Somesekhar
5 రన్స్ పెనాల్టీ విషయంలో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీరుపై రియాక్ట్ అయ్యాడు ఇంగ్లాండ్ దిగ్గజం అలిస్టర్ కుక్. ఇది అశ్విన్ వ్యూహంలో భాగమే కానీ..
5 రన్స్ పెనాల్టీ విషయంలో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీరుపై రియాక్ట్ అయ్యాడు ఇంగ్లాండ్ దిగ్గజం అలిస్టర్ కుక్. ఇది అశ్విన్ వ్యూహంలో భాగమే కానీ..
Somesekhar
ఇంగ్లాండ్ తో రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ లో రెండో రోజు ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతడు పిచ్ పై డేంజర్ జోన్(బౌలింగ్ వేసినప్పుడు బాల్ పడే ప్లేస్)లో పరిగెత్తడంతో.. అతడికి ఒకటికి రెండు సార్లు వార్నింగ్ ఇచ్చాడు. అయినప్పటికీ.. అశ్విన్ మరోసారి అలానే పరిగెత్తడంతో అంపైర్ ఇంగ్లాండ్ కు అదనంగా 5 పరుగులు ఇచ్చాడు. దీంతో వారు సున్నా పరుగుల నుంచి కాకుండా.. 5 రన్స్ నుంచే బ్యాటింగ్ ప్రారంభిస్తారు. ఇక ఈ విషయంపై ఇంగ్లాండ్ దిగ్గజ బ్యాటర్ అలిస్టర్ కుక్ స్పందించాడు.
ప్రపంచ క్రికెట్ లోకి ఐసీసీ కొత్త కొత్త రూల్స్ తెస్తూ ఉంటుంది. ఇటీవలే తెచ్చిన న్యూ రూల్ తో ఇంగ్లాండ్ కు 5 రన్స్ ఫ్రీగా లభించాయి. ఇండియాతో రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ లో ఈ సంఘటన నమోదైంది. రెండోరోజు ఆటలో 102వ ఓవర్లలో ఈ సంఘటన చోటుచేసుకుంది. రెహాన్ అహ్మద్ వేసిన ఈ ఓవర్ మూడో బంతికి అశ్విన్ డేంజర్ జోన్ లో పరిగెత్తాడు. దీంతో అంపైర్ టీమిండియాకు పెనాల్టీ విధించి.. ఇంగ్లాండ్ జట్టుకు 5 రన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా.. దీనిపై రియాక్ట్ అయ్యాడు ఇంగ్లాండ్ మాజీ దిగ్గజ ప్లేయర్ అలిస్టర్ కుక్.
“అశ్విన్ ఈరోజు చేసింది క్రీడా స్ఫూర్తికి విరుద్దం. అతడు మిడిల్ స్టప్ లో పిచ్ ను డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించాడు. తద్వారా తాను బౌలింగ్ వేసేటప్పుడు అది వినియోగించుకోవాలని చూశాడు. ఇది అతడి వ్యూహంలో భాగం కావొచ్చు. కానీ ఇది ఆటలో నిబంధనలకు పూర్తిగా విరుద్దం” అంటూ TNT స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 445 పరుగులు ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ రోహిత్ శర్మ(131), జడేజా(112), డెబ్యూ హీరో సర్ఫరాజ్ ఖాన్(62) పరుగులతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్ మార్క్ వుడ్ 4 వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ బజ్ బాల్ ఆటను మరోసారి టీమిండియాకు రుచిచూపిస్తోంది. 29 ఓవర్లకే వికెట్ నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్ బెన్ డకెట్ సెంచరీతో చెలరేగాడు. మరి అశ్విన్ పై అలిస్టర్ కుక్ చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Here’s why England started their innings at 5/0, and Alastair Cook’s thoughts on the penalised action that led to it #INDvENG
Read ▶️ https://t.co/1DzPW75kuE pic.twitter.com/eWMfvaIuXv
— ESPNcricinfo (@ESPNcricinfo) February 16, 2024
ఇదికూడా చదవండి: Anand Mahindra: సర్ఫరాజ్ తండ్రికి ఆనంద్ మహీంద్ర ఊహించని గిఫ్ట్!