iDreamPost

విరాట్ కోహ్లీ స్వార్థపరుడు.. చౌకబారు కామెంట్స్ చేసిన పాక్ మాజీ కెప్టెన్!

టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీపై నోరుపారేసుకున్నాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హాఫీజ్. కోహ్లీ స్వార్థపరుడు అంటూ చౌకబారు కామెంట్స్ చేశాడు. దాంతో ఫ్యాన్స్ అతడిపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు.

టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీపై నోరుపారేసుకున్నాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హాఫీజ్. కోహ్లీ స్వార్థపరుడు అంటూ చౌకబారు కామెంట్స్ చేశాడు. దాంతో ఫ్యాన్స్ అతడిపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు.

విరాట్ కోహ్లీ స్వార్థపరుడు.. చౌకబారు కామెంట్స్ చేసిన పాక్ మాజీ కెప్టెన్!

టీమిండియా ప్లేయర్లపై విమర్శలు గుప్పించడానికి పాకిస్తాన్ క్రికెటర్లు ఎప్పుడు సందు దొరుకుతుందా.. అని చూస్తుంటారు. ఒక్కోసారి సమయం సందర్భం లేకున్నా గానీ నోటికొచ్చినట్లు వాగుతూ ఉంటారు. తమ జట్టు ఏదో ఛాంపియన్ అయినట్లు గొప్పలు చెప్పుకుంటారు. కానీ తాజాగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ టీమ్ గ్రూప్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టిన విషయం అందరికీ తెలిసిందే. దాంతో ప్రపంచ వ్యాప్తంగా పాక్ క్రికెటర్లపై విమర్శలు గుప్పించారు దిగ్గజ క్రికెటర్లు, నెటిజన్లు, క్రికెట్ లవర్స్. ఇవన్నీ మర్చిపోయి.. తాజాగా విరాట్ కోహ్లీ స్వార్థపరుడు అంటూ చౌకబారు కామెంట్స్ చేశాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్.

టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీపై నోరుపారేసుకున్నాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హాఫీజ్. ఓ పాడ్ కాస్ట్ లో అతడు మాట్లాడుతూ..”ఏ బ్యాటరైనా సరే బ్యాటింగ్ చేసేటప్పుడు అతడి ఉద్దేశం మ్యాచ్ ను గెలిపించడమే. కానీ చాలా మంది ప్లేయర్లు 90 పరుగుల తర్వాత సెంచరీ చేరుకోవడానికి ఎక్కువ బంతులను వృధా చేస్తుంటారు. దానిని నేను అంగీకరించను. 90 నుంచి 100కు చేరుకోవడానికి 3 లేదా 4 బంతులు ఆడితే పర్వాలేదు. కానీ 10 నుంచి 15 బంతులు తీసుకుంటున్నారు. సౌతాఫ్రికాతో జరిగిన ఓ మ్యాచ్ లో కూడా విరాట్ కోహ్లీ ఇలానే ఆడాడు. సెంచరీ మార్క్ ను చేరుకోవడానికి చాలా బాల్స్ వేస్ట్ చేశాడు. అందుకే అతడిని నేను సెల్ఫీష్ అంటాను” అంటూ ఆ పాడ్ కాస్ట్ లో చెప్పుకొచ్చాడు పాక్ మాజీ కెప్టెన్.

కాగా.. 2023 వన్డే ప్రపంచ కప్ లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 121 బంతుల్లో 10 ఫోర్లతో 101 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు కోహ్లీ. ఆ మ్యాచ్ లో టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. అనంతరం భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన సఫారీ టీమ్ 83 రన్స్ కే ఆలౌట్ అయ్యి.. 243 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. ఇక హాఫీజ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్స్ ఇస్తున్నారు విరాట్ ఫ్యాన్స్. అసలు నీకు అతడి గురించి మాట్లాడే అర్హతే లేదు, కోహ్లీ రికార్డ్స్ చూస్తేనే నువ్వు భయపడతావు అలాంటిది నువ్వు కోహ్లీ గురించి కామెంట్ చేస్తావా? అంటూ తిడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి