IND vs ENG: టీమిండియా ప్లేయర్ల పేరిట ఓ చెత్త రికార్డు! టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి..

ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో నలుగురు టీమిండియా ఆటగాళ్లు ఓ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకున్నారు. కాగా.. ఇది టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి కావడం గమనార్హం.

ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో నలుగురు టీమిండియా ఆటగాళ్లు ఓ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకున్నారు. కాగా.. ఇది టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి కావడం గమనార్హం.

విశాఖ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా నయా సంచలనం యశస్వీ జైస్వాల్ రికార్డుల మీద రికార్డులు బద్దలుకొడుతున్నాడు. అయితే మరోవైపు నలుగురు టీమిండియా ఆటగాళ్లు ఓ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకున్నారు. కాగా.. ఇది టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి కావడం గమనార్హం. మరి ఆ పరమచెత్త రికార్డును ఏంటి? దాన్ని తమ పేరిట లిఖించుకున్న ఆ ఆటగాళ్లు ఎవరు? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

సాధారణంగా క్రికెట్ లో అద్భుతమైన రికార్డులతో పాటుగా చెత్త రికార్డులు కూడా ఉంటాయి. అయితే చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే టీమిండియా ఆటగాళ్లు చెత్త రికార్డుల పుటల్లోకి ఎక్కుతూ ఉంటారు. తాజాగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో ఏకంగా నలుగురు భారత ప్లేయర్లు పరమ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకున్నారు. వారెవరో కాదు.. యువ ఓపెనర్ శుబ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, రజత్ పాటీదార్. ఈ నలుగురు ప్లేయర్లు ఇందులో భాగమైయ్యారు. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే?

టీమిండియా బ్యాటింగ్ లైనప్ లో 3వ నంబర్ నుంచి 6వ నంబర్ వరకు ఉన్న బ్యాటర్లు కేవలం 25 నుంచి 35 పరుగుల మధ్యలోనే పరుగులు చేసి ఔట్ అయ్యారు. ఇలా 3వ నంబర్ నుంచి 6వ నంబర్ వరకు 25 నుంచి 35 రన్స్ మధ్యలోనే పెవిలియన్ కు చేరడం టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా కావడం గమనార్హం. టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే ఇలా ఎన్నడూ జరగలేదు. దీంతో ఈ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకున్నారు టీమిండియా బ్యాటర్లు. శుబ్ మన్ గిల్(34), శ్రేయస్ అయ్యర్(27), రజత్ పాటిదార్(32), అక్షర్ పటేల్(27) పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఈ విధంగా నంబర్ 3 నుంచి 6 వరకు ఉన్న ఏ బ్యాట్స్ మెన్ కూడా 35 పరుగుల కంటే ఎక్కువ చేయలేకపోయారు.

ఇక వీరందరూ విఫలం అయిన చోటే.. యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ దుమ్మురేపాడు. మారథాన్ ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు భారీ స్కోర్ ను అందించాడు. 257 బంతులు ఎదుర్కొని 17 ఫోర్లు, 5 సిక్సర్లతో 179 రన్స్ చేసి క్రీజ్ లో అజేయంగా నిలిచాడు జైస్వాల్. దీంతో తొలిరోజు ఆటముగిసే సమయానికి 6 వికెట్లు నష్టపోయి 336 పరుగులు చేసింది టీమిండియా. క్రీజ్ లో జైస్వాల్(179)తో పాటుగా రవిచంద్రన్ అశ్విన్(5) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. మరి ఈ రికార్డును క్రియేట్ చేసిన భారత ఆటగాళ్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Yashasvi Jaiswal: భారీ సెంచరీ తర్వాత జైస్వాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. చివరి వరకు పోరాడతా అంటూ..!

Show comments