iDreamPost
android-app
ios-app

‘రోహిత్ శర్మ టాస్ ఫిక్సింగ్’.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు..

  • Author Soma Sekhar Published - 02:31 PM, Thu - 16 November 23

మరోసారి టీమిండియాపై తమ కుళ్లు బుద్దిని వెళ్లగక్కారు పాక్ మాజీ ఆటగాడు. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని సంచలన ఆరోపణలు చేశాడు పాక్ మాజీ ప్లేయర్ సికిందర్ బఖ్త్.

మరోసారి టీమిండియాపై తమ కుళ్లు బుద్దిని వెళ్లగక్కారు పాక్ మాజీ ఆటగాడు. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని సంచలన ఆరోపణలు చేశాడు పాక్ మాజీ ప్లేయర్ సికిందర్ బఖ్త్.

  • Author Soma Sekhar Published - 02:31 PM, Thu - 16 November 23
‘రోహిత్ శర్మ టాస్ ఫిక్సింగ్’.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు..

వరల్డ్ కప్ 2023లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తూ.. దర్జాగా ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇక విజయాలను జీర్ణించుకోలేకపోతున్న పాక్ పూటకో ఆరోపణ, రోజుకో నింద వేస్తూ పబ్బం గడుపుకుంటోంది. ఈ మెగాటోర్నీలో పాక్ దారుణ వైఫల్యాలకు కారణం ఇండియా పిచ్ లే అని ఇటీవలే పాక్ మాజీలు తమ వక్రబుద్ధిని చూపించారు. ఈ ప్రపంచ కప్ ఐసీసీ టోర్నీలా లేదని బీసీసీఐ టోర్నీలా ఉందని అర్ధం పర్ధం లేని మాటలు మాట్లాడారు. తాజాగా మరోసారి టీమిండియాపై తమ కుళ్లు బుద్దిని వెళ్లగక్కారు పాక్ మాజీ ఆటగాళ్లు. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని సంచలన ఆరోపణలు చేశాడు పాక్ మాజీ ప్లేయర్ సికిందర్ బఖ్త్.

వరల్డ్ కప్ లో టీమిండియా అద్భుత ప్రదర్శన పట్ల పాక్ దిగ్గజాలు వసీమ్ అక్రమ్, షోయబ్ అక్తర్ లు ప్రశంసలు కురిపిస్తుంటే.. కుళ్లుతో కళ్లు మూసుకుపోయిన మిగతా ఆటగాళ్లు మాత్రం పనికిమాలిన ఆరోపణలు చేస్తూ.. పబ్బం గడుపుతున్నారు. తాజాగా పాక్ మాజీ క్రికెటర్ ఇప్పుడు ఏకంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఫిక్సింగ్ ఆరోపణలు గుప్పించాడు. వరల్డ్ కప్ లో తాజాగా జరిగిన ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ లో రోహిత్ శర్మ టాస్ ఫిక్సింగ్ చేశాడని సంచలన ఆరోపణలు చేశాడు పాక్ మాజీ ప్లేయర్ సికందర్ బఖ్త్. రోహిత్ ప్రత్యర్థి కెప్టెన్ కు, ఐసీసీ అధికారులకు దూరంగా టాస్ కాయిన్ విసురుతున్నాడని దీంతో టీమిండియాకు అనుకూలంగా ఫలితం వస్తోందని అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేశాడు. టాస్ కాయిన్ చూసే వ్యక్తిని బీసీసీఐ మేనేజ్ చేయడం వల్లే ఇదంతా జరుగుతోందని పొంతనలేని మాటలు మాట్లాడాడు.

ఇక మరో పాకిస్థానీ ఏకంగా వీడియో తీసి మరి రోహిత్ టాస్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని టీవీల్లో మెుత్తుకుంటున్నారు. ఇక ఈ ఆరోపణలపై టీమిండియా ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా తయ్యరైంది పాక్ అంటూ విమర్శిస్తున్నారు. ఇక ఈ ఆరోపణలపై ఘాటుగా బదులిస్తున్నారు టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్. ఆఫ్గానిస్తాన్ తో మ్యాచ్ లో బాబర్ కూడా ఇలాగే దూరంగా కాయిన్ విసిరి టాస్ గెలిచాడని వీడియోను పోస్ట్ చేస్తున్నారు. మరి ఇండియన్ ప్లేయర్లపై విమర్శలు చేస్తూ.. పబ్బం గడుపుకుంటున్న పాక్ మాజీ క్రికెటర్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.