Nidhan
DRS In Cricket: ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచుల్లో డీఆర్ఎస్ను వాడుతుంటారనేది తెలిసిందే. ఈ టెక్నాలజీ సాయంతో ఔట్ల విషయంలో మరింత కచ్చితత్వంతో నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కలుగుతోంది.
DRS In Cricket: ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచుల్లో డీఆర్ఎస్ను వాడుతుంటారనేది తెలిసిందే. ఈ టెక్నాలజీ సాయంతో ఔట్ల విషయంలో మరింత కచ్చితత్వంతో నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కలుగుతోంది.
Nidhan
టెక్నాలజీ వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. అధునాతన సాంకేతికతను అన్ని రంగాలు అందిపుచ్చుకుంటున్నాయి. క్రీడా రంగం దీనికి మినహాయింపేమీ కాదు. క్రికెట్లో కూడా మోడర్న్ టెక్నాలజీ వాడకం ఎక్కువగానే ఉంది. ఆడియెన్స్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను మరింత మెరుగుపర్చేందుకు ఇది ఉపయోగపడుతోంది. క్రికెట్ మ్యాచెస్‌లో టెక్నాలజీ ఆధారంగా చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచుల్లో డీఆర్ఎస్ను వాడుతుంటారనేది తెలిసిందే. ఈ టెక్నాలజీ సాయంతో ఔట్ల విషయంలో మరింత కచ్చితత్వంతో డెసిషన్స్ తీసుకునే వెసులుబాటు కలుగుతోంది. డెసిషన్ రివ్యూ సిస్టమ్ వల్ల మ్యాచులు తారుమారైన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి.
ఫార్మాట్‌ను బట్టి మ్యాచుల్లో డీఆర్ఎస్ తీసుకునేందుకు జట్లకు అవకాశాలు ఇస్తారు. అంపైర్ ప్రకటించే నిర్ణయాలు సరికాదని భావిస్తే డీఆర్ఎస్ ద్వారా థర్డ్ అంపైర్‌కు అప్పీల్ చేయాలి. అప్పుడు థర్డ్ అంపైర్ దాన్ని సమీక్షించి ఫైనల్ డెసిషన్ ప్రకటిస్తాడు. టెక్నాలజీ అప్‌గ్రేడ్ అవుతున్న కొద్దీ డీఆర్ఎస్లోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఈ సాంకేతికత ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు మాత్రమే పరిమితమైంది. క్యాచ్‌లు, రనౌట్లు, స్టంపౌట్లు, ఎల్బీడబ్ల్యూలు లాంటి నిర్ణయాల్లో రీప్లేలు లేనిదే ఏదీ తేల్చలేరు. రీప్లేలు కావాలంటే ఖరీదైన కెమెరా ఎక్విప్మెంట్తో టెక్నాలజీ సాయం కూడా కావాలి. అందుకే లోకల్ మ్యాచుల్లో ఇది కనిపించదు. కానీ ఇక మీదట మీరు ఆడే క్రికెట్లోనూ డీఆర్ఎస్ను వాడుకోవచ్చు. దానికి ఓ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మీరు ఆడే క్రికెట్లోనూ డీఆర్ఎస్ ఆప్షన్ కావాలంటే ఓ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. అదే ఫుల్ట్రాక్ ఏఐ యాప్. ప్లేస్టోర్‌లోకి వెళ్లి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు క్రికెట్ ఆడే చోట బౌలింగ్ ఎండ్‌లో వికెట్ల వెనుక ఒక ట్రైపాడ్ పెట్టి మొబైల్‌ను అమర్చాలి. ఆ తర్వాత ఆ యాప్ ఓపెన్ చేసి మ్యాచ్‌ను రికార్డు చేయాలి. ఏదైనా ఔట్ విషయంలో డౌట్ వచ్చినప్పుడు యాప్‌ను చూస్తే సమాధానం దొరికేస్తుంది. బ్యాటర్ ఎల్బీడబ్ల్యూనా? కాదా? అనేది ఇది చూపిస్తుంది. అలాగే ఆ బాల్ ఎంత స్పీడ్‌తో వచ్చింది? ఎన్ని డిగ్రీలు స్పిన్ అయింది? ఎంతగా స్వింగ్ అయింది? కూడా తెలుసుకోవచ్చు. పిచ్ మ్యాప్‌ను కూడా ఇందులో చూడొచ్చు. మరి.. మీరు ఆడే క్రికెట్లోనూ ఈ యాప్‌ను వాడేందుకు ఆసక్తిగా ఉన్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.