iDreamPost

Anand Mahindra: సర్ఫరాజ్ తండ్రికి ఆనంద్ మహీంద్ర ఊహించని గిఫ్ట్!

ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ ద్వారా టీమిండియాలోకి అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్.. తొలి మ్యాచ్ లోనే సత్తాచాటాడు. దీంతో సర్ఫరాజ్ ను అంతటివాడిని చేసిన తండ్రి నౌషద్ ఖాన్ కు ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర.

ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ ద్వారా టీమిండియాలోకి అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్.. తొలి మ్యాచ్ లోనే సత్తాచాటాడు. దీంతో సర్ఫరాజ్ ను అంతటివాడిని చేసిన తండ్రి నౌషద్ ఖాన్ కు ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర.

Anand Mahindra: సర్ఫరాజ్ తండ్రికి ఆనంద్ మహీంద్ర ఊహించని గిఫ్ట్!

సర్ఫరాజ్ ఖాన్.. ప్రస్తుతం టీమిండియాతో పాటుగా సోషల్ మీడియాలో మారుమ్రోగుతున్న పేరు. ఆడిన తొలి మ్యాచ్ లోనే ఎలాంటి భయం లేకుండా.. ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొని 48 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టి అందరి చేత మన్ననలు పొందుతున్నాడు. డొమెస్టిక్ క్రికెట్ లో పరుగులవరద పారించిన ఈ స్టార్ క్రికెటర్ కు చాలా కాలం నిరీక్షణ తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కింది. ఇక సర్ఫరాజ్ టీమిండియాకు ఎంపిక అవ్వడం వెనుక అతడి తండ్రి నౌషద్ ఖాన్ కృషి మరువలేనిది. ఎన్ని కష్టాలు వచ్చినా.. తన కొడుకు కలను నెరవేర్చేందుకు ఆ తండ్రి పడిన కష్టానికి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర మంత్రముగ్ధుడు అయ్యాడు. దీంతో సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషద్ ఖాన్ కు ఊహించని గిఫ్ట్ ప్రకటించాడు.

ఆనంద్ మహీంద్ర.. ప్రపంచంలో ఏ మూలన టాలెంట్ ఉన్నా ప్రశంసిస్తూ.. వారికి తగిన సాయం చేస్తూ ఉంటాడు. సోషల్ మీడియాలో తనను ఫిదా చేసిన వీడియోలను షేర్ చేస్తూ ఉంటాడు ఈ పారిశ్రామిక దిగ్గజం. మరోసారి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. టీమిండియా లేటెస్ట్ సెన్సేషన్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రిని ఉద్దేశించి భావోద్వేగపూరితమైన ట్వీట్ చేయడంతో పాటుగా ప్రశంసల్లో ముంచెత్తాడు.

ఆ ట్వీట్ లో..”కృషి, పట్టుదల, సాధించాలనే తపన, కఠోర శ్రమ ఉంటే ఏదైనా సాధించగలం. ఇక ఇంతకంటే గొప్ప లక్షణాలు ఏముంటాయి ఒక తండ్రి పిల్లల్లో స్ఫూర్తి నింపడానికి. అందుకే ఇలాంటి గొప్ప తండ్రికి నేను థార్ బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను. ఇది నాకూ గౌరవమే. అయితే చిరు కానుకను ఆయన స్వీకరిస్తారని ఆశీస్తున్నాను” అంటూ ఆ ట్వీట్ లో రాసుకొచ్చాడు ఆనంద్ మహీంద్ర. ఇక తొలి టెస్ట్ లోనే 62 పరుగులు చేసి అదరగొట్టాడు సర్ఫరాజ్ ఖాన్. 97 జెర్సీ నంబర్ ధరించడం వెనక ఉన్న రీజన్ ను చెప్పాడు. తన తండ్రి నౌషద్ ఖాన్ పేరులోని నౌ నుంచి 9, షాద్ నుంచి 7 నంబర్లను తీసుకున్నట్లుగా మూడో టెస్ట్ కు ముందు చెప్పుకొచ్చాడు. ఇక సర్ఫరాజ్ సోదరుడు ముషీర్ ఖాన్ సైతం జెర్సీ నంబర్ 97 కావడం విశేషం. మరి సర్ఫరాజ్ ఖాన్ తండ్రికి ఆనంద్ మహీంద్ర థార్ గిఫ్ట్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: IND vs ENG: వీడియో: ఎగతాళి చేస్తూ.. జడేజాను దారుణంగా అవమానించిన అండర్సన్‌!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి