iDreamPost

కొనసాగుతున్న రస్సెల్ ఊచకోత.. ఈ సారి 12 బంతుల్లోనే..

వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రస్సెల్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024లో రెచ్చిపోతున్నాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. సిక్సుల వర్షం కురిపిస్తున్నాడు. తాజాగా జరిగిన మ్యాచ్ లో కేవలం 12 బంతుల్లోనే..

వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రస్సెల్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024లో రెచ్చిపోతున్నాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. సిక్సుల వర్షం కురిపిస్తున్నాడు. తాజాగా జరిగిన మ్యాచ్ లో కేవలం 12 బంతుల్లోనే..

కొనసాగుతున్న రస్సెల్ ఊచకోత.. ఈ సారి 12 బంతుల్లోనే..

ప్రపంచ క్రికెట్ లో వెస్టిండీస్ ప్లేయర్లు విధ్వంసానికి పెట్టింది పేరు. క్రిస్ గేల్, బ్రావో, పావెల్, పొలార్డ్, ఆండ్రీ రస్సెల్ లాంటి ఎందరో హిట్టర్లు సిక్సర్లు, ఫోర్లతో క్రికెట్ లవర్స్ ను ఉర్రూతలూగించారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో విండీస్ వీరుడు ఆండ్రీ రస్సెల్ ఊచకోతను కొనసాగిస్తున్నాడు. ఈ లీగ్ లో కొమిల్లా విక్టోరియన్స్ టీమ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇతడు రంగ్ పూర్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో విధ్వంసం సృష్టించాడు. ఫోర్లు, సిక్సర్లతో..

ఆండ్రీ రస్సెల్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో శివాలెత్తిపోయాడు. తాజాగా రంగ్ పూర్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. కేవలం 12 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 43 పరుగులతో అజేయంగా నిలిచి.. ఒంటిచేత్తో తన టీమ్ కు విజయాన్ని కట్టబెట్టాడు. ప్రత్యర్థి బౌలర్లపై కనికరం లేకుండా సిక్సులు, ఫోర్ల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రంగ్ పూర్ రైడర్స్ 19.5 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది. రస్సెల్ బౌలింగ్ లోనూ చెలరేగిపోయాడు. 2.5 ఓవర్లలో 20 పరుగులు చేసి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటుగా ముస్ఫిక్ హసన్(3/18), మథ్యూ ఫోర్డ్(2/32) వికెట్లతో రాణించారు.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన విక్టోరియా టీమ్ రస్సెల్ విధ్వంసం ధాటికి కేవలం 17.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సాధించాల్సిన టార్గెట్ చిన్నదే అయినప్పటికీ.. రస్సెల్ మాత్రం కనికరం చూపకుండా దంచికొట్టాడు. అతడు బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ప్రత్యర్థి ఆటగాళ్లు ప్రేక్షకపాత్ర వహించారు. ఈ ఇన్నింగ్స్ లో రస్సెల్ స్ట్రైక్ రేట్.. ఏకంగా 358.33 అంటేనే అర్ధం చేసుకోవచ్చు.. అతడి ఊచకోత ఏ రేంజ్ లో ఉందో. మరి ఈ విండీస్ వీరుడి థండర్ ఇన్నింగ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ICC ర్యాకింగ్స్‌లో సత్తాచాటిన రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్‌!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి