సౌతాఫ్రికాకు కొత్త సూపర్‌స్టార్ దొరికేశాడు. ధనాధన్ బ్యాటింగ్‌తో అదరగొడుతున్న ఆ క్రికెటర్.. మంచి పేస్‌తో బౌలింగ్ వేస్తూ కీలక టైమ్‌లో వికెట్లు తీస్తున్నాడు. ఆ ప్లేయర్ ఎవరో గుర్తుపట్టారా?
సౌతాఫ్రికాకు కొత్త సూపర్‌స్టార్ దొరికేశాడు. ధనాధన్ బ్యాటింగ్‌తో అదరగొడుతున్న ఆ క్రికెటర్.. మంచి పేస్‌తో బౌలింగ్ వేస్తూ కీలక టైమ్‌లో వికెట్లు తీస్తున్నాడు. ఆ ప్లేయర్ ఎవరో గుర్తుపట్టారా?
వన్డే వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా అదరగొడుతోంది. మెగా టోర్నీ మొదలవ్వడానికి ముందు సఫారీ జట్టుపై ఎవరికీ పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. బ్యాటింగ్‌లో క్లాసెన్, మార్క్రమ్, మిల్లర్ లాంటి స్టార్లు ఉన్నా వాళ్లు ఎంతవరకు రాణిస్తారో చెప్పలేని పరిస్థితి. వీళ్లు నిలకడగా, కలసికట్టుగా ఆడగలరా అనే సందేహం ఉండేది. కగిసో రబాడ, లుంగీ ఎంగిడీ మాత్రమే ఆ టీమ్ బౌలింగ్ అటాక్‌లో చెప్పుకోదగ్గ పేర్లు. దీంతో ప్రత్యర్థులను బవుమా సేన ఆలౌట్ చేయగలదా అనే అనుమానం తలెత్తింది. అయితే టోర్నీలోకి అండర్‌డాగ్స్‌గా అడుగు పెట్టిన సౌతాఫ్రికా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. పసికూన నెదర్లాండ్స్ చేతిలో ఓటమిని మినహాయిస్తే ఆడిన మిగిలిన అన్ని మ్యాచుల్లోనూ నెగ్గి హాట్ ఫేవరెట్స్‌గా అవతరించింది.
బ్యాటింగ్‌లో సీనియర్లు డికాక్, మిల్లర్‌తో పాటు రీజా హెండ్రిక్స్, వాండర్ డస్సెన్, మార్క్రమ్ రాణిస్తున్నారు. బౌలింగ్‌లో ఎంగిడి, రబాడలకు తోడు గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహారాజ్ చెలరేగుతుండటంతో సౌతాఫ్రికాను ఆపడం ఎవరి వల్లా కావడం లేదు. అయితే పైన చెప్పిన ప్లేయర్ల కంటే సఫారీ టీమ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న మరో ఆటగాడు ఉన్నాడు. అతనే మార్కో జాన్సేన్. 23 ఏళ్ల ఈ యంగ్ ఆల్‌రౌండర్ అటు బౌలింగ్‌తో పాటు ఇటు బ్యాటింగ్‌లోనూ రాణిస్తూ టీమ్‌కు మంచి బ్యాలెన్స్ తీసుకొస్తున్నాడు. జహీర్ ఖాన్‌లా లెఫ్టార్మ్ పేసర్ అయిన జాన్సేన్.. బ్రేక్ త్రూ అవసరమైన టైమ్‌లో వికెట్లు తీస్తున్నాడు. బ్యాటింగ్‌లోనూ అదరగొడుతూ ఏడో నంబర్లో విలువైన రన్స్ చేస్తూ టీమ్ భారీ స్కోరును అందుకోవడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు.
ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఒక దశలో సౌతాఫ్రికా 300 రన్స్ చేస్తుందా అనే డౌట్ వచ్చింది. ఆ టైమ్‌లో అగ్నికి ఆయువులా క్లాసెన్‌కు తోడైన జాన్సెన్ (42 బంతుల్లో 78) ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఇంగ్లీష్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. దీంతో ఆ టీమ్ ఏకంగా 399 రన్స్ చేసింది. జాన్సెన్ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ రెండు వికెట్లు తీసి గెలుపులో కీలకంగా వ్యవహరించాడు. బౌలింగ్‌లో జహీర్లా కవ్వించి ఔట్ చేస్తున్న జాన్సేన్.. బ్యాటింగ్‌లో యువరాజ్‌లా ప్రత్యర్థులపై భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు. అతడు ఇదే నిలకడతో ఆడుతూ పోతే ఫ్యూచర్లో స్టార్ ప్లేయర్‌గా ఎదిగే ఛాన్స్ ఉంది. జాన్సేన్ ఆట చూసిన ఫ్యాన్స్ అతడ్ని నయా సూపర్ స్టార్ అంటున్నారు. మరి.. జాన్సెన్ గేమ్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రోహిత్ అంత రాణిస్తున్నా క్లాసెన్ వెనుకే.. ఆ విషయంలో సఫారీ బ్యాట్స్‌మనే గొప్ప!
Marco Jansen – the superstar!
75* (42) with 3 fours and 6 sixes – he set the stage on fire at the Wankhede Stadium, what a knock from him. A proud day for South African batters. pic.twitter.com/xgtTkWl5fo
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 21, 2023