Nidhan
టీమిండియా టీ20 నయా కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికైన సంగతి తెలిసిందే. పొట్టి ప్రపంచ కప్-2026 వరకు అతడే జట్టుకు సారథిగా ఉండనున్నాడు.
టీమిండియా టీ20 నయా కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికైన సంగతి తెలిసిందే. పొట్టి ప్రపంచ కప్-2026 వరకు అతడే జట్టుకు సారథిగా ఉండనున్నాడు.
Nidhan
టీమిండియా టీ20 నయా కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికైన సంగతి తెలిసిందే. పొట్టి ప్రపంచ కప్-2026 వరకు అతడే జట్టుకు సారథిగా ఉండనున్నాడు. కెప్టెన్సీ పోస్ట్ కోసం స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో అతడు పోటీపడ్డాడు. టీ20 ప్రపంచ కప్-2024లో హార్దికే టీమ్‌కు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. దీంతో అతడ్నే సారథిని చేస్తారని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా సూర్యకుమార్ పేరు తెరమీదకు వచ్చింది. టీ20ల్లో నంబర్ వన్ బ్యాటర్‌గా చాన్నాళ్లు హవా నడిపించడం, కొన్ని సిరీస్‌ల్లో సారథిగా జట్టును గెలిపించడం, ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే అతడి వ్యక్తిత్వానికి ఫిదా అయిన సెలెక్టర్లు కెప్టెన్ చేశారు. నిత్యం గాయాలతో సావాసం చేయడం పాండ్యాకు మైనస్‌గా మారింది.
ఏదో ఒకట్రెండు సిరీస్‌లకు సూర్యను కెప్టెన్ చేయలేదు. దీర్ఘకాలిక వ్యూహంతోనే అతడికి సారథ్య బాధ్యతలు అప్పగించారు. 2026లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ వరకు అతడే కెప్టెన్‌గా కంటిన్యూ అవనున్నాడు. దీంతో మరో రెండేళ్లు పొట్టి ఫార్మాట్లో సూర్య పెత్తనం నడవనుంది. అయితే అంతా బాగానే ఉన్నా ఒక విషయంలో మిస్టర్ 360కి అన్యాయం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అతడ్ని వన్డేల నుంచి తప్పించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తనను టీ20 జట్టుకు కెప్టెన్‌ను చేసిన కొత్త కోచ్ గంభీర్.. వన్డేల్లో మాత్రం టీమ్‌కు దూరం చేయడంతో సూర్య నిరాశకు లోనయ్యాడని తెలుస్తోంది.
సూర్య వయసు ఇప్పుడు 33 ఏళ్లు. సరిగ్గా ప్లాన్ చేస్తే ఇంకో 5 ఏళ్లు కనీసం రెండు ఫార్మాట్లలో ఆడొచ్చు. టెస్టుల సంగతి పక్కనబెడితే.. వన్డేల్లో కంటిన్యూ చేయాల్సిన ప్లేయరే. పలు ఛాన్సులు ఇచ్చినా వన్డేల్లో సూర్య అంతగా ప్రూవ్ చేసుకోని మాట వాస్తవమే. కానీ వన్డే వరల్డ్ కప్-2027లో ఆడాలంటే ఇలాంటి ఎక్స్‌పీరియెన్స్ ప్లేయర్ టీమ్‌లో ఉండటం ముఖ్యం. కానీ అతడికి గౌతీ హ్యాండ్ ఇచ్చాడు. టీ20 కెప్టెన్సీ ఆశ చూపి వన్డేల నుంచి తప్పించాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కెప్టెన్ చేసినా కెరీర్లో ముందుకెళ్లకుండా ఆపేశాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ రాకతో జట్టు పటిష్టంగా మారిందని.. అందుకే సూర్యను వన్డేల్లో నుంచి తీసేశారనే కామెంట్స్ వస్తున్నాయి. అతడికి ఇంకో అవకాశం ఇస్తే బాగుండేదని.. సూర్య వన్డే కెరీర్ విషయంలో సెలెక్టర్లు కూడా మరింత లోతుగా ఆలోచిస్తే బాగుండేదని చెబుతున్నారు. మరి.. సూర్యకుమార్‌ను వన్డేల్లో నుంచి తప్పించడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.