iDreamPost
android-app
ios-app

గిల్ కు ఆ సత్తా ఉంది.. శతక వీరుడిపై సౌతాఫ్రికా దిగ్గజం ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

చెన్నై సూపర్ కింగ్స్ పై అద్భుత శతకం సాధించిన గుజరాత్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ పై ప్రశంసల వర్షం కురిపించాడు సౌతాఫ్రికా దిగ్గజ ప్లేయర్. ఆ సత్తా గిల్ కు ఉందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

చెన్నై సూపర్ కింగ్స్ పై అద్భుత శతకం సాధించిన గుజరాత్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ పై ప్రశంసల వర్షం కురిపించాడు సౌతాఫ్రికా దిగ్గజ ప్లేయర్. ఆ సత్తా గిల్ కు ఉందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

గిల్ కు ఆ సత్తా ఉంది.. శతక వీరుడిపై సౌతాఫ్రికా దిగ్గజం ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

హార్దిక్ పాండ్యా క్యాష్ ఆన్ ట్రేడ్ విధానం ద్వారా ముంబై ఇండియన్స్ వెళ్లడంతో.. గుజరాత్ టీమ్ పగ్గాలను చేపట్టాడు యంగ్ ప్లేయర్ శుబ్ మన్ గిల్. అయితే గిల్ కు కెప్టెన్ గా అనుభవం లేకపోవడంతో అతడు జట్టును ఎలా ముందుకు నడిపిస్తాడో అన్న సందేహం అందరిలో నెలకొంది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ప్రారంభ మ్యాచ్ లో అద్భుతమైన కెప్టెన్సీతో విజయాలు అందించాడు. అయితే మధ్యలో గుజరాత్ గాడితప్పింది. దాంతో వరుస పరాజయాలు చవిచూస్తూ.. ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించే స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే, తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో చెన్నైని 35 రన్స్ తో చిత్తు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో సాయి సుదర్శన్, శుబ్ మన్ గిల్ ఇద్దరూ శతకాలతో చెలరేగారు. ఈ సందర్భంగా శతక వీరుడు గిల్ పై ప్రశంసలు కురిపించాడు సౌతాఫ్రికా దిగ్గజం గ్రేమ్ స్మిత్.

ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న చెన్నైతో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. 55 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సులతో 104 పరుగులు చేశాడు. దీంతో గుజరాత్ భారీ స్కోర్ సాధించడమే కాకుండా.. విజయం కూడా నమోదు చేసింది. ఈ సందర్భంగా అద్భుత సెంచరీ సాధించిన శుబ్ మన్ గిల్ పై ప్రశంసల వర్షం కురిపించాడు సౌతాఫ్రికా దిగ్గజం గ్రేమ్ స్మిత్. “శుబ్ మన్ గిల్ ప్రతి సంవత్సరం మెరుగ్గా రాణిస్తున్నాడు. అయితే ఈ ఐపీఎల్ లో ఆరంభంలో కాస్త ఇబ్బంది పడినట్లు కనిపించినా.. ప్రస్తుతం సూపర్ ఫామ్ లోకి దూసుకొచ్చాడు. కెప్టెన్ గా తొలిసారి టీమ్ ను నడిపిస్తున్నాడు కాబట్టి కొద్దిగా ఒత్తిడి అతడిపై ఉంటుంది. ఇటు కెప్టెన్ గా, అటు బ్యాటర్ గా రాణించడం ఎలాగో గిల్ కు బాగా తెలుసు. త్వరగా నేర్చుకునే సత్తా గిల్ సొంతం. మరీ ముఖ్యంగా అతడు ఈ మ్యాచ్ లో గ్రౌండ్ నలువైపులా కొట్టిన షాట్లు అద్భుతం” అంటూ గిల్ ఆటతీరుపై పొగడ్తల వర్షం కురిపించాడు.

ఇదిలా ఉండగా.. ఈ సీజన్ లో 12 మ్యాచ్ లు ఆడి 426 రన్స్ చేశాడు శుబ్ మన్. ఇటు కెప్టెన్ గా, అటు బ్యాటర్ గా గుజరాత్ ను తన శక్తిమేరకు నడిపిస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్ గెలిచిన సంతోషంలో ఉన్న గుజరాత్ కు ఊహించని షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా శుబ్ మన్ గిల్ కు రూ. 24 జరిమానా విధించగా.. టీమ్ లోని ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 25 శాతం లేదా రూ. 6 లక్షల ఫైన్ వేసింది ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి