iDreamPost
android-app
ios-app

పాలిటిక్స్‌ నుంచి తప్పుకున్న గంభీర్‌! ప్రధాని మోదీకి అభ్యర్థన

  • Published Mar 02, 2024 | 10:45 AM Updated Updated Mar 02, 2024 | 10:45 AM

Gautam Gambhir BJP: రాజకీయాలకు దూరంగా ఉండేందుకు భారత మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని నేరుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోదీకి తెలియజేశాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Gautam Gambhir BJP: రాజకీయాలకు దూరంగా ఉండేందుకు భారత మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని నేరుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోదీకి తెలియజేశాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 02, 2024 | 10:45 AMUpdated Mar 02, 2024 | 10:45 AM
పాలిటిక్స్‌ నుంచి తప్పుకున్న గంభీర్‌! ప్రధాని మోదీకి అభ్యర్థన

టీమిండియా మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. ఈ సందర్భంగా గంభీర్‌ ఒక ట్వీట్‌ చేస్తూ.. రాజకీయ బాధ్యతల నుంచి తనను విడుదల చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశాడు. తన క్రికెట్‌ కమిట్‌మెంట్స్‌ కారణంగా తనను రాజకీయ వ్యవహారాల నుంచి రిలీవ్‌ చేయాలని కోరాడు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని కూడా ట్యాగ్‌ చేస్తూ.. తనకు ఇంత కాలం ప్రజా సేవ చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపాడు. అయితే.. ఇంత సడెన్‌గా గంభీర్‌ రాజకీయాలకు దూరం కావడం చర్చనీయాంశంగా మారింది. 2019 నుంచి రాజకీయాల్లో ఉన్న గంభీర్‌ ఐపీఎల్‌లో మెంటర్‌గా కొనసాగుతూనే ఉన్నాడు. కానీ, ఇప్పుడు మాత్రం క్రికెట్‌ కమిట్మెంట్స్‌ అంటూ రాజకీయాల నుంచి తప్పుకున్నాడు. ఇది బీజేపీకి దూరం అవ్వడానికే అనే టాక్‌ వినిపిస్తోంది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈస్ట్‌ ఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందిన గంభీర్‌.. కొంతకాలం పాటు పార్టీలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉన్నాడు. కానీ, ఏమైందో ఏమో కానీ కొన్ని నెలలుగా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ.. ఆ పార్టీతో కాస్త గ్యాప్‌ మెయిన్‌టెన్‌ చేస్తున్నాడు. పైగా లక్నో ఫ్రాంచైజ్‌ను వీడి కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ టీమ్‌కు మెంటర్‌గా మారాడు. రానున్న లోక్‌సభ్‌ ఎన్నికల్లో గంభీర్‌కు టిక్కెట్‌ ఇవ్వకూడదని బీజేపీ అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలోనే తాను ముందుగా తప్పుకోవాలని గంభీర్‌ భావించి, ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. గంభీర్‌ బీజేపీకి దూరం అవ్వడానికి కారణం మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదు. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటాడా లేదా బీజేపీకి రాజీనామా చేసి.. మరో పార్టీలో చేరుతాడా? అనేది ఐపీఎల్‌ తర్వాత తెలిసే అవకాశం ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.