iDreamPost
android-app
ios-app

ఇలాగే ఉంటే.. ఇంగ్లాండ్ టీమ్ విమానం ఎక్కేయడమే! మాజీ క్రికెటర్ చురకలు

  • Published Feb 21, 2024 | 5:07 PM Updated Updated Feb 21, 2024 | 5:07 PM

IND vs ENG: వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయిన ఇంగ్లాండ్ టీమ్ పై సెటైర్లు వేశాడు భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్. ఇలా అయితే మీరు నెక్ట్స్ విమానం ఎక్కేయడమే బెటర్ అంటూ చురకలు అంటించాడు.

IND vs ENG: వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయిన ఇంగ్లాండ్ టీమ్ పై సెటైర్లు వేశాడు భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్. ఇలా అయితే మీరు నెక్ట్స్ విమానం ఎక్కేయడమే బెటర్ అంటూ చురకలు అంటించాడు.

ఇలాగే ఉంటే.. ఇంగ్లాండ్ టీమ్ విమానం ఎక్కేయడమే! మాజీ క్రికెటర్ చురకలు

ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ జట్టుకు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తొలి టెస్ట్ లో విజయం సాధించి.. బజ్ బాల్ గిజ్ బాల్ అంటూ ప్రగల్బాలు పలికిన ఇంగ్లీష్ టీమ్ కు తర్వాతి రెండు టెస్టుల్లో దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది భారత్ జట్టు. వరుసగా రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించి.. 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. కాగా. కీలకమైన నాలుగో టెస్ట్ లో గెలిస్తేనే.. ఇంగ్లాండ్ సిరీస్ లో నిలుస్తుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ప్రత్యర్థి జట్టుకు చురకలు అంటించాడు. ఇలాగే ఉంటామంటే.. విమానం ఎక్కేయడమే బెటర్ అంటూ సెటైర్లు వేశాడు.

ఇంగ్లాండ్ తో జరుగుతున్న 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా 2-1తో ముందంజలో ఉంది. ఫస్ట్ టెస్ట్ లో ఓడిపోయినప్పటికీ.. తర్వాతి రెండు మ్యాచ్ ల్లో పుంజుకుని, అద్భుత విజయాలు సాధించింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ అనుసరిస్తున్న బజ్ బాల్ స్ట్రాటజీపై సెటైర్లు వేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్. ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ ఇక పుంజుకోవడం కష్టమే అని, వారి దూకుడైన ఆట ఇండియాలో వర్కౌట్ కాలేదని కామెంట్స్ చేశాడు.

భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ..”టీమిండియా ఫస్ట్ మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ.. తర్వాతి మ్యాచ్ ల్లో పుంజుకున్నతీరు అద్భుతం. అయితే ఇంగ్లాండ్ ఇలా పుంజుకోవడం చాలా కష్టం. ఎందుకంటే వారు బజ్ బాల్ స్ట్రాటజీ అంటూ తమ గొయ్యిని తామే తొవ్వుకుంటున్నారు. వీలుంటే నెక్ట్స్ విమానం దొరికితే ఇంగ్లాండ్ టీమ్ ఇంటికి వెళ్లిపోవచ్చు(నవ్వుతూ). ఇక వారు మేం ఇలాగే బజ్ బాల్ సిద్ధాంతంతోనే కొనసాగుతాం, ఇలాగే ఆడతాం అంటే మాత్రం వారిని ఎవ్వరూ బాగుచేయలేరు.

“ఎందుకంటే? టెస్ట్ మ్యాచ్ లు 5 రోజులు జరిగే ఆట. అందులో పరిస్థితులకు తగ్గట్లుగా ఆడాల్సి ఉంటుంది. సమయాన్ని బట్టి ప్రణాళికలు కూడా మార్చుకోవాలి. లేదంటే ఓటమి తప్పదు. టెస్టుల్లో ప్రతీ బాల్ ను దంచికొట్టడమే లక్ష్యంగా పెట్టుకోకూడదు. మెక్ కల్లమ్, బెన్ స్టోక్స్ వంటివారు మాత్రమే అలా బ్యాటింగ్ చేయగలరు” అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు ఈ మాజీ క్రికెటర్. కాగా.. ఫిబ్రవరి 23(శుక్రవారం) నుంచి కీలకమైన నాలుగో టెస్ట్ రాంచీ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కు బుమ్రాకు విశ్రాంతి ఇచ్చింది మేనేజ్ మెంట్. దీంతో కొత్త బౌలర్ ఆకాశ్ దీప్ ఈ మ్యాచ్ తో డెబ్యూ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కృష్ణమాచారి శ్రీకాంత్ ఇంగ్లాండ్ టీమ్ పై వేసిన సెటైర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: కొనసాగుతున్న రస్సెల్ ఊచకోత.. ఈ సారి 12 బంతుల్లోనే..