iDreamPost

లంకతో మ్యాచ్ కు ముందు గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ముందెన్నడు ఇలా చేయలేదు!

  • Author Soma Sekhar Published - 06:46 PM, Thu - 2 November 23

శ్రీలంకతో మ్యాచ్ కు ముందు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ బ్యాటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్. అయితే గతంలో గంభీర్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వినలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

శ్రీలంకతో మ్యాచ్ కు ముందు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ బ్యాటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్. అయితే గతంలో గంభీర్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వినలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

  • Author Soma Sekhar Published - 06:46 PM, Thu - 2 November 23
లంకతో మ్యాచ్ కు ముందు గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ముందెన్నడు ఇలా చేయలేదు!

వరల్డ్ కప్ లో మరో విజయం కోసం టీమిండియా సిద్దమవుతోంది. ముంబై వేదికగా ఇండియా-శ్రీలంక జట్ల మధ్య గురువారం(నవంబర్ 2) మ్యాచ్ జరగనుంది. ఇక సూపర్ ఫామ్ లో ఉన్న టీమిండియాను ఏ మేరకు ఎదుర్కొంటుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ కు ముందు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ బ్యాటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్. అయితే గతంలో గంభీర్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వినలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. మరి శ్రీలంకతో మ్యాచ్ కు గంభీర్ చేసిన వ్యాఖ్యలు ఏంటి? శ్రేయస్ అయ్యర్ తో కెప్టెన్ రోహిత్ శర్మ ఏం మాట్లాడాడు అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గౌతమ్ గంభీర్.. విరాట్ కోహ్లీ, ధోనిలపై సంచలన కామెంట్స్ చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఎప్పుడూ ఏదో ఒక రకంగా నిత్యం వార్తల్లో ఉంటాడు గంభీర్. తాజాగా శ్రీలంకకు ముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి మాత్రం ముందెన్నడూ లేని విధంగా విమర్శలు కాకుండా సానుకూల అంశాల గురించి మాట్లాడాడు. ఓ స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడుతూ..”టీమిండియాకు చెందిన ‘బిహైండ్ ద సీన్స్’ అందరూ ఇష్టపడుతున్నారు. అదీకాక భారత ఫీల్డర్లకు ఉత్తమ పతకాలు ఇవ్వడం ఈ సమయంలో చిన్న ప్రసంగాలు, సంబరాలు ఉండటంతో జట్టు సభ్యులందరిలో మరింత ఐక్యత పెరుగుతుంది. ఇది జట్టుకు ఎంతో అవసరం. ఇక కెప్టెన్ రోహిత్ కోచ్ ద్రవిడ్ ఆటగాళ్లకు కావాల్సినన్ని ఛాన్స్ లు ఇస్తున్నారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే? షమీ టోర్నీ ఆరంభంలో ఆడించకపోవడం జట్టు వ్యూహంలో భాగంగానే కనిపిస్తోంది” అంటూ చెప్పుకొచ్చాడు గంభీర్.

వీటితో పాటుగా షార్ట్ బాల్ ను ఎదుర్కొవడంలో ఇబ్బంది పడుతున్న టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తో ఈ విషయం రోహిత్, ద్రవిడ్ లు మాట్లాడే ఉంటారని గంభీర్ తెలిపాడు. ఇక షార్ట్ బాల్ సమస్యలో పొరపాటు ఎక్కడ జరుగుతుందో.. ఏం చేస్తే దాని నుంచి బయటపడొచ్చో అయ్యర్ కు రోహిత్ సూచించే ఉంటడని నేను భావిస్తున్నానని గంభీర్ పేర్కొన్నాడు. వాఖండే లాంటి ఫ్లాట్ పిచ్ పై పరుగుల వరద పారుతుందని కామెంట్ చేశాడు. ఈ మ్యాచ్ లో బ్యాటర్ల కంటే బౌలర్లే మరోసారి సత్తా చాటాలని తాను కోరుకుంటున్నట్లు గంభీర్ వెల్లడించాడు. ఇక ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. గంభీర్ నుంచి ఇలాంటి కామెంట్స్ మేం ఇప్పటి వరకు వినలేదని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి గంభీర్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి