SNP
Sachin Tendulkar, Virat Kohli: సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన ఒక గొప్ప రికార్డును విరాట్ కోహ్లీ బ్రేక్ చేయలేడని, అది బ్రేక్ చేసే క్రికెటర్ ఇతనే అంటూ ఓ మాజీ క్రికెటర్ మరో స్టార్ క్రికెటర్ పేరు చెప్పాడు. మరి క్రికెటర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
Sachin Tendulkar, Virat Kohli: సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన ఒక గొప్ప రికార్డును విరాట్ కోహ్లీ బ్రేక్ చేయలేడని, అది బ్రేక్ చేసే క్రికెటర్ ఇతనే అంటూ ఓ మాజీ క్రికెటర్ మరో స్టార్ క్రికెటర్ పేరు చెప్పాడు. మరి క్రికెటర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
SNP
ప్రపంచ క్రికెట్‌లో ది గ్రేట్ సచిన్ టెండూల్కర్ పేరిట చాలా రికార్డులు ఉన్నాయి. అంతకు ముందు కనీసం కలలో కూడా ఊహించని ఎన్నో రికార్డులను నెలకొల్పాడు క్రికెట్ గాడ్ సచిన్. ఆయన అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయి దశాబ్దకాలం గడుస్తున్నా.. ఇంకా ఆయన రికార్డుల వెంట పడుతూనే ఉంది క్రికెట్ ప్రపంచం. సచిన్ తర్వాత.. అంతర్జాతీయ క్రికెట్‌లో సూపర్ స్టార్లుగా పేరు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్ లాంటి వాళ్లు సచిన్ రికార్డులను బ్రేక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వన్డేల్లో సచిన్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును గతేడాది వన్డే వరల్డ్ కప్ 2023 సందర్భంగా కోహ్లీ బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. సచిన్ వన్డేల్లో 49 సెంచరీలు చేస్తే.. కోహ్లీ 50 సెంచరీలు సాధించాడు.
అయితే.. సచిన్ పేరిట ఉన్న మరో అరుదైన రికార్డును బ్రేక్ చేయడం కోహ్లీ వల్ల కాదని.. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ బ్రేక్ చేస్తాడంటూ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ అన్నాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసి క్రికెటర్‌గా సచిన్ పేరిట ఒక అరుదైన రికార్డు ఉంది. సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో 200 టెస్టులు ఆడి 53.78 యావరేజ్‌తో 15,921 పరుగులు చేశాడు. అందులో 51 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు జో రూట్ 142 టెస్టుల్లో 49.95 యావరేజ్‌తో 11,940 పరుగులు చేశాడు. అందులో 32 సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సచిన్ రికార్డును బ్రేక్ చేయడానికి జో రూట్ ఇంకా.. 3,981 పరుగుల దూరంలో ఉన్నాడు.
మరోవైపు విరాట్ కోహ్లీ టెస్టు స్టాట్స్ చూసుకుంటే.. 113 టెస్టుల్లో 49.15 యావరేజ్‌తో 8848 పరుగులు చేశాడు. అందులో 29 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సచిన్ రికార్డును బ్రేక్ చేయాలంటే.. కోహ్లీ టెస్టుల్లో ఇంకా 7,073 పరుగులు చేయాలి. మైఖేల్ వాన్ చెప్పినట్లు కోహ్లీ.. సచిన్‌ను అధిగమించడం కష్టంగానే కనిపిస్తోంది. అయితే.. జో రూట్ ఎంత కాలం టెస్టు క్రికెట్‌లో కొనసాగుతాడనే దానిపైనే అతను సచిన్ రికార్డును అధిగమించగలడా లేదా అనేది ఆధారపడి ఉంది. అయితే.. మైఖేల్ వాన్ చెప్పినట్లు కోహ్లీ.. టెస్ట్ రన్స్‌లో సచిన్‌ను అధిగమించకపోవచ్చు.. కానీ, అన్ని ఫార్మాట్స్‌లో కలిపి 100 సెంచరీల రికార్డును అయితే బ్రేక్ చేస్తాడని క్రికెట్ అభిమానులు బలంగా నమ్ముతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Michael Vaughan said, “Joe Root will become England’s leading run-scorer in the next few months and is so special that he really could overtake Sachin Tendulkar eventually.” pic.twitter.com/FC13o9Wx6k
— Cricket Chamber (@cricketchamber) July 22, 2024