iDreamPost

Yashasvi Jaiswal: భారీ సెంచరీ తర్వాత జైస్వాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. చివరి వరకు పోరాడతా అంటూ..!

మారథాన్ ఇన్నింగ్స్ తో ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్. ఇక మ్యాచ్ అనంతరం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మారథాన్ ఇన్నింగ్స్ తో ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్. ఇక మ్యాచ్ అనంతరం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Yashasvi Jaiswal: భారీ సెంచరీ తర్వాత జైస్వాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. చివరి వరకు పోరాడతా అంటూ..!

ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో తొలిరోజు విధ్వంసకర శతకంతో చెలరేగిపోయాడు టీమిండియా నయా సంచలనం యశస్వీ జైస్వాల్. తనకంటే సీనియర్లు అంతా పరుగులు చేయలేక పెవిలియన్ కు క్యూ కడుతుంటే.. ఇంగ్లీష్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ, మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు ఈ యువ ఓపెనర్. సెహ్వాగ్ స్టైల్లో బ్యాటింగ్ చేసి.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఏకంగా 257 బంతులు ఎదుర్కొని 17 ఫోర్లు, 5 సిక్సర్లతో 179 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో పలు రికార్డులు కూడా బద్దలుకొట్టాడు జైస్వాల్. ఇక మ్యాచ్ అనంతరం పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

యశస్వీ జైస్వాల్.. ప్రస్తుతం టీమిండియాలో గట్టిగా వినిపిస్తున్న పేరు. గత కొంతకాలంగా అద్భుతంగా రాణిస్తూ టీమ్ లో కీలక ప్లేయర్ గా అవతరించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటూ విజయాలకు బాటలు వేస్తున్నాడు. తాజాగా విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో దుమ్మురేపాడు.257 బంతులు ఎదుర్కొని 17 ఫోర్లు, 5 సిక్సర్లతో 179 రన్స్ చేసి క్రీజ్ లో అజేయంగా నిలిచాడు. దీంతో భారత్ తొలిరోజు 6 వికెట్లు కోల్పోయి 336 పరుగుల భారీ స్కోర్ చేసింది.

ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన యశస్వీ జైస్వాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జైస్వాల్ మాట్లాడుతూ..”నేను నా టీమ్ కోసం ప్రతీ చివరి క్షణం వరకు పోరాడుతూనే ఉంటాను. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించడానికి లాస్ట్ వరకూ ప్రయత్నిస్తూనే ఉంటా. ఇందుకోసం రెట్టించిన ఉత్సాహంతో ముందుకుసాగుతా. ఇక తొలిరోజు ఆట నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. రెండోరోజు మరింత స్ట్రాంగ్ గా ఆడటానికి ప్రయత్నిస్తాను” అంటూ చెప్పుకొచ్చాడు జైస్వాల్.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు గొప్ప ఆరంభం లభించలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. 14రన్స్ మాత్రమే చేసి.. డెబ్యూ బౌలర్ చేతికి చిక్కాడు. మిగతా వారిలో గిల్(34), అయ్యర్(27), డెబ్యూ ప్లేయర్ రజత్ పాటిదార్(32), అక్షర్ పటేల్(27) భారీ స్కోర్లు సాధించడంలో విఫలం అయ్యారు. కానీ యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ఒక్కడే అద్భుతమైన పోరాటపటిమను కనబర్చాడు. అతడు తొలి రోజు 179 పరుగులతో అజేయంగా క్రీజ్ లో నిలబడ్డాడు. దీంతో టీమిండియా తొలిరోజు ఆటముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో అరంగేట్ర బౌలర్ షోయబ్ బషీర్ 2 వికెట్లు తీయగా.. రెహన్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టాడు.

ఇదికూడా చదవండి: క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదైన ఘటన! ఒకేరోజు ఏకంగా..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి