iDreamPost
android-app
ios-app

Rohit Sharma: SRHలోకి రోహిత్ శర్మ! ఇదే జరిగితే.. మనల్ని ఎవడ్రా ఆపేది?

  • Published Dec 16, 2023 | 4:16 PM Updated Updated Dec 16, 2023 | 4:20 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ చర్చ జరుగుతోంది. అదేంటంటే? రోహిత్ శర్మ ముంబై టీమ్ ను వదిలి బయటకి వస్తే.. సన్ రైజర్స్ హైదరాబాద్ లోకి రావాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ చర్చ జరుగుతోంది. అదేంటంటే? రోహిత్ శర్మ ముంబై టీమ్ ను వదిలి బయటకి వస్తే.. సన్ రైజర్స్ హైదరాబాద్ లోకి రావాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు.

Rohit Sharma: SRHలోకి రోహిత్ శర్మ! ఇదే జరిగితే.. మనల్ని ఎవడ్రా ఆపేది?

IPL 2024.. ఈ సీజన్ ప్రారంభం కాకముందు నుంచే అనేక సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలస్తోంది. ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద క్యాష్ ఆన్ ట్రేడింగ్, ఆ వెంటనే హార్దిక్ పాండ్యా ముంబై కెప్టెన్ గా ఎంపికవ్వడం, ఇప్పుడు ముంబైకి రోహిత్ గుడ్ బై చెప్పబోతున్నాడు అన్న వార్తలు వైరల్ గా మారాయి. ఈ నేపథ్యలో మరో కొత్త వాదన తెరపైకి వచ్చింది. అదేంటంటే? ఐపీఎల్ 17వ ఎడిషన్ 2024లో రోహిత్ శర్మ సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగబోతున్నాడని , ఇటు SRH ఫ్యాన్స్ కూడా రోహిత్ తమ అభిమాన టీమ్ లోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది.

ముంబై ఇండియన్స్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు రోహిత్ శర్మ. దీంతో ఏ క్షణంలోనైనా ఆ ఫ్రాంచైజీ నుంచి బయటకు రావొచ్చన్న వార్తలు క్రీడా ప్రపంచంలో కోడై కూస్తున్నాయి. ఈ నేపథ్యంలో హిట్ మ్యాన్ ఏ ఫ్రాంచైజీలోకి వెళ్లడానికి మెుగ్గు చూపుతాడు అన్న ప్రశ్న అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. ఈ క్రమంలో అతడిని దక్కించుకోవడానికి చాలా ఫ్రాంచైజీలు పోటీ పడొచ్చు. అయితే రోహిత్ శర్మకు బెస్ట్ ఆఫ్షన్ గా ఉన్న ఏకైక టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్. గత కొంత కాలంగా స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. ఆ టీమ్ దారుణంగా విఫలం అవుతూ వస్తోంది. అప్పుడెప్పుడో డెక్కన్ ఛార్జర్స్ పేరుతో ఉన్నప్పుడు ఐపీఎల్ ట్రోఫీని గెలిచింది హైదరాబాద్. ఆ తర్వాత మళ్లీ అంతటి ఆటతీరును ప్రదర్శించలేకపోయింది.

rohit sharma in srh

ఇక గత కొంతకాలంగా తీసిపోయిన కెప్టెన్సీతో, ఆటతీరుతో అబాసుపాలవుతూ వస్తోంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ ను సన్ రైజర్స్ జట్టులోకి వచ్చి.. సారథ్య పగ్గాలు చేపట్టాలని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. ఇటు ఫ్రాంచైజీ కూడా రోహిత్ లాంటి నాయకత్వం కోసం ఎదురుచూస్తోంది. హిట్ మ్యాన్ ఒకవేళ ముంబై నుంచి బయటకటి వస్తే.. కచ్చితంగా SRH బెస్ట్ ప్లేస్ అవుతుంది. ఎందుకంటే? మిగతా జట్లలో ఇప్పటికే స్టార్ ప్లేయర్లు సారథులుగా కొనసాగుతున్నారు. పైగా సన్ రైజర్స్ రోహిత్ లాంటి పటిష్టమైన నాయకత్వ, బ్యాటర్ కోసం ఎన్నో సీజన్లుగా ఎదురుచూస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ లాంటి ప్లేయర్ హైదరాబాద్ టీమ్ కు అవసరం అని, రోహిత్ భాయ్ నువ్వొచ్చెయ్ అంటూ SRH ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆహ్వానిస్తున్నారు.

కాగా.. ప్రస్తుతం సౌతాఫ్రికా స్టార్ ఐడెన్ మార్క్రమ్ కు సారథ్య బాధ్యతలు అప్పగించింది సన్ రైజర్స్. అయితే ఇప్పటి వరకు హైదరాబాద్ టీమ్ కు సరైన కెప్టెన్ లేడనే చెప్పాలి. ఈ లోటును భర్తీ చేసే మెునగాడు ఒక్క రోహిత్ శర్మే అని అతడు జట్టులోకి రావాలని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. ఇదే కనక జరిగితే SRH ఫ్యాన్స్ మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ కాలర్ ఎగరేసి తిరగొచ్చని అంటున్నారు. మరి రోహిత్ SRHలోకి రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.