి మరికొన్నుంటాయి. అలాంటి ఓ పెద్ద తప్పు టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ విషయంలో నేను కూడా చేశానని ఈ ప్రపంచానికి తొలిసారి చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ ప్లేయర్, కేకేఆర్ ప్రస్తుత మెంటర్ గౌతమ్ గంభీర్. మరి సూర్యకుమార్ విషయంలో గంభీర్ చేసిన తప్పేంటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున సంచలన ప్రదర్శన  చేసి.. టీమిండియాలోకి దూసుకొచ్చాడు సూర్యకుమార్ యాదవ్. తన అద్భుతమైన ఆటతో టీ20ల్లో నెంబర్ వన్ గా నిలిచాడు. బ్యాటింగ్ కు దిగితే.. బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు ఈ మిస్టర్ టీమిండియా 360 ప్లేయర్.  అయితే సూర్యకుమార్ విషయంలో తానొక తప్పు చేశానని, అందుకు ఇప్పటికీ పశ్చత్తాప పడుతున్నానని టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు. అసలేం జరిగిందంటే?

సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ లో 2014 నుంచి 2017 వరకు కోల్ కత్తా నైట్ రైడర్స్ కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత 2018 నుంచి ముంబై ఇండియన్స్ కు ఆడుతున్నాడు. అయితే కేకేఆర్ కు సూర్య ఆడే క్రమంలో కెప్టెన్ గా ఉన్న గౌతమ్ గంభీర్ అతడి సత్తాను ఉపయోగించుకోలేకపోయానని తన ఏడేళ్ల కెప్టెన్సీలో వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఇది నేను చేసిన పెద్ద తప్పుగా భావిస్తున్నాని గంభీర్ పేర్కొన్నాడు. మరిన్ని విషయాలు వెల్లడిస్తూ..

“అత్యుత్తమ ఆటగాళ్లను వెతికి, వారి శక్తిని ప్రపంచానికి పరిచయం చేయడమే కెప్టెన్ బాధ్యత. కానీ నా ఏడేళ్ల కేకేఆర్ కెప్టెన్సీలో సూర్యకుమార్ విషయంలో నేను అతి పెద్ద తప్పు చేశాను. అతడి ఆటను నేను ఉపయోగించుకోలేకపోయాను. సూర్యను మూడో ప్లేస్ లో ఆడించకుండా ఘోరమైన తప్పిదం చేశాను. అందుకు ఇప్పటికీ బాధపడుతున్నాను. అయితే జట్టు కూర్పులో భాగంగా ఆ ప్లేస్ లో ఒక్కడినే ఆడించాల్సి ఉంటుంది. కెప్టెన్ గా టీమ్ లో ఉన్న మిగతా 10 మంది గురించి కూడా ఆలోచించాలి. సూర్యను అప్పుడు మూడో స్థానంలో ఆడిస్తే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తోంది” అంటూ చెప్పుకొచ్చాడు గౌతమ్ గంభీర్. కాగా.. సూర్యకుమార్ మూడో స్థానంలోనే కాదు.. ఏడో నంబర్ బ్యాటర్ గా కూడా రాణించే సత్తా కలవాడని కితాబిచ్చాడు గంభీర్. మరి సూర్య విషయంలో తప్పుచేశానన్న గంభీర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి